ప్రకాశం

ప్రజలకు, పార్టీశ్రేణులకు జీవితాంతం రుణపడి ఉంటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు అర్బన్,జనవరి 20:ప్రజలు, పార్టీశ్రేణులు చూపించిన ఆదరణ, అభిమానానికి జీవితాంతం రుణపడి ఉంటానని తెలుగుదేశంపార్టీ జిల్లా అధ్యక్షుడు,ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ అన్నారు. శనివారం దామచర్ల జన్మదినోత్సవం సందర్భంగా జిల్లాపార్టీకార్యాలయంలో ఆయన పార్టీశ్రేణుల మధ్య భారీకేక్‌ను కట్‌చేసి పంచిపెట్టారు. ఈ సందర్భంగా దామచర్ల మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో తనకు అత్యంత మెజార్టీతో గెలిపించటమేకాకుండా గత మూడున్నర సంవత్సరాల నుండి ప్రజలు, పార్టీశ్రేణులు చూపిస్తున్న ఆదరణ, అభిమానం ఎన్నటికీ మరవలేనన్నారు. వారి రుణం తీర్చుకుంటానని చెప్పారు. ప్రజల సమస్యలే తన సమస్యలుగా భావించి రాజకీయాలకు, కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా న్యాయం చేస్తున్నట్లు తెలిపారు. అందరి సహకారంతో ఒంగోలు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయటంతోపాటు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తనవంతు సహకారం అందిస్తున్నట్లు తెలిపారు. ప్రధానంగా ఒంగోలు నగరం రూపురేఖలు మార్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ముందుగా వల్లూరమ్మ దేవస్థానంలో కుటుంబ సమేతంగా ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం ఒంగోలులోని ఆయన నివాసంలో బంధువులు, స్నేహితులు, పార్టీశ్రేణుల మధ్య కేక్‌ను కట్‌చేశారు. అనంతరం జిల్లా బ్రాహ్మాణ సంఘం ఆధ్వర్యంలో వేదపండితులు దామచర్లదంపతులను ఆశీర్వదించారు. ఆ తరువాత దామచర్ల నివాసం నుండి భారీ కాన్వాయ్‌తో పార్టీకార్యాలయానికి చేరుకున్నారు. జిల్లా నలుమూలలనుండి వేలాది సంఖ్యలో వచ్చిన ప్రజలు, పార్టీశ్రేణులు దామచర్లను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియచేశారు. తరువాత ఆరువందలమంది యువత రక్తదానం చేశారు. ముందుగా తెలుగుమహిళల ఆధ్వర్యంలో లాయరుపేటలోని సాయిబాబా మందిరంలో దామచర్లసుఖసంతోషాలతో ఉండాలనికోరుకుంటూ ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బాపట్లపార్లమెంటు సభ్యులు శ్రీరాం మాల్యాద్రి, శాసనమండలిసభ్యులు మాగుంట శ్రీనివాసులరెడ్డి, పోతుల సునీత, కొండెపి, యర్రగొండపాలెం శాసనసభ్యులు డోలా బాలవీరాంజనేయస్వామి, పాలపర్తి డేవిడ్‌రాజు, ఎస్‌సికార్పోరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్‌రావు, డెయిరీ చైర్మన్ చల్లా శ్రీనివాసరావు,దామచర్ల సత్య, తెలుగుదేశంపార్టీ నాయకులు ఎస్‌కె కరీముల్లా, బాలిశెట్టి నాగేశ్వరరావు, పెళ్ళూరి చినవెంకటేశ్వర్లు, కొఠారి నాగేశ్వరరావు, దాయినేని ధర్మ, మారెళ్ళ వివేకనందా, టివి శ్రీరామమూర్తి, కట్టాశివయ్య, కొమ్మూరి రవిచంద్ర, దాసరి వెంకటేశ్వర్లు, యర్రాకుల శ్రీనివాసరావు, టి అరుణ, తమ్మినేని మాధవి, రావుల పద్మజ, నాళం నరసమ్మతోపాటు నాయకులు,కార్యకర్తలు దామచర్లను కలిసి పుష్పగుచ్చాలను అందచేసి శుభాకాంక్షలు తెలిపారు.