ప్రకాశం

టీడీపీ, వైకాపా క్యాడర్‌లో సమన్వయ లోపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్కాపురం, జనవరి 19: మార్కాపురం నియోజకవర్గంలో రాజకీయ పార్టీలకు బలమైన క్యాడర్ ఉన్నప్పటికీ నేతల మధ్య సమన్వయం లోపం ఉండటంతో రానున్న ఎన్నికల్లో పరిస్థితి ఏమిటా అని నేతల్లో గుబులు ప్రారంభమైంది. నియోజకవర్గంలో టీడీపీకి బలమైన క్యాడర్ ఉంది. అయితే నేతలు మూడు గ్రూపులు, ఆరు వర్గాలుగా ఉండటంతో అందరూ ఐక్యంగా ఉండి అభ్యర్థి విజయానికి కృషి చేస్తారా, లేదా అన్నది మీమాంసగా మారింది. ఎన్నికల నాటికైనా అధిష్ఠానం జోక్యం చేసుకొని అందరి మధ్య సయోధ్య కుదిర్చి టీడీపీ అభ్యర్థి విజయానికి కృషి చేసేలా ఒక తాటిపైకి వస్తారా, రారా అన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీ అమలుచేసిన ఇంటింటికీ టీడీపీ కార్యక్రమాన్ని నియోజకవర్గ ఇన్‌ఛార్జి కందుల నారాయణరెడ్డి నిర్వహించగా, అదేపార్టీకి చెందిన ఇమ్మడి కాశీనాథ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రెండవసారి సిఎం కావాలని పాదయాత్ర నిర్వహించారు. అయితే అధిష్ఠానం కాశీనాథ్‌కు నచ్చచెప్పి పాదయాత్రను విరమింపచేసేలా చర్యలు చేపట్టారు. ఈ సమస్యను త్వరితగతిన పరిష్కరించి అందరినీ ఒక తాటిపైకి తెచ్చి ఐక్యంగా విజయానికి కృషి చేసేలా అధిష్ఠానం దృష్టి సారించాలని కార్యకర్తలు కోరుతున్నారు. ఇక వైకాపా కూడా ఇదే పరిస్థితి. సిట్టింగ్ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డికి తిరిగి టిక్కెట్టు ఇచ్చేందుకు అధిష్ఠానం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ఆశావహులైన మార్కాపురం మాజీ ఎమ్మెల్యే కెపి కొండారెడ్డి, వైకాపా సమన్వయకర్త వెన్నా హనుమారెడ్డి తమకు టిక్కెట్టు ఇవ్వాలని అధిష్ఠానంపై ఒత్తిడి తెస్తున్నారు. వీరిలో ఒకరికి టిక్కెట్టు ఇస్తే మిగిలిన ఇద్దరు ఆ అభ్యర్థి విజయానికి కృషి చేస్తారా అన్నదే ప్రశ్నార్థకంగా మారింది. ఇదిలాఉంటే కెపి కొండారెడ్డికి వియ్యంకుడైన కంభం మాజీ ఎమ్మెల్యే ఉడుముల శ్రీనివాసులరెడ్డి కూడా కెపికి టిక్కెట్టు వస్తే విజయానికి కృషి చేస్తారని, లేకుంటే ఎన్నికలకు దూరంగా ఉంటారన్న అభిప్రాయం కార్యకర్తల్లో వ్యక్తం అవుతోంది. 2014 ఎన్నికల్లో రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వస్తుందని ఒక భావన కాగా, ఎమ్మెల్యే అభ్యర్థి జంకె వెంకటరెడ్డికి ఉన్న మంచిపేరు కలిసొచ్చి విజయం సాధించారని, రానున్న ఎన్నికల్లో ఈ పరిస్థితి ఉండదనే అభిప్రాయం కార్యకర్తల్లో నెలకొంది. ఇలా రెండు ప్రధాన రాజకీయ పార్టీలు వర్గపోరుతో విలవిలలాడుతుండగా, విజయం ఎవరిని వరిస్తుందో చెప్పలేని పరిస్థితి. ఇప్పటికైనా వర్గ రాజకీయాలకు స్వస్తిచెప్పి ఐక్యతా రాగం వినిపిస్తే టిడిపిదే విజయమని ఆ పార్టీ నేతలు భావిస్తుండగా, వైకాపా నేతలు ఐక్యమత్యంగా పనిచేస్తే ఆపార్టీదే విజయమని ఆపార్టీ కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. అధిష్ఠానాలు జోక్యం చేసుకోకుంటే ఎవరిది వారిదే యమునా తీరులా మారుతుందని విశే్లషకులు అంటున్నారు.