ప్రకాశం

జిల్లాలో పెండింగ్‌లో ఉన్న 22,341 మరుగుదొడ్ల నిర్మాణ పనులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,నవంబర్ 21:జిల్లాలో పెండింగ్‌లో ఉన్న 22,341 మరుగుదొడ్ల నిర్మాణ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి ఈనెలాఖరు నాటికి బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా ప్రకటించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లాకలెక్టర్ వి వినయ్‌చంద్ అధికారులను ఆదేశించారు. మంగళవారం స్ధానిక సిపిఒ కాన్పరెన్స్‌హాలులో స్వచ్చ్భారత్ మిషన్, స్వచ్చప్రకాశంపై నియోజకవర్గాలు, మండలాల ప్రత్యేకాధికారులు, ఎంపిడిఒలతో సమావేశం నిర్వహించి మండలాలు, నియోజకవర్గాల వారీగా సమీక్షించారు. ఈసందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 1,70,106 వ్యక్తిగత మరుగుదొడ్లను స్వచ్చ్భారత్ మిషన్ గ్రామీణ్ కింద మంజూరుచేశామని అందులో ఇప్పటివరకు 86,736 మరుగుదొడ్లు పూర్తిఅయ్యాయని,61,029 పురోగతిలో ఉన్నాయన్నారు. మిగిలిన 22341 నిర్మాణాల పనులు ఇంకా మొదలు కాలేదన్నారు. జిల్లాలో మొత్తం 1028 గ్రామపంచాయితీలకు గాను ఇప్పటివరకు 346 గ్రామాలు బహిరంగ మలవిసర్జనరహిత గ్రామాలుగా ప్రకటించారన్నారు. ఇంకా 682గ్రామపంచాయితీలు ఒడిఎఫ్ ప్రకటించాల్సి ఉందన్నారు. ఇకపై యుద్దప్రాతిపదికన రోజుకు 70 గ్రామ పంచాయితీలు ఒడిఎఫ్‌గా ప్రకటిస్తే తప్ప ఈనెలాఖరునాటికి జిల్లా లక్ష్యం పూర్తికాదన్నారు. గత నాలుగైదురోజులుగా 15వేల మరుగుదొడ్లు నిర్మించకుండా డేటా వివరాలు నమోదు కాకపోవటంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒకవైపు మరుగుదొడ్ల నిర్మాం చేపట్టడటంతో పాటు, మరోవైపు డేటా నమోదు కూడా చేయాలన్నారు. కొన్ని మండలాల్లో బాగా పనిజరుగుతున్నా కొన్ని మండలాల్లో పనితీరు సరిగా లేదన్నారు. ప్రతి దశలోను అన్నివిధాల దిశానిర్ధేశ్యం చేస్తున్నప్పటికి రానురాను విశ్రాంతి తీసుకుని నిర్లక్ష్యం, ఆలసత్వం పెరుగుతొందన్నారు. అంతే కాకుండా నాలుగైదు మండలాల్లో ఆర్‌డబ్ల్యుఎస్, ఉపాధి హామీ రెండుపధకాల్లోను మరుగుదొడ్లు మంజూరు చేసినట్లు ఫిర్యాదులు అందుతున్నాయని, వాటిపై ఇప్పటికే విచారణ చేయాలని సీనియర్ అధికారులను నియమించామన్నారు. అలాగే మీడియాతో సహా ప్రజలు కూడా గమనిస్తున్నారని ఎక్కడ పొరపాట్లు జరగకుండా జాగ్రత్త వహించాలన్నారు. ఇకపై సమావేశాలు ఉండవని ప్రతిరోజు ఉదయం ఎనిమిదిగంటలకే టెలికాన్పరెన్స్ ద్వారా పురోగతిని సమీక్షిస్తామన్నారు. మండల ప్రత్యేకాధికారులు వచ్చే మంగళవారం వరకు క్షేత్రస్ధాయిలో పర్యటించి మరుగుదొడ్ల నిర్మాణపనులు ముమ్మరం చేయాలన్నారు. నియోజకవర్గాల ప్రత్యేకాధికారులు ప్రత్యేక చొరవచూపి పనులను పర్యవేక్షించాలన్నారు. ఈ నెలాఖరువరకు అధికారులందరికి ప్రధానమైన పని ఒడిఎఫ్ మాత్రమేనని, ఇందులో ఏమాత్రం ఆశ్రద్ద పనికిరాదన్నారు. ఒక కుటుంబానికి ఒక పధకం ఒక మరుగుదొడ్డి ఉండాలన్నదే ప్రభుత్వ సూత్రమని ఇందులో ఏమాత్రం తేడా ఉండరాదని స్పష్టం చేశారు. ఎంపిడిఒలు గతంలో చెప్పినట్లుగానే ప్రతిరోజు ఉదయం కంప్యూటర్ ఆపరేటర్ దగ్గరకూర్చోని మరుగుదొడ్లకు సంబంధించి అన్ని రకాల వివరాలు నమోదుసక్రమంగా ఉందో లేదో ఒకసారి పరీక్షించుకోవాలని, లేకుంటే ఆపరేటర్ చేసే తప్పులకు ఎంపిడిఒలు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఎవరైనా అర్హులైన కొత్తవారు మరుగుదొడ్డి కావాలంటే మంజూరు చేసే అధికారం ఎంపిడిఒలకు ఉందని స్పష్టం చేస్తూ వాటిని కూడా ఈనెలాఖరుకు పూర్తిచేయాలన్నారు. కేంద్రప్రభుత్వ పధకమైన ఒడిఎఫ్ కార్యక్రమానికి సర్పంచ్‌లు సహకరించకపోతే 14వ ఆర్ధిక సంఘం నిధులు వినియోగాన్ని ఆపివేయాలన్నారు. మరుగుదొడ్లు పూర్తి స్ధాయిలో నిర్మించకుండానే ఒడిఎఫ్‌గా ప్రకటిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఒక్కొ గ్రామపంచాయితీని ఒడిఎఫ్‌గా ప్రకటించే తేదీలు చెప్పిన ప్రకారం చేయకపోతే ఛార్జ్‌మెమోలు జారీచేస్తామని హెచ్చరించారు. మండల పరిషత్ సమావేశాలు ఏమైనా ఉంటే వాయిదా వేసుకోవాలని ఒడిఎఫ్‌కు ఆటంకటం కల్గించరాదని ఆయన వెల్లడించారు. ఈసమావేశంలో సంయుక్తకలెక్టర్ -2 డి మార్కండేయులు, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఇ సంజీవరెడ్డి, జిల్లాపరిషత్ సిఇఒ కైలాస్ గిరీశ్వర్,సిపిఒ కెటి వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.