ప్రకాశం

రేషన్ బియ్యం పంపిణీలో అవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కందుకూరు, నవంబర్ 21 : ప్రభుత్వం బీపీఎల్ కుటుంబాలకు చౌకధరల దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్న బియ్యం, ఇతర నిత్యావసర వస్తువుల పంపిణీలో అవకతవకలకు పాల్పడితే అటువంటివారిపై శాఖాపరమైన చర్యలు తప్పవని ఏపీ ఫుడ్ కార్పొరేషన్ కమిషనర్ ఎస్ గీత అన్నారు. మంగళవారం పట్టణంలోని 3, 5, 11 తదితర ప్రభుత్వ చౌకధరల దుకాణాలను ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె ఆయా దుకాణాల్లోని స్టాక్ రిజిస్టర్లను, పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం దుకాణాల్లోని స్టాక్ వివరాలను డీలర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా రేషన్ కార్డుదారులందరికీ ప్రభుత్వం నుంచి వచ్చే బియ్యం, ఇతర నిత్యావసర సరకులను సకాలంలో అందజేయాలని సూచించారు. ప్రతి నెలా నిర్ణీత కాలంలో కార్డుదారుడికి సరకులు అందజేయాలని సూచించారు. పంపిణీలో ఎలాంటి అవకతవకలకు పాల్పడిన డీలర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సరకుల పంపిణీలో పారదర్శకతను తీసుకొని వచ్చేందుకే బయోమెట్రిక్ విధానాన్ని చేపట్టినట్లు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించాలన్న ప్రభుత్వ లక్ష్య సాధనకు క్షేత్రస్థాయి సిబ్బంది కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా అధికారులకు, డీలర్లకు పలు సూచనలు, సలహాలిచ్చారు. ఆమె వెంట జిల్లా పౌర సరఫరాల శాఖ మేనేజర్ వెంకటరమణ, జిల్లా ఐసీడీఎస్ పీడీ సరోజినీదేవి, డీఎస్‌ఓ వెంకటేశ్వర్లు, తహశీల్దార్ సీహెచ్ నాగభూషణం, ఫుడ్ ఇన్‌స్పెక్టర్ కృష్ణమోహన్, డీటీ కృష్ణమోహన్, ఎంఇఓ ఎంఎస్ రాంబాబు, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.