ప్రకాశం

వెబ్ ల్యాండ్ ఆధారంగా బ్యాంకులో రైతులకు రుణాలు ఇవ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మర్రిపూడి, నవంబర్ 17 : రైతులకు బ్యాంకుల్లో రుణాలు ఇచ్చే సమయంలో వెబ్‌ల్యాండ్ ఆధారంగా రుణాలు మంజూరు చేయాలని ప్రత్యేక కలెక్టర్ నరసింహ అన్నారు. శుక్రవారం మండలంలోని కాకర్ల గ్రామంలో జరిగిన రైతు సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెబ్ ల్యాండ్ ఆధారంగా ప్రతి రైతుకు ఆన్‌లైన్ చేయాల్సిన బాధ్యత రెవిన్యూ శాఖ పై ఉందన్నారు. రెవెన్యూశాఖ ఆధ్వర్యంలో జరిగే పలు కార్యక్రమాలను విజయవంతం చేయాల్సిన బాధ్యత ఇటు ప్రజలు, అటు రెవిన్యూ యంత్రాంగంపై ఉందన్నారు. అంతలో పలువురు రైతులు జోక్యం చేసుకొని కాకర్ల సిండికేట్ బ్యాంకులో రుణాల విషయంలో పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని, పాస్ పుస్తకం పై ఆర్డీవో సంతకం లేనందున బ్యాంకు మేనేజర్ రుణాలు ఇవ్వడం లేదని కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ స్పందిస్తూ సంబంధిత మేనేజర్ తో రైతు సమస్యలపై స్పందించి వెబ్‌ల్యాండ్ ఆధారంగా రుణాలు ఇవ్వాలని, అందుకు ప్రభుత్వం ప్రత్యేక జీవోను విడుదల చేసిన విషయం బ్యాంకులకు తెలియదా... అని ప్రశ్నించారు. రైతులను ఇబ్బందులకు గురి చేయడం సరైన పద్దతి కాదంటూ బ్యాంకు అధికారులపై ఆయన మండిపడ్డారు. రైతులకు రుణాలు ఇచ్చే విషయంలో ఏలాంటి జాప్యం చేయరాదని, అలా చేస్తే వారి పై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. అనంతరం కాకర్ల లో జరిగిన రెవిన్యూ సదస్సులో ఆయన పాల్గొని పలువురు రైతులకు రుణమాఫీ పత్రాలను అందజేశారు. ముందుగా మరికొంత మంది రైతులు భూమి ఆన్‌లైన్ విషయంలో రెవెన్యూ అధికారులు జాప్యం చేస్తున్నారని ఫిర్యాదు చేయగా స్పెషల్ కలెక్టర్ స్పందించి గ్రామ సభల్లోనే ఆ రైతులకు ఆన్‌లైన్ చేసి వారి సమస్యలకు పరిష్కార మార్గం చూపారు. ఈ కార్యక్రమంలో తహశీల్థార్ సుబ్బారావు, ఆర్‌ఐ డేవిడ్, విఆర్‌వో శేషగిరి, ఎఇవో సారధి పాల్గొన్నారు.