ప్రకాశం

కర్ణాటకలో ఆశాజనకంగా పొగాకు కొనుగోళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, నవంబర్ 21: కర్ణాటక రాష్ట్రంలో ప్రస్తుతం పొగాకు బోర్డు వేలం కేంద్రాలలో జరుగుతున్న పొగాకు కొనుగోళ్లు ఆశాజనకంగా ఉన్నాయి. కర్ణాటకలో బోర్డు వేలం కేంద్రాలు ప్రారంభమై సుమారు 55 రోజులు కాగా, ఇప్పటి వరకు బోర్డు వేలం కేంద్రాల పరిధిలో మొత్తం 28 మిలియన్ కేజీల వరకు పొగాకు కొనుగోళ్లు జరిగినట్లు జిల్లాలోని బోర్డు అధికారుల ద్వారా సమాచారం. ఇప్పటి వరకు కర్నాటకలో బ్రైట్ గ్రేడ్ పొగాకు 20.68 శాతం కొనుగోళ్లు జరిగినట్లు సమాచారం. జిల్లాలోని పొగాకు బోర్డు అధికారులు, రైతు సంఘాల నాయకులు అందించిన మేరకు కర్ణాటకలో వస్తున్న పొగాకు ధరలు ఈ విధంగా ఉన్నాయి. కర్ణాటకలో నాణ్యత కలిగిన పొగాకు ఒక కేజికి సరాసరి ధర 162 రూపాయలు వస్తుంది. మీడియం గ్రేడ్ పొగాకు ఒక కేజికి సరాసరి ధర 145 రూపాయలు,లోగ్రేడ్ పొగాకుకు ఒక కేజికి సరాసరి ధర 112 రూపాయలు ధర వస్తుంది. అన్ని గ్రేడ్ లకు కలిపి సరాసరి ధర ఒక కేజికి 138 రూపాయల వరకు ధర వస్తున్నట్లు ఇక్కడి పొగాకు బోర్డు అధికారుల ద్వారా సమాచారం. కర్నాటక లో వస్తున్న పొగాకు ధరలను పత్రికల ద్వారా పరిశీలిస్తున్న ఆంధ్రా రైతులు అక్కడి ధరలు కంటే మించి మంచి ధరలు రావాలని ఆశిస్తున్నారు. ఇప్పటికే కర్నాటక లో వస్తున్న ధరలను చూసిన ఆంధ్రాలోని రైతులు ఇక్కడ పొగాకు సాగు విస్తీర్ణం పెంచి అదనంగా పొగాకు ఉత్పత్తి చేస్తారనే ఉద్దేశంతో బోర్డు అధికారులు రైతులకు బోర్డు ఇచ్చిన ఇండెంట్ మేరకే రైతులు పొగాకు ఉత్పత్తి చేయాలని, అదనంగా ఉత్పత్తి చేసి నష్టపోవద్దని రైతులకు సూచిస్తున్నారు. ఈ ఏడాది కర్నాటక రాష్ట్రంలో 100 మిలియన్ కేజీల పొగాకు ఉత్పత్తి చేయాలని బోర్డు లక్ష్యంగా నిర్ణయించగా, మన రాష్ట్రంలో 136 మిలియన్ కేజీల పొగాకు పంట ఉత్పత్తి చేయాలని బోర్డు లక్ష్యంగా నిర్ణయించింది. అయితే కర్ణాటక రాష్ట్రంలో ఇప్పటికే పొగాకు కొనుగోళ్లు జరుగుతుండగా, మన రాష్ట్రంలో మాత్రం కొన్ని వేలం కేంద్రాల పరిధిలో పొగాకు నాట్లు పూర్తి కాగా మరికొన్ని వేలం కేంద్రాల పరిధిలో పొగాకు నాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలోని తేలిక నేలలో పొగాకు నాట్లు పూర్తి కాగా, నల్లరేగడి నేలల్లోని వేలం కేంద్రాలలో పొగాకు నాట్లును రైతులు వేస్తున్నారు. ప్రస్తుతం పొగాకు నాట్లు వేస్తున్న రైతులు రాష్ట్రంలోనూ, ప్రకాశం జిల్లాలోనూ కర్ణాటకలో వస్తున్న ధరల కంటే మంచి ధరలు వస్తే బాగుంటుందన్న ఆలోచనలో ఉన్నారు. ఈ ఏడాది జిల్లాలో ఒక మోస్తరు వర్షం కురవడంతో రైతులు మోటార్లు ద్వారా , ఇంజన్ల ద్వారా నీరు పెడుతూ అధిక ఖర్చును హెచ్చించి పొగాకు నాట్లు ను వేస్తున్నారు. దీంతోఖర్చులు అధికంగా అవుతున్నందున పొగాకు కు మంచి ధరలు వస్తేనే గిట్టుబాటు అవుతుందని లేకుంటే నష్టపోయే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు. ఒక వేళ పొగాకు కు ప్రత్యామ్నాయ పంటలు సాగుచేసుకుందామంటే ఆ పంటలకు కూడా సరిగా గిట్టుబాటు ధరలు రావడం లేదని, తప్పని పరిస్థితిలో తాము పొగాకు పంటను సాగుచేయాల్సి వస్తుందని రైతులు చెబుతున్నారు. కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు ముందుచూపుతో వ్యవహరించి ఈ ఏడాది జిల్లాలోని పొగాకు రైతులకు మంచి ధరలు వచ్చేలా చూడాల్సిన అవసరం ఉందని రైతులు, రైతు సంఘాల నాయకులు కోరుతున్నారు.