ప్రకాశం

గుట్కాలు విక్రయిస్తున్న ముఠా అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కందుకూరు, డిసెంబర్ 14: ప్రభుత్వం నిషేధించిన గుట్కా, ఖైనీ తదితరాలను ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి అంతర్ జిల్లాలలో యథేచ్ఛగా విక్రయిస్తూ ప్రజలకు హాని కలిగిస్తూ ఇటు ప్రభుత్వాన్ని, అటు ప్రజలను మోసం చేస్తూ అక్రమ ధనార్జనే ధ్యేయంగా వ్యాపారం నిర్వహిస్తున్న 21 మందిని కందుకూరు పోలీసులు గురువారం అరెస్టు చేశారు. స్థానిక సిఐ కార్యాలయంలో జరిగిన విలేఖర్ల సమావేశంలో డిఎస్పీ కె ప్రకాష్‌రావు, సిఐ కె నరసింహారావు వివరాలను వెల్లడించారు. వారు తెలిపిన వివరాల మేరకు గుంటూరు జిల్లా వినుకొండకు చెందిన కె రామాంజనేయులు కర్ణాటకలోని బీదర్ నుంచి గుట్కా, ఖైనీలు తీసుకొచ్చి ప్రకాశం, గుంటూరు, నెల్లూరు జిల్లాలలో 12 మంది ఏజెంట్లను ఏర్పాటుచేసి గుట్టుచప్పుడు కాకుండా యథేచ్ఛగా వ్యాపారాన్ని సాగిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ విషయంపై జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రత్యేక నిఘా పెట్టామని, ఇటీవల కనిగిరి, కందుకూరు తదితర ప్రాంతాలలో గుట్కా అక్రమ నిల్వలపై దాడిచేసి సరుకు స్వాధీనం చేసుకుని సంబంధీకులను విచారించంగా డొంక కదిలినట్లు వారు తెలిపారు. తొలుత జరుగుమల్లి మండలం కామేపల్లికి చెందిన కె సుబ్బారావు, కె జగదీష్‌కుమార్ వ్యాపారస్తులను అరెస్టు చేసి విచారించి వారు తెలిపిన వివరాల మేరకు అక్రమంగా వ్యాపారం నిర్వహిస్తున్న ఒంగోలుకు చెందిన ఎస్‌కె రసూల్, ఎస్‌కె చిన్నన్యామతుల్లా, కె మణికంఠ, మహేష్, అలాగే కొండపికి చెందిన పి పాండురంగారావు, బి ప్రతాప్, వి శ్రీనివాసులు, జరుగుమల్లి మండలానికి చెందిన కె భాస్కర్‌రావు, టంగుటూరుకు చెందిన జె రాఘవేంద్ర, ఎస్‌కొండకు చెందిన వి కిరణ్, కందుకూరుకు చెందిన వి కృష్ణ, బి సుకుమార్, పి శ్రీనివాసులు, వి శ్రీనివాసరావు, దర్శికి చెందిన కె హనుమంతరావు, పొదిలికి చెందిన డి వెంకట సుబ్రమణ్యం, నెల్లూరు జిల్లాకు చెందిన పి రవీంద్రారెడ్డి, డి రోశయ్యను మొత్తం 21 మంది అరెస్టు చేసినట్లు తెలిపారు. వారి వద్ద నుంచి రూ. 8లక్షలు విలువజేసే 1387 ఖైనీ బాక్సులను, 427 గుట్కా బాక్సులను స్వాధీనం చేసుకున్నట్లు వారు తెలిపారు. ఈ కేసును ఛేదించిన సిఐ కె నరసింహారావు, పొన్నలూరు, లింగసముద్రం ఎస్సైలు సురేష్‌బాబు, కమలాకర్‌ను డిఎస్పీ అభినందించారు. ఇటువంటి అక్రమ వ్యాపారాలు నిర్వహించే వారిపై రౌడీషీట్ నమోదుచేసి కఠినంగా శిక్షిస్తామని డిఎస్పీ హెచ్చరించారు.
గ్రామాల వౌలికాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది:ఆమంచి

చీరాల, డిసెంబర్ 14: రాష్ట్రప్రభుత్వం గ్రామాల వౌలికాభివృద్దికి కట్టుబడి ఉందని ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ అన్నారు. మండల పరిధిలోని గాంధీనగర్ పంచాయతీలో రూ. 1.12కోట్లతో నిర్మించనున్న సిసి రోడ్లకు గురువారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆర్థికంగా భారమైనప్పటికి ప్రభుత్వం గ్రామాల్లో రహదారులు, డ్రైన్‌లు వంటి వసతులను కల్పించేందుకు సిద్ధంగా ఉందన్నారు. కేంద్రప్రభుత్వం నుంచి విడుదల అవుతున్న ఉపాధి హామి నిధులు, పంచాయతీ సాధారణ నిధులతో సంయుక్తంగా పంచాయతీ పరిధి లో 2.72కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. దాంతో పాటు మరో రూ. 40లక్షలతో పిట్లువారిపాలెం, దేవినూతల గ్రామాల్లో కూడా రోడ్లు నిర్మిస్తామన్నారు.
రైతు పక్షపాతిగా వ్యవహరించాలి: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు రైతు పక్షపాతిగా వ్యవహరించవలసిన అవసరం ఉందని ఎమ్మెల్యే ఆమంచి అభిప్రాయ పడ్డారు. స్థానిక ముంతావారి కూడలిలోని బ్యాంకు కార్యాలయంలో ఏర్పాటుచేసిన ఏటి ఎంను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా సుమారు రూ. 300 కోట్లు రైతులకు రుణాలు ఇచ్చిందని గుర్తు చేశారు. అయితే ఇటీవల కాలంలో బ్యాంకు పాలకవర్గంలో చోటుచేసుకున్న పరిణామాల ప్రభావం రైతులపై పడుకుండా వారి సంక్షేమ కోసం పాటుపడాలన్నారు. పై కార్య క్రమాల్లో బ్యాంకుచార్జి ఛైర్మన్ కె శ్రీనివాసరావు, మున్సిపల్ ఛైర్మన్ మోదడుగు రమేష్, గాంధీనగర్ సర్పంచ్ తాతా సుబ్బారావు, టిడిపి మండల అధ్యక్షుడు బుర్ల మురళి, పట్టణ ఉపాధ్యక్షుడు ఈసర్ల రామారావు తదితరులు పాల్గొన్నారు.