ప్రకాశం

ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షా ఫలితాల్లో దిగజారిన విద్యాకుసుమాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, ఏప్రిల్ 19: రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన జిల్లా ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షా ఫలితాల్లో విద్యాకుసుమాలు దిగజారాయి. గత సంవత్సరం ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షా ఫలితాల్లో జిల్లాకు ఐదవ స్థానం రాగా ఈ సంవత్సరం ఏడవస్థానానికి దిగజారింది. ప్రథమ సంవత్సరం పరీక్షా ఫలితాల్లో మాత్రం గత సంవత్సరం ఏడవస్థానం ఉండగా అదేస్థానాన్ని ఈ సంవత్సరం కూడా నిలుబెట్టుకుంది తప్పితే మెరుగైన ఫలితాలు మాత్రం రాలేదు. ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షాఫలితాల్లో బాలురకంటే బాలికలే అత్యధికంగా ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో జనరల్ కేటగిరికింద 62శాతం మంది, ఒకేషనల్ కోర్సులో 43శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. జనరల్ కోర్సుల కింద 25వేల 143మంది పరీక్షలకు హాజరుకాగా వారిలో 15వేల 468మంది ఉత్తీర్ణులయ్యారు. ఒకేషనల్ కోర్సు కింద 1098 మంది పరీక్షలకు హాజరుకాగా 471మంది ఉత్తీర్ణులయ్యారు. మొత్తం జనరల్, ఒకేషనల్ కోర్సు కింద 26వేల 241మంది హాజరుకాగా 15వేల 939మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. జనరల్ కేటగిరి కింద బాలురు 12వేల 748మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 7139 మంది ఉత్తీర్ణులు అయ్యారు. బాలురు 65శాతం మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 12వేల 395 మంది పరీక్షలకు హాజరుకాగా 8329మంది ఉత్తీర్ణులయ్యారు. 67శాతం మంది బాలికలు పాస్ అయ్యారు. ఒకేషనల్ కోర్సులో 517మంది బాలురు పరీక్షలకు హాజరుకాగా 187మంది ఉత్తీర్ణులు కాగా 36శాతం వచ్చింది. బాలురు 581మంది పరీక్షలకు హాజరుకాగా 284మంది ఉత్తీర్ణులై 49శాతం సాధించారు. 2013 సంవత్సరంలో 53శాతం పాసై రాష్ట్రంలో ఎనిమిదవ స్థానం, 2014 సంవత్సరంలో 56శాతం పాసై రాష్ట్రంలో ఎనిమిదవ స్థానం సాధించారు. 2015 సంవత్సరంలో 60శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో ఏడవస్థానం, అదే స్థానాన్ని ఈ సంవత్సరం కూడా విద్యార్థులు సంపాదించారే కాని ఫలితాలు మాత్రం మెరుగుపడలేదు. ప్రభుత్వ జూనియర్ కాలేజిల్లో బాలురు 1718 మంది పరీక్షలకు హాజరుకాగా 877 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 1332 మంది పరీక్షలకు హాజరుకాగా 793మంది ఉత్తీర్ణులు అయ్యారు. ద్వితీయ సంవత్సరం పరీక్షా ఫలితాల్లో జనరల్ కేటగిరి కింద 21,760 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా వారిలో 15వేల మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఒకేషనల్ కోర్సు కింద 515 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 400 మంది ఉత్తీర్ణులయ్యారు. జనరల్, ఒకేషనల్ కోర్సుకిద మొత్తం 22వేల 275 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 15,400 మంది విద్యార్థులకు ఉత్తీర్ణులయ్యారు. జనలర్ కేటగిరికింద 69శాతం మంది, ఒకేషనల్ కోర్సుకింద 78శాతం మంది విద్యార్థులు పాసయ్యారు. జనరల్‌కేటగిరి కింద 21వేల 760మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వారిలో బాలురు 11,118 మంది పరీక్షలకు హాజరుకాగా 7209మంది ఉత్తీర్ణులై 65శాతం ఫలితాలను సాధించారు. బాలికలు 10,642 మంది పరీక్షలకు హాజరుకాగా 7791 మంది పాసై 73శాతం ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్ కోర్సులో ద్వితీయ సంవత్సరంలో బాలురు 325మంది పరీక్షలకు హాజరుకాగా 241 మంది పాసై 74శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలికలు 190మంది పరీక్షలకు హాజరై 159మంది పాసై 84శాతం ఉత్తీర్ణత సాధించారు. 2013 సంవత్సరంలో 66శాతంమంది పాసై రాష్ట్రంలో ఏడవస్థానం, 2014 సంవత్సరంలో 67శాతం మంది పాసై ఏడవస్థానం, 2015 సంవత్సరంలో 70శాతం పాసై ఐదవ స్థానానికి వచ్చింది. ఈ సంవత్సరం 69శాతం మంది పాసై ఏడవస్థానానికి దిగజారటంతో సర్వత్రా ఇంటర్మీడియట్‌బోర్డు పనితీరుపట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ జూనియర్ కాలేజిల్లో బాలురు 1389మంది పరీక్షలకు హాజరుకాగా 961మంది పాసై 69.19శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 1088మంది పరీక్షలకు హాజరుకాగా 822మంది పాసై 87.18శాతం ఉత్తీర్ణులయ్యారు. ఇదిలాఉండగా జిల్లాలోని తురిమెళ్ల ప్రభుత్వ జూనియర్ కాలేజిలో 96.5శాతం మంది విద్యార్థులు పాసై జిల్లాలో మొదటిస్థానాన్ని సంపాదించారు. ద్వితీయ స్థానాన్ని మర్రిపూడి ప్రభుత్వ జూనియర్‌కాలేజి 94శాతం, తృతీయస్థానం పిసిపల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజి 92శాతం సాధించింది. ఎయిడెడ్ కాలేజిల్లో పర్చూరు బిఎఆర్ అండ్ టిఏ జూనియర్‌కాలేజి 75శాతం సాధించి జిల్లాలో ప్రథమస్థానం సాధించింది. ద్వితీయస్థానం మార్కాపురంలోని ఎస్‌ఆర్‌డబ్ల్యూ కాలేజి 62శాతం సాధించింది. పర్చూరు నూతనపాడు బిఎస్‌వికెఆర్‌ఎం జూనియర్ కాలేజి 58శాతం సాధించి తృతీయ స్థానం సాధించింది. జిల్లాలో చివరి స్థానంలో ఉప్పుగుండూరు ప్రభుత్వ జూనియర్ కాలేజి అధమంగా 42శాతంతో, ఎయిడెడ్ కాలేజిల్లో చీరాలలోని ఎకెపిఅండ్ పికె కాలేజి 21శాతంతో నిలిచాయి. మొత్తంమీద రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షా ఫలితాల్లో బాలికలే అగ్రభాగాన నిలిచి శభాష్ అనిపించుకున్నారు.