ప్రకాశం

భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయండి : కలెక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, డిసెంబర్ 11 : జిల్లాలో వివిధ ప్రాజెక్టు కింద భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ వి వినయ్ చంద్ అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ప్రాజెక్టుల భూసేకరణ కార్యక్రమం పై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్‌హెచ్ 216 చీరాల నుండి ఒంగోలు వరకు డబుల్ లైన్ నిర్మాణానికి సంబంధించి ఆరు మండలాల్లో 14 గ్రామాల పరిధిలో 2943 ఎకరాల భూసేకరణ కు ఆవార్డ్ పాస్ చేయడం జరిగిందన్నారు. ఇందు కోసం 65 కోట్ల 60 లక్షల 92 వేల 34 రూపాయల నిధులు విడుదల చేయగా 51 కోట్ల 9 లక్షల 25 వేల 833 రూపాయలను నిర్వాసితులకు పంపిణీ చేయడం జరిగిందన్నారు. మిగిలిన 14 కోట్ల 51 లక్షల 66 వేల 201 రూపాయలు పంపిణీ చేయక పోవడానికి గల కారణాలను కలెక్టర్ ఆరా తీశారు. పుల్లరిపాలెం, నాయినిపలిల, మోటుపల్లి గ్రామాల పరిధిలోని రైతులు నష్ట పరిహారాన్ని పెంచాలని కోరుతున్నారని అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకు రాగా దీంతో స్పందిస్తూ రైతులతో సంప్రదింపులు జరిపి సహేతుకమైన పరిహారం అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్‌హెచ్ -216 జాతీయ రహదారికి ఉన్న ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని ప్రతిరోజూ ఒక గంట ఈ అంశం పై జాయింట్ కలెక్టర్ -2 ను సమీక్షించాలని, వచ్చే జనవరి పదో తేది నాటికి భూ సేకరణ కార్యక్రమాలు పూర్తి చేయాలన్నారు. ఎన్‌హెచ్ 565 అభివృద్దిలో భాగంగా కనిగిరిలో కోర్టు కేసు వలన నిలిచి పోయిన 18.9 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకునేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు, నడికుడి - శ్రీకాళహస్తి బ్రాడ్‌గేజ్ రైల్వే లైన్ నిర్మాణంలో మిగిలి పోయిన అసైన్డ్ భూమి స్వాధీనం చేసుకునేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విజయవాడ - గూడూరు మధ్యలో 3వ రైల్వే లైన్ నిర్మాణానికి భూ సేకరణ కార్యక్రమాన్ని సత్వరమే పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.