ప్రకాశం

ఖో..ఖో...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పంగులూరు, నవంబర్ 17: క్రీడల వలన శారీరక, మానసిక ఉల్లాసం కలుగుతుందని ఆల్ ఇండియా కోకో ఫెడరేషన్ కార్యదర్శి ఎంఎస్ త్యాగి అన్నారు. స్పోర్ట్స్ అథారిటి ఆఫ్ ఎపి, ఎపి ఖోఖో అసోసియేషన్ వారి సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం దక్షిణాది రాష్ట్రాల సీనియర్ స్ర్తి, పురుష కోకో పోటీలు మరియు జిల్లా స్కూల్ గేమ్స్ ఆధర్యంలో రాష్టస్థ్రాయి బాలబాలికల ఖోఖో పోటీలు ప్రారంభ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ స్థాయి కోకో పోటీలను సమర్థవంతంగా నిర్వహించిన ఘనత పంగులూరుకు దక్కిందన్నారు. మూడు సార్లు జాతీయ పోటీలు నిర్వహించి హ్యాట్రిక్ సాధించారని ఎపి ఖోఖో అసోసియేషన్ ఛైర్మన్ బాచిన చెంచు గరటయ్యను ప్రశించారు. క్రీడలను ప్రోత్సహించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై కూడా ఉందన్నారు. క్రీడ ప్రాంగణానికి జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులను అందించిన ఘనత ఉందన్నారు. తొలుతగా గ్రామంలో క్రీడాకారులు ప్రదర్శన నిర్వహించారు. క్రీడా పతాకాన్ని ఎం ఎస్ త్యాగి, గరటయ్య ఆయా రాష్ట్రాల కార్యదర్శులు క్రీడా పతాకాన్ని ఆవిష్కరించారు. క్రీడాకారుల నుంచి అతిథులు క్రీడావందనం స్వీకరించారు. చిన్నారులు ప్రదర్శించిన స్వాగత భరతనాట్యం ప్రేక్షకులను అలరించింది. స్థానిక కళా కారులు కర్రసాము ప్రదర్శించి ఆకట్టుకున్నారు. అనంతరం క్రీడా ప్రతిజ్ఞ చేశారు. పురుషుల విభాగంలో మొదటి మ్యాచ్ ఆంధ్రప్రదేశ్ - తమిళనాడు మధ్య జరిగిన పోటీలతో క్రీడలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో మధ్యభారత్ కార్యదర్శి రాజీవ్ చింతామణి, సౌత్ జోన్ కన్వీనర్ జివి పిళ్లై, ఎపి ఖోఖో అసోసియేషన్ ప్రెసిడెంట్ టిఎస్ ఆర్కే ప్రసాద్ , జాయింట్ సెక్రటరి చంద్రజిత్‌జాదవ్, తెలంగాణ కార్యదర్శి శ్రీనివాస నాయుడు, ప్రకాశం డిఎస్‌డిఓ ఆర్ కె యతిరాజు, మాజీ జడ్‌పిటిసి బాచిన చెంచుప్రసాద్, పర్చూరు ఉప విద్యాధికారి ఎం ఎస్ రాంబాబు, ఎపి అసోసియేషన్ ఉపకార్యదర్శి ఎం పుల్లారెడ్డి, జిల్లా కోకో అసోసియేషన్ అధ్యక్షుడు కుర్రా భాస్కర్‌రావు, కళాశాల ప్రిన్సిపాల్ రమేష్‌బాబు, ఆర్గనైజింగ్ సెక్రటరి నేతల సీతారామిరెడ్డి పలువురు పిడి, పిఇటిలు తదితరులు పాల్గొన్నారు.