ప్రకాశం

మెడికల్ రెప్ నిజాయతీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు జనవరి 20: బస్సులో ప్రయాణిస్తూ పొరపాటున తన బ్యాగు అనుకుని వేరే మహిళకు చెందిన 10 లక్షల రూపాయల విలువైన వస్తువులు కలిగిన బ్యాగ్‌ను ఇంటికి తీసుకెళ్లి తిరిగి ఒంగోలు ఆర్టీసి అవుట్ పోస్టు పోలీసులకు అప్పగించిన ఒంగోలు రాజీవ్‌నగర్‌కు చెందిన మెడికల్ రిప్రజెంటేటీవ్ వినయ్ కుమార్ ఎస్‌పి సత్య ఏసుబాబు ప్రత్యేకంగా అభినందించారు. దరిశి మండలం రాజపల్లి గ్రామానికి చెందిన వై అనూషా అనే ఆమె 10 లక్షల రూపాయల విలువైన వస్తువులు కలిగిన బ్యాగును తీసుకుని దర్శి నుండి ఒంగోలుకు ఆర్టీసి బస్సులో ఎక్కి ప్రయాణిస్తూ ఒంగోలు ఆర్టీసి బస్టాండ్‌లో శనివారం తన బ్యాగు అనుకోని వేరే వారి బ్యాగును తీసుకుని బస్సు దిగింది. బస్సు దిగిన వెంటనే తన బ్యాగును చూసుకోగా అది వేరే వారి బ్యాగు అని గమనించి ఆమె తీవ్ర ఆందోళనకు గురైంది. ఆమె వెంటనే 10 లక్షల రూపాయల బ్యాగును పోగొట్టుకున్న విషయాన్ని ఒంగోలు తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో జిల్లా ఎస్‌పి సత్య ఏసుబాబు, ఒంగోలు పట్టణ డిఎస్‌పి బి శ్రీనివాసరావు ఉత్తర్వుల మేరకు ఒంగోలు తాలూకా పోలీసు స్టేషన్ సిఐ గంగా వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఎస్‌ఐ శ్రీనివాసులు , ప్రసాద్, రాజారావును టీంలుగా ఫామ్ చేయించి వెతుకుతున్న క్రమంలో ఒంగోలు రాజీవ్‌నగర్‌కు చెందిన మెడికల్ రిప్రంజెంటేటీవ్ అయిన వినయ్ కుమార్ ఒంగోలు అవుట్ పోస్టు పోలీసులకు తెలియజేసి ఆ బ్యాగును అప్పగించటం జరిగింది. వెంటనే స్పందించిన పోలీసులు బాధితురాలు అనూషను పిలిపించి బ్యాగును చూపించగా వారు బ్యాగు వారిదేనని గుర్తించి దానిలో ఉన్నటువంటి పదిలక్షల రూపాయల విలువైన వస్తువులు అన్నికూడా సక్రమంగా ఉన్నాయని చెప్పటం జరిగింది. ఈవిషయాన్ని జిల్లా ఎస్‌పి సత్యఏసు బాబుకు తెలియపర్చగా పొరపాటును బ్యాగును తీసుకుపోయి తిరిగి అప్పగించిన మెడికల్ రిప్రజెంటీవ్ వినయ్‌కుమార్‌ను జిల్లా ఎస్‌పి సత్యఏసుబాబు, ఒంగోలు పట్టణ డిఎస్‌పి డి శ్రీనివాసరావు ప్రత్యేకంగా అభినందించి పుష్పగుచ్ఛాన్ని అందచేయటంతోపాటు ఐదువేల రూపాయల క్యాష్‌రివార్డును అందచేశారు. ఈకేసును అతితక్కువ సమయంలో చేధించిన ఒంగోలు తాలుకాపోలీసుటీంలను ఆర్‌టిసి ఒపిటీంలను జిల్లాఎస్‌పి అభినందించారు.