ప్రకాశం

డిఇఓని కలిసిన ఎన్జీఓ సంఘం నేతలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, డిసెంబర్ 14: జిల్లా విద్యా శాఖాధికారిగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన విఎస్ సుబ్బారావు ని ఎపిఎన్‌జిఓ అసోసియోషన్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బండి శ్రీనివాసరావు, శరత్ బాబు తోపాటు పలువురు నాయకులు గురువారం మర్యాధ పూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియోషన్ కోశాధికారులు కృష్ణారెడ్డి, శివ, మాలకొండయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు , పట్టణ అధ్యక్షులు ఎన్ మస్తాన్ వలి, పట్టణ కార్యవర్గ సభ్యులు , స్కూల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ అసోసియోషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎ స్వాములు, జిల్లా నాయకురాలు బి పద్మకుమారి తదితర కార్యవర్గ సభ్యులు ఉన్నారు.
సీపీఐ మహాసభ 21కి వాయిదా
సంతమాగులూరు డిసెంబర్ 14: పుట్టవారిపాలెం కూడలిలలో ఈనెల 16న నిర్వహించ తలపెట్టిన సీపీఐ మహసభను ఈనెల 21కి వాయిదా వేసినట్లు పార్టీ మండల కన్వినర్ కె తాతిరెడ్డి తెలిపారు. ఈనెల మొదటి వారంలో జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో 16న మహాసభ జరపాలని నిర్ణయించినా ఆరోజు పార్టీ పెద్దలు అందుబాటులో ఉండనందున 21న జరుపాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.

ప్రజావ్యతిరేక ప్రభుత్వాలకు బుద్ధిచెప్పాలి
దర్శి,డిసెంబర్ 14:కేంద్రం,రాష్ట్రంలో ప్రజావ్యతిరేక పాలన సాగిస్తున్న కేంద్ర,రాష్ట్రప్రభుత్వాలకు ప్రజలు బుద్ధిచెప్పాలని సిపిఎం రాష్టక్రార్యవర్గసభ్యుడు జాలా అంజయ్య పిలుపునిచ్చారు. గురువారం దర్శి పట్టణంలో సిపిఎం డివిజన్ కార్యదర్శి తాండవ రంగారావు అధ్యక్షతన సిపిఎం ఐదవ మహాసభలు నిర్వహించారు. ఈమహాసభలకు ముఖ్యఅతిధిగా విచ్చేసిన జాలా అంజయ్య మాట్లాడుతూ కేంద్ర,రాష్ట్రప్రభుత్వాలు ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతూ పేదలకడుపుకొడుతున్నాయని
ఆరోపించారు. పేదలకోసం ప్రవేశపెట్టిన జాతీయగ్రామీణ ఉపాధిహామీ పధకం నిధులను సిమెంటురోడ్లకు మళ్ళీంచి అభివృద్దిపేరుతో తెలుగుదేశంకార్యకర్తల జేబులు నింపుకునేందుకు కాంట్రాక్టులు అప్పచెబుతున్నారని ఆరోపించారు. పేదల కడుపుకొడుతూ కార్పొరేట్లకు కొమ్ముకాస్తున్న ప్రభుత్వాలకు ప్రజలు తగిన బుద్ధిచెప్పాలన్నారు. సిపిఎం జిల్లాకార్యదర్శి పూనాటి ఆంజనేయులు మాట్లాడుతూ జన్మభూమి కమిటిల పేరుతో ప్రభుత్వ పథకాలను అర్హులకు కాకుండా తమ ఇష్టానుసారంగా కార్యకర్తలకు పంచిపెడుతున్నారని విమర్శించారు. నియోజకవర్గంలో రాష్టమ్రంత్రిగా పనిచేస్తున్న శిద్దా రాఘవరావు గత నాలుగుసంవత్సరాలనుండి దొనకొండ పారిశ్రామిక హాబ్ అని చెప్పిందే చెబుతూ కాలయాపన చేస్తున్నారని, మంత్రి శిద్దా రాఘవరావుకూడా పారిశ్రామిక వేత్తకదా ఆయనైనా ఒక పరిశ్రమను స్ధాపించారా అని ప్రశ్నించారు. విదేశాలనుండి పరిశ్రమలను ఏర్పాటుచేసేందుకు వస్తున్నారని కల్లబొల్లికబుర్లు చెబుతూ ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. గత మూడుసంవత్సరాలనుండి ఈప్రాంతం సాగునీరు లేక రైతులు అల్లాడుతున్నారని సాగర్‌లో 570 అడుగుల నీరు ఉన్నా సాగుకు నీరు ఇవ్వలేని దుస్ధితిలో రాష్ట్రప్రభుత్వం ఉందని ఆరోపించారు. రాయలసీమలో ప్రతిపక్షాన్ని ఎదుర్కొనేందుకు మనకు రావాల్సిన నీటిని ఆ ప్రాంతానికి తరలించి ప్రకాశం జిల్లా రైతులకు తీవ్ర అన్యాయం చేశారన్నారు. ఇప్పటికైనా ఈప్రాంత ప్రజలు గుర్తించి ప్రభుత్వానికి తగిన బుద్దిచెప్పాలన్నారు. ఈమహాసభలకు ముందుగా దర్శి పట్టణంలో ఎర్రజెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈకార్యక్రమంలో సిపిఎం నాయకులు కంకణాల ఆంజనేయులు, జూపల్లి కోటేశ్వరరావు, రాంకోటిరెడ్డి, తిరుపతమ్మ, కార్యకర్తలు పాల్గొన్నారు.