ప్రకాశం

పాతమాగులూరులో కలకలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంతమాగులూరు జనవరి 17: జీవానోపాధి కోసం ఊరుగాని ఊరు వచ్చి కూలి పనులు చేసుకుని జీవిస్తున్న మహిళపై పాశవికంగా అత్యాచారం చేసి హత్య చేసి బావిలో పడవేసిన ఘటన సంతమాగులూరు మండలం పాతమాగులూరు సమీపంలోని బొద్దులవాగు వద్ద బుధవారం ఉదయం వెలుగు చూసింది. ఈ దుర్ఘటనలో గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలమం ఆరేపల్లి ముప్ఫాళ్లకు చెందిన మంచాల కనకమ్మ(40) దారుణ హత్యకు గురైంది. పాతమాగులూరు పరిసరాల్లో మహిళ అత్యాచారానికి గురై హత్యకు గురైన సమాచారం తెలుసుకున్న స్థానిక ఎస్సై వై నాగరాజుతో పాటు దర్శి డీఎస్పీ నాగేశ్వరరావు, అద్దంకి సీఐ హైమారావు ఘటనా స్థలిని పరిశీలించారు. బావిలో పడి ఉన్న మృతదేహ పరిస్థితిని బట్టి మృతురాలిని ఎవరో అత్యాచారానికి గురి చేసి ఆపై హత్య చేసి ఉంటారని నిర్ధారణకు వచ్చారు. కేసు దర్యాప్తును వేగవంతం చేసేందుకు ఒంగోలు నుండి పోలీస్ జాగిలాలను తెప్పించారు.
నిందితుల ఆచూకీ గుర్తించిన జాగిలాలు
ఒంగోలు నుండి నేర పరిశోధనకు వచ్చిన జాగిలం కనకమ్మ మృతదేహం పడి ఉన్న బావి వద్ద నుండి పొలాలు తిరుగుతూ గుంటూరు -కర్నూలు రహదారికి తూర్పు వైన ఉన్న లక్ష్మి బాలాజీ గ్రానైట్స్ వద్ద కూలీలు నివాసముండే గది వద్ద ఆగిపోయాయి. ఆ గదిలో రోజు ఉండే ఇరువురు కూలీలు, వారిని కలిసేందుకు మంగళవారం మార్టూరు నుండి వచ్చిన మరోవ్యక్తి ముగ్గురు గదికి తాళాలు వేసి పరారీలో ఉండటంతో వారే నిందితులై ఉండవచ్చుననే ప్రాధమిక అంచనాకు పోలీసు అధికారులు వచ్చారు. ఈమేరకు నిందితులుగా అనుమానిస్తున్న వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మృతురాలి కుమారుడు నరసింహరావు పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహనికి పంచనామా నిర్వహించి నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలలో పోస్టుమార్టం నిమిత్తం తరలించినట్లు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వై నాగరాజు తెలిపారు.
త్వరలో నిందితులను అరెస్ట్ చేస్తాం : అద్దంకి సీఐ హైమారావు
పాతమాగులూరు సమీపంలో జరిగిన మహిళ మృతిని ఆత్యాచారం ఆపై హత్య నేరంకిందన నమోదు చేయడం జరిగిందని నిందితులు ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టామని, త్వరలో నిందితులను అరెస్ట్ చేయడం జరుగుతుందని అద్దంకి సీఐ హైమారావు తెలిపారు.