ప్రకాశం

ప్రత్యేకహోదా పోరాటం ఆగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,నవంబర్ 21 : రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనకోసం ఎంతవరకైనా పోరాటం చేస్తామని ఒంగోలు పార్లమెంటు సభ్యులు వైవి సుబ్బారెడ్డి సవాల్ విసిరారు. మంగళవారం తన నివాసంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేకహోదా సాధనకోసం అవసరమైతే తమ పార్టీకి చెందిన ఎంపిలందరూ రాజీనామా చేసేందుకు సిద్ధమన్నారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ప్రైవేటు బిల్లు పెట్టబోతున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్ర విభజన సమయంలో ఐదేళ్లు కాదు, పదిసంవత్సరాలు ప్రత్యేకహోదా కావాలన్న చంద్రబాబు ప్రస్తుతం మాటమార్చి అది ముగిసిపోయిన అధ్యాయంగా చెప్పటం దారుణంగా ఉందని ఆయన ధ్వజమెత్తారు. ఓటుకు నోటు కేసునుండ బయటపడేందుకే ముఖ్యమంత్రిజ ప్రత్యేక హోదాను తాకట్టుపెట్టినట్లు ఆయన ఆరోపించారు. ప్రత్యేక ప్యాకేజితో సగటు ప్రజలకు ఏం ప్రయోజనం చేకూర్చారో చెప్పగలరా అంటూ నిలదీశారు. దమ్ముంటే ముఖ్యమంత్రి ప్యాకేజి వివరాలు వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. దేశంలోని 11 రాష్ట్రాలకు ప్రత్యేకహోదా ఉన్న కారణంగా ఎ విధంగా అభివృద్ధి చెందాయో ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలియదా అంటూ సుబ్బారెడ్డి ప్రశ్నించారు. ప్రత్యేకహోదా కోసం ఆందోళన చేస్తున్న వారిని హేళన చేయటం, వారిని అడ్డుకోవటం తగదని ఆయన పేర్కొన్నారు. అసలు హోదా కోసం ప్రయత్నించాల్సింది చంద్రబాబేనని ఆయన తెలిపారు. తెలుగుదేశంపార్టీ మిత్రపక్షంగా కేంద్రంలో ఉందని ఆయన పేర్కొన్నారు. రాష్టవ్రిభజన అంశంపై పార్లమెంటులో ప్రధాని ఇచ్చిన హామీని తుంగలో తొక్కిన ఘనత కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలదేనని తెలిపారు. చట్టసభల్లో చేసిన నిర్ణయాలనే అమలుచేయకుంటే మీకు వాటిపై గౌరవం ఉందా అంటూప్రశ్నించారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా కలిసొచ్చే పార్టీలతో కలిసి ఆంధ్రుల హక్కు అయిన ప్రత్యేక హోదాకోసం వైఎస్‌ఆర్‌సిపి పోరాడుతుందని ఆయన వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి నాటకాలాడుతున్నారని ఆరోపించారు. ఉపాధిహామీ నిధులు రాకుండా అడ్డుకునేందుకు లేఖరాశారని ఐటి శాఖమంత్రిత్రి అసెంబ్లీలో ప్రస్తావించటం సరికాదని ఆయన ఎద్దేవచేశారు. తామేం రాశామో పరిశీలించి మాట్లాడాలని హితవుపలికారు. మంత్రివ్యాఖ్యాలపై శాసనసభ, పార్లమెంటు స్పీకర్లకు ఫిర్యాదు చేస్తామని ఆయన తెలిపారు. జిల్లాలో నిర్మించే వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణానికి ప్రత్యేక నిధులు వెచ్చించి వేగంగా పూర్తిచేయాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లాలోని పశ్చిమప్రాంతంలో ఫ్లొరైడ్ నీటితో ప్రజలు అల్లాడుతున్నారని ఆయన కోరారు. కిడ్నీ వ్యాధుల బారిన పడుతున్నారని వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈవిషయంపై పార్లమెంటు ఫ్రత్యేక కమిటి వేస్తుందని ఆయన తెలిపారు. ముందుగా ఫ్ల్లోరైడ్, కిడ్నీబాధితుల కోసం ఇటీవల రిమ్స్‌లో ప్రవేశపెట్టిన ఫ్ల్లోరైడ్ ట్రాన్సిట్ కేంద్రాన్ని సుబ్బారెడ్డి పరిశీలించారు. రోగులకు ఉపశమనం కల్పించేందుకు తీసుకుంటున్న చర్యలపై వైద్యాధికారులతో చర్చించినట్లు ఒంగోలు పార్లమెంటుసభ్యులు వైవి సుబ్బారెడ్డి తెలిపారు. ఈ విలేఖర్ల సమావేశంలో నెల్లూరు జిల్లా కోవూరు మాజీ శాసనసభ్యులు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, వైఎస్‌ఆర్ సిపినాయకులు కెవి రమణారెడ్డి, వైవి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.