ప్రకాశం

కాపులను బీసీల్లో చేర్చేందుకు ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంభం, నవంబర్ 12: కాపులను బీసీల్లో చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని ఉప ముఖ్యమంత్రి, హోమంత్రి నిమ్మకాయల చిన్నరాజప్ప అన్నారు. ఆదివారం కంభం చెరువుకట్టపై కాపులు ఏర్పాటు చేసిన కార్తీక వనభోజన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆయన హాజరయ్యారు. అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిన్నరాజప్ప మాట్లాడుతూ కాపులు ఐక్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చునని, కలతలు లేకుండా ఐకమత్యంగా ఉండాలని, త్వరలో కాపు, బలిజ, ఒంటరి కులాలను బీసీలుగా చేర్చేందుకు డిసెంబర్‌లోపు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. మంజునాథ కమిషన్ రిపోర్టును డిసెంబర్ లోపు అందచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారని అన్నారు. అలాగే కంభం చెరువును పర్యాటక కేంద్రంగా గుర్తించేందుకు తగు చర్యలు తీసుకునేవిధంగా ప్రయత్నిస్తానని, ఈవిషయం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తానని అన్నారు. అలాగే ఎస్సీ, బీసీ, మైనార్టీలు పేదకుటుంబాల్లో ఆడపిల్లల పెళ్ళికి 30 నుంచి 50వేల రూపాయల వరకు అందచేయడం జరుగుతుందని అన్నారు. పేదమహిళలకు కుట్టుమిషన్లు అందించడం జరుగుతుందని తెలిపారు. విదేశీ చదువులు చదివేవారికి రాష్ట్ర ప్రభుత్వం రుణసదుపాయం కల్పిస్తుందని అన్నారు. విద్యార్థులు ఉన్నత చదువులు చదివి రాణించాల్సిన అవసరం ఉందన్నారు. తాను కూడా ఒక పేదకుటుంబం నుంచి వచ్చానని, తూర్పు గోదావరి జిల్లాలో మొదటి నుంచి టిడిపిలో ఉంటూ ఈస్థాయికి రాగలిగానని అన్నారు. ప్రకాశం జిల్లాలోని కంభంకు రావడం సంతోషంగా ఉందని, కాపుసోదరులు ఏర్పాటు చేసిన కార్యక్రమం సంతృప్తి కలిగించిందని అన్నారు. 100మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను హోంమంత్రి చిన్నరాజప్ప చేతుల మీదుగా అందచేశారు. మాజీ ఎమ్మెల్యే పగడాల రామయ్య మాట్లాడుతూ కాపులు ఐక్యంగా ఉండి ఏదైనా సాధించుకోవచ్చునని, కాపులను బిసిలుగా చేర్చాలనే బలమైన కోరిక ఉందని అన్నారు. ఈకార్యక్రమంలో కాపు నాయకులు జి శ్యాం, హైకోర్టు న్యాయవాది చెన్ను శివప్రసాద్, పులి భాస్కర్, దేవిరెడ్డి నాగేంద్రుడు, తులసీ ప్రసాద్, తుపాకుల వెంకటయ్య, పులి శ్రీనివాసప్రసాద్ పలువురు ప్రసంగించారు. అనంతరం హోంమంత్రి చిన్నరాజప్పను కాపునాయకులు దుశ్శాలువలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. నియోజకవర్గ సమస్యలపై న్యాయవాది చెన్ను శివప్రసాద్ హోంమంత్రి చిన్నరాజప్పకు వినతిపత్రం అందచేశారు. కంభంలో సబ్‌కోర్టు ఏర్పాటు చేయాలని, ఆర్టీసీ డిపో, 100 పడకల ప్రభుత్వ వైద్యశాల, అర్థవీడు నుంచి ఆత్మకూరుకు రోడ్డు సౌకర్యం, అర్థవీడు, బేస్తవారపేటలో ప్రభుత్వ వైద్యశాలలను ఏర్పాటుచేసి సిబ్బందిని నియమించాలని, కంభంలో కాపు భవనాన్ని సత్వరమే పూర్తిచేయాలని, టిటిడి దేవస్థానం సహకారంతో కల్యాణ మండపం నిర్మించాలని, కాపు కార్పొరేషన్ ద్వారా రుణాలు మంజూరు చేయాలని ఆ వినతిపత్రంలో పేర్కొన్నారు. ముందుగా కందులాపురం సెంటర్‌లోని శ్రీకృష్ణదేవరాయలు, అంబేద్కర్ విగ్రహాలకు చిన్నరాజప్ప పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

కిటకిటలాడిన భైరవకోన
సియస్‌పురం, నవంబర్ 12: పుణ్యక్షేత్రమైన భైరవకోనలో ఆదివారం కార్తీకమాస పూజలు అత్యంత వైభవంగా జరిగాయి. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు ప్రత్యేక వాహనాల్లో తరలివచ్చారు. భక్తులు జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించి కాలభైరవేశ్వరుడిని, త్రిముఖ దుర్గాంబ అమ్మవారిని, శివలింగాలను దర్శించుకున్నారు.