ప్రకాశం

వచ్చే మార్చినాటికి స్వచ్చ ఆంధ్రప్రదేశ్ ఒడిఎఫ్ రాష్ట్రంగా ప్రకటించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,డిసెంబర్ 14:రాష్ట్రాన్ని మార్చి నాటికి స్వచ్చ ఆంధ్రప్రదేశ్ ఒడిఎఫ్ రాష్ట్రంగా ప్రకటించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్టమ్రుఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు జిల్లాకలెక్టర్లను ఆదేశించారు. గురువారం అమరావతి సచివాలయంనుండి ముఖ్యమంత్రి జిల్లాకలెక్టర్లతో స్వచ్చ ఆంధ్రప్రదేశ్, గ్రీవెన్స్ అర్జీలు, బయోమెట్రిక్ అటెండెన్స్, ఈ ఆఫీసు, తదితర అంశాలపై వీడియోకాన్పరెన్స్ నిర్వహించారు. ఈసందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ఒడిఎఫ్ పూర్తిచేసుకుని అన్ని జిల్లాల్లో ఈనెల 26వతేదీన ర్యాలీలు ఏర్పాటుచేయాలన్నారు. రాష్ట్రంలో ఒడిఎఫ్‌ను పూర్తిచేసేందుకు నిధుల కొరత లేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణం 2014 సంవత్సరంలో స్వచ్చ ఆంధ్రప్రదేశ్ మిషన్ ప్రారంభించే నాటికి 34శాతం ఉన్న పరిస్ధితులను ప్రస్తుతం 77శాతం సాధించామన్నారు. రాష్ట్రంలో అభివృద్ది పనులు నాణ్యత ప్రమాణాలు పాటించటం లేదని తమ దృష్టికి వచ్చిందన్నారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలపై 37లక్షల 20వేల 995 అర్జీలు వచ్చాయని, వీటిలో కేవలం ఆరులక్షల 22వేల 327మాత్రమే పరిష్కరించటం జరిగిందన్నారు. రాష్ట్రంలో ప్రజాసమస్యలు పరిష్కరించేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో జనవరి రెండవతేదీనుండి 12వతేదీవరకు జన్మభూమి మాఊరు కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. జన్మభూమి కార్యక్రమానికి వెళ్ళే ముందు ప్రజాసమస్యలు పరిష్కరించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. జిల్లానుండి జిల్లాకలెక్టర్ వినయ్‌చంద్ మాట్లాడుతూ ప్రకాశం జిల్లాను రెండురోజుల్లో చర్యలు తీసుకున్నామన్నారు. నూరుశాతం పనులు పూర్తిచేశామని వివరాలు వెబ్‌సైట్‌లో పొందుపర్చాలన్నారు. జిల్లాలోని 56మండలాల పరిషత్ అభివృద్ది అధికారులను, నియోజకవర్గ ప్రత్యేక అధికారులను మరుగుదొడ్లు నిర్మాణాలపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టామన్నారు. జిల్లాలోని మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరుల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి సామగ్రి కొరత లేకుండా చర్యలు చేపట్టామన్నారు. మెటిరియల్ ధరలు పెంచకుండా లబ్ధిదారులకు అందుబాటులో ఉండేవిధంగా చర్యలు తీసుకున్నామన్నారు. ఈ వీడియోకాన్పరెన్స్‌లో రాష్ట్ర అటవీశాఖమంత్రి శిద్దా రాఘవరావు,జిల్లా జాయింట్‌కలెక్టర్ ఎస్ నాగలక్ష్మితోపాటు పలుశాఖల అధికారులు పాల్గొన్నారు.

ఖాతాదారులకు ఎపిజిబి విస్తృత సేవలు
* బ్యాంకు రీజనల్ మేనేజర్ శివశంకర్‌రెడ్డి
దొనకొండ, డిసెంబర్ 14: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఆంధ్రప్రగతి గ్రామీణబ్యాంకు ఖాతాదారులకు విస్తృత సేవలు అందిస్తోందని బ్యాంకు రీజనల్ మేనేజర్ శివశంకర్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం మండలంలోని కొచ్చర్లకోట గ్రామంలో 156వ బ్రాంచ్‌ను ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఎపిజి బ్యాంకు 23వేల 500 కోట్లతో తమబ్యాంకు రైతులకు, ఖాతాదారులకు, చిరువ్యాపారులకు సేవలు అందిస్తుందని అన్నారు. అయితే ఖాతాదారులు, రైతులు, వ్యాపారులు రుణాలు పొంది సకాలంలో చెల్లించి బ్యాంకు అభివృద్ధికి సహకరించాలని కోరారు. దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులతో పోటీపడుతూ విస్తృతంగా సేవలు అందిస్తోందని తెలిపారు. ఆన్‌లైన్, డిపాజిట్లు, తదితర సౌకర్యాలను తమ బ్యాంకు అందిస్తోందని తెలిపారు. ఈకార్యక్రమంలో బ్యాంకు మేనేజర్ ఆర్‌వి సుబ్బారావు, కొచ్చర్లకోట ఎంపిటిసి చంద్రయ్య, రైతులు, గ్రామస్తులు, చిరువ్యాపారులు, ఖాతాదారులు పాల్గొన్నారు.