ప్రకాశం

వచ్చే ఎన్నికల్లో ఒంగోలు వైకాపా ఎంపీ టికెట్ ఎవరికో..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, నవంబర్ 17 : పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఒకటిన్నర సంవత్సర కాలం ఉన్నప్పటికీ ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి ఎంపికపై కసరత్తులు జరుగుతున్నట్లు పార్టీ వర్గాల ద్వారా సమాచారం. ప్రస్తుతం ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్ధి వైవి సుబ్బారెడ్డి స్థానంలో కొత్తవారిని నియమిస్తారా లేక ఆయనే్న కొనసాగిస్తారా అనే చర్చ జిల్లా వ్యాప్తంగా సాగుతోంది. ఇటీవల కాలంలో ఒక ముఖ్యమైన సమావేశంలో వైకాపా అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంచలనమైన నిర్ణయం తీసుకున్నట్లు పార్టీవర్గాల ద్వారా తెలిసింది. ఈ నేపధ్యంలో పార్టీలో కీలకంగా ఉండే ముఖ్య నాయకులు పోటీ చేయవద్దని వారి స్థానంలో కొత్తవారికి అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇలాంటి తరుణంలో జగన్‌కు బాబాయి, రాష్ట్ర పార్టీలో కీలకంగా ఉన్న వైవి సుబ్బారెడ్డిని ఒంగోలు పార్లమెంటును తప్పించి రాష్ట్ర పార్టీ బాధ్యతలు తీసుకోమని చెబుతారా లేక కుటుంబ వత్తిళ్లు వస్తే ఆయనకే మళ్లీ అవకాశం ఇస్తారా అనేది వేచిచూడాల్సి ఉంది. కాగా, ఒంగోలు ఎంపీగా వైవి సుబ్బారెడ్డి గెలుపొందిన దగ్గరనుండి ఆయన పరిధిలోని ఏడు నియోజకవర్గాలతోపాటు, మిగిలిన నియోజకవర్గాల్లోను అభివృద్ధి పనులతోపాటు, పార్టీ పురోభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తూనే ఉన్నారు. కేవలం అనతికాలంలోనే ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ ప్రజలతో సుబ్బారెడ్డి మమేకం అయ్యారు. ప్రధానంగా ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని యర్రగొండపాలెం, గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి, దర్శి, ఒంగోలు, కొండెపి నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నాయకులు, కార్యకర్తలను పేరుపెట్టి పిలిచే స్థాయికి వచ్చి వారితో మమేకమై పోతున్నారు. ఇలాంటి తరుణంలో కొత్త అభ్యర్ధిని రంగంలోకి దించుతారా లేక ఆయనే్న కొనసాగిస్తారా అన్న చర్చ సాగుతోంది. ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్ధిగా వైవి సుబ్బారెడ్డి అయితే భారీ మెజార్టీతో గెలుపొందుతారని వైకాపాశ్రేణులు అంటున్నాయి.
ఇదిలాఉండగా రాష్టప్రార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం అయితే వైవి సుబ్బారెడ్డి పోటీ స్థానంలో కొత్తవారికి అవకాశం వస్తే మాత్రం మరికొంతమంది నాయకులు తెరపైకి వచ్చే అవకాశాలున్నాయి. కాగా, నెల్లూరు పార్లమెంటు సభ్యులు మేకపాటి రాజమోహన్‌రెడ్డిని వైకాపా ఎంపీ అభ్యర్థిగా రంగంలోకి దించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో కాంగ్రెస్‌పార్టీ తరపున మేకపాటి ఘన విజయం సాధించారు. దీంతో జిల్లాలోని నాయకులతో మేకపాటికి సంబంధాలు ఉండటం ఆయనకు ప్లస్ అయ్యే అవకాశాలున్నాయి. అదేవిధంగా ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ తరపున స్థానికసంస్థల ఎమ్మెల్సీగా ఉన్న మాగుంట శ్రీనివాసులరెడ్డి ఒకవేళ పార్టీమారి వైకాపాలో చేరితే మాత్రం ఆయనకే టిక్కెట్ దక్కే అవకాశాలు లేకపోలేదన్న వాదన పార్టీశ్రేణుల నుండి వినిపిస్తోంది. కాగా, ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో మాగుంటకు పట్టు ఉంది. ఇలాంటి తరుణంలో ఎమ్మెల్సీ పదవిని కాదని వైకాపా తరపున ఎంపీ అభ్యర్ధిగా పోటీచేస్తారా అన్న చర్చ జోరుగా సాగుతోంది. అదేవిధంగా కనిగిరి నియోజకవర్గానికి చెందిన త్రిపుర ఐపీఎస్ క్యాడర్‌కు చెందిన ఎ రమేష్‌రెడ్డి కూడా ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం నుండి పోటీచేసేందుకు ఉత్సాహం చూపుతున్నట్లు పార్టీవర్గాల ద్వారా సమాచారం. రమేష్‌రెడ్డి మాజీ మంత్రి ముక్కు కాశిరెడ్డికి మేనల్లుడు కావటంతో ఆ నియోజకవర్గంలోనూ ఆయన ప్రభావం చూపే అవకాశాలున్నాయి. మొత్తంమీద ఈసారి ఎన్నికల్లో కూడా ఎంపీ అభ్యర్ధిగా వైవి సుబ్బారెడ్డినే రంగంలోకి దించితే భారీ మెజార్టీతో గెలుపొందుతారన్న ధీమా వైవి అనుచరులు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నియోజకవర్గంలో పార్టీ పరిస్ధితితోపాటు, అభివృద్ధి శరవేగంగా సాగుతోందని, ఇలాంటి తరుణంలో మళ్లీ కొత్త అభ్యర్థి తెరపైకి వస్తే పరిస్థితులు ఏటు వెళ్తాయోనన్న చర్చ అన్నివర్గాల నుండి జరుగుతోంది. త్వరలోనే ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్ధిగా ఎవరు పోటీచేస్తారనే విషయాలు వెల్లడి కానున్నాయి. ఏదిఏమైనప్పటికీ ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం నుండి వైవినే మళ్ళీ రంగంలోకి దింపేందుకు జగన్ ఆయన పేరునే ప్రకటించాలని సుబ్బారెడ్డి అనుచరులు ముక్త కంఠంతో కోరుతున్నట్లు సమాచారం.

భార్య కాపురానికి రాలేదని భర్త ఆత్మహత్య
అర్థవీడు, నవంబర్ 17: భార్య కాపురానికి రాలేదని మనస్థాపానికి గురై భర్త ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం జరిగింది. మండలంలోని నాగులవరం గ్రామానికి చెందిన వల్లెల రామకృష్ణ (22)కు మార్కాపురం మండలం వేములకోట గ్రామానికి చెందిన మహిళతో ఆరునెలల కిందట వివాహం జరిగింది. కాగా, భార్య కాపురానికి రాకపోవడంతో మనస్థాపం చెందిన రామకృష్ణ శుక్రవారం ఇంట్లో ఎవరూలేని సమయంలో పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈమేరకు ఎస్సై కోటయ్య కేసు దర్యాప్తు చేస్తున్నారు.