ప్రకాశం

ఫైనల్‌కు చేరిన ఒంగోలు క్రికెట్ జట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పర్చూరు, జనవరి 19: స్థానిక ఏఎంసి మైదానంలో నిర్వహిస్తున్న అంతర్‌రాష్ట్ర క్రికెట్ పోటీల్లో సిరి హాస్పిటల్ ఒంగోలు క్రికెట్ జట్టు ఫైనల్‌కు చేరింది. శుక్రవారం రెండో సెమీఫైనల్ మ్యాచ్ సిరి హాస్పిటల్ ఒంగోలు జట్టుకు జిబిఆర్ హాస్పిటల్ నర్సరావుపేట జట్ల మధ్య జరిగింది. టాస్ గెలిచిన ఒంగోలు జట్టు ఫీల్డింగ్ ఎంచుకోగా బ్యాటింగ్ చేసిన నర్సరావుపేట జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 106 పరుగులు చేసింది. ఈ జట్టులోని బ్యాట్స్‌మెన్ శివకోటి 29 బంతుల్లో 3 ఫోర్లుతో 22 పరుగులు చేయగా, శంకర్ 17 బంతుల్లో 3 సిక్స్‌లతో 22 పరుగులు చేశాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన ఒంగోలు జట్టు 13.4 ఓవర్ల లోనే మూడువికెట్లు కోల్పోయి 112 పరుగుల సాధించి 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. దీంతో ఫైనల్‌కు చేరింది. ఈ జట్టులోని బ్యాట్స్‌మెన్ వంశీ 35 బంతుల్లో 2 సిక్స్‌లు, 4 ఫోర్లతో 54 పరుగులు చేయగా మరో బ్యాట్స్‌మెన్ క్రాంతి 35 బంతుల్లో 2 సిక్స్, 3 ఫోర్లతో 39 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ ఇద్దరు బ్యాట్స్‌మెన్‌లు జట్టు విజయానికి దోహదపడ్డారు. అత్యధిక పరుగులు చేసిన వంశీ మ్యాన్ ఆఫ్‌ద మ్యాచ్ అవార్డు గెలుచుకోగా ఏఓ శివనాగప్రసాద్, ఎంపిటిసి సభ్యుడు వెంకటేశ్వర్లు అవార్డును ప్రదానం చేశారు. ఫైనల్ పోరు సిరి హాస్పిటల్ ఒంగోలు, మెగా లెవెల్ విజయవాడ జట్ల మధ్య శనివారం జరుగుతుందని నిర్వాహకులు టి శివనాగేశ్వరరావు, టి శ్రీనివాసరావు ఈ సందర్భంగా తెలిపారు.

చేనేత కార్మికులు తయారు చేసిన
వస్తువులను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
- ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల
ఒంగోలు అర్బన్, జనవరి 19 : చేనేత, హస్తకళ కార్మికులు తయారు చేసిన వస్తువులను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు స్వదేశీ హ్యాండీక్రాఫ్ట్ నిర్వాహకులు కృషి చేస్తున్నారని ఒంగోలు శాసన సభ్యులు దామచర్ల జనార్దన్ అన్నారు. శుక్రవారం స్థానిక కాపు కళ్యాణ మండపంలో స్వదేశీ హ్యాండీ క్రాఫ్ట్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చేనేత ప్రదర్శన, అమ్మకాలను ఒంగోలు శాసన సభ్యులు దామచర్ల జనార్దన్ ప్రారంభించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి ఏర్పాటు చేసిన వివిధ వస్తువులను పరిశీలించారు. అనంతరం విలేఖర్లతో దామచర్ల మాట్లాడుతూ తమ ప్రభుత్వ హాయంలో చేనేత, హస్తకళ కార్మికులకు అండగా నిలిచామని, ప్రస్తుతం వారి సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు టివి శ్రీరామ్మూర్తి, చిత్తూరు జిల్లా టీడీపీ నాయకులు గుత్తా రవీంద్ర, నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.