ప్రకాశం

మొబైల్‌షాపులో చోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంతమాగులూరు జనవరి 19: కొమ్మాలపాడు సెంటర్‌లోని మొబైల్‌షాపులో శుక్రవారం వేకువజామున చోరీ జరిగింది. స్థానిక ఎస్సై వై నాగరాజ కథనం ప్రకారం అద్దంకి-నార్కెట్‌పల్లి రహదారిలో కొమ్మాలపాడు బస్ట్ఫా సెంటర్‌లోని ఫ్రెండ్స్ మొబైల్‌షాపులో గుర్తుతెలియని వ్యక్తులు తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. షాపులోని కంప్యూటర్, కొత్త సిమ్‌కార్డులు, రు.1500నగదు అపహరణకు గురైంది. షాపు యజమాని సుభాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుల ఆధారాలు సేకరించేందుకు క్లూస్‌టీంను రప్పించి చోరీ జరిగిన ప్రదేశంలో వేలిముద్రలు సేకరించారు. కేసు దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై నాగరాజు తెలిపారు.