ప్రకాశం

దర్శి నియోజకవర్గంలో ముదురుతున్న వైకాపా విభేదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,జనవరి 20:దర్శి నియోజకవర్గ వైకాపా రాజకీయాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. వైకాపా అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టనున్న ప్రజాసంకల్పయాత్ర ఇంకా జిల్లాలో చేరకముందే దర్శి నియోజకవర్గంలో గ్రూపురాజకీయాలు మిన్నంటుతున్నాయి. ఎవరికివారే యమునాతీరే అన్నట్లు గ్రూపులు తెరపైకి వచ్చాయి. దర్శి నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాదురెడ్డి గ్రూపు, ప్రస్తుత ఇన్‌చార్జీ బాదం మాధవరెడ్డి గ్రూపురాజకీయాలు తాజాగా బట్టబయలయ్యాయి. బూచేపల్లి కుటుంబం మద్దతు లేకపోతే గెలిచే అవకాశాలు లేవని మాధవరెడ్డికి దర్శి నియోజకవర్గ నాయకులు బాహాటంగానే చెబుతున్నారు. ఇదిలా ఉండగా ముండ్లమూరు మండలానికి సంబంధించిన వైకాపా నాయకుల సమావేశం దర్శిలో ఇన్‌చార్జి బాదం మాధవరెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముండ్లమూరు మండల నాయకులు మొత్తం హాజరుకావాల్సింది. కాని బాదం మాధవరెడ్డి దర్శిలో ఏర్పాటుచేసిన సమావేశానికి కొంతమంది హాజరుకాగా, మరికొంతమంది బూచేపల్లి వర్గీయులు ముండ్లమూరులో సమావేశం ఏర్పాటుచేసుకున్నారు. దర్శిలో జరిగిన సమావేశానికి ముండ్లమూరు మండలపార్టీ అధ్యక్షుడు సూదిదేవర అంజయ్య, పసుపుగల్లు మాజీ సర్పంచ్ చింతా శ్రీనివాసరెడ్డితోపాటు పలువురు హాజరు కాగా ముండ్లమూరులో జరిగిన సమావేశంలో బూచేపల్లి వర్గానికి చెందిన మేడగం రమణారెడ్డి, బోడపాటి శ్రీను, ఎ అంజిరెడ్డి,అడపాల శ్రీను తదితరులు సమావేశమయ్యారు. బూచేపల్లి వర్గీయులు మాత్రం తాము బూచేపల్లి కుటుంబానికి అండగా ఉంటామని తేల్చిచెప్పారు. బూచేపల్లి కుటుంబానికి సముచిత స్థానం కల్పించాలని, బూచేపల్లి కుటుంబం వెంటే తమ పయనమని వెల్లడించారు. గతంలో జరిగిన సమావేశాల్లోనూ బూచేపల్లి మద్దతు ఉంటేనే గెలిచే అవకాశం ఉందని మాధవరెడ్డికి తేల్చిచెప్పటం జరిగింది.కాగా మాధవరెడ్డి ముందుగా మండలాల్లోని నాయకులు, కార్యకర్తలతో సమావేశవౌతూ భారీ బహిరంగసభ ఏర్పాటుచేయాలనే ఆలోచనలో ఉన్నట్లు పార్టీవర్గాల ద్వారా సమాచారం. కాని రాష్ట్ర, జిల్లాపార్టీ నాయకుల అభిప్రాయం మేరకు మాత్రం తొలిసారిగా దర్శి నియోజకవర్గంలో తొలిసారిగా మాధవరెడ్డి కాలుమోపే సమయంలో భారీ ఎత్తున మోటారుసైకిళ్ల ర్యాలీతోపాటు భారీ బహిరంగ సభ ఏర్పాటుచేసి ఉన్నట్లైతే బాగుంటుందన్న అభిప్రాయంలో ఉన్నట్లు పార్టీవర్గాల ద్వారా సమాచారం. గతంలో కాంగ్రెస్‌పార్టీ తరపున ఒంగోలు పార్లమెంటు సభ్యులుగా మేకపాటి రాజమోహన్‌రెడ్డి పోటీచేసిన సమయంలో భారీఎత్తున వాహనాల ర్యాలీతోపాటు, భారీ జనసమీకరణ చేసి అందరిని ఆకట్టుకుని శభాష్ అనిపించుకున్నారు. అనంతరం మేకపాటికి కాకుండా మాగుంట సుబ్బరామిరెడ్డికి ఒంగోలు పార్లమెంటు సీటును కాంగ్రెస్‌పార్టీ కేటాయించింది. ఆ సమయంలోనూ మాగుంట సుబ్బరామిరెడ్డి భారీ ఎత్తున వాహనాల ర్యాలీలు, జనసమీకరణ చేపట్టి అందరి నోళ్ళల్లో నానారు. ఆ వాహనాల భారీర్యాలీ కూడా వల్లూరమ్మ గుడివద్దకు ఆరోజుల్లోనే ఉంది. దీంతో ఏవరు ఈ మాగుంట అన్న చర్చ ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని కాంగ్రెస్‌పార్టీ కార్యకర్తలకే కాకుండా, జిల్లామొత్తం పాకింది. ఆవిధంగా మాధవరెడ్డి దర్శి నియోజకవర్గంలో ఏంట్రీ ఇచ్చినట్లు ఉంటే బాగుండేదన్న అభిప్రాయం కూడా రాష్ట్ర, జిల్లాపార్టీశ్రేణులనుండి వినిపిస్తొంది. కాని ఆవిధంగా కాకుండా మండలాల వారీగా సమావేశాలు ఏర్పాటుచేయటం, నాయకులు రెండుగ్రూపులుగా విడిపోవటం జరుగుతుంది. ప్రధానంగా బూచేపల్లి కుటుంబం మద్దతు లేకపోతే వైసిపి తరుపున ఏవరు పోటీచేసినా గెలుపొందే ప్రశక్తేలేదన్న వాదన ఆపార్టీనేతలనుండే వెల్లడౌతుంది. ఇలాంటి తరుణంలో రాష్టప్రార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, జిల్లాపార్టీనాయకులు బూచేపల్లి, మాధవరెడ్డిలను ఏమేరకు వీరిద్దని కలుపుతారో వేచిచూడాల్సిఉంది. బూచేపల్లి ప్రభావం మాత్రం దర్శి నియోజకవర్గంపైనే కాకుండా సంతనూతలపాడు నియోజకవర్గంపైనా భారీగా ప్రభావం చూపనుంది.
కాగా దర్శి నియోజకవర్గ వైకాపా నాయకుల్లో బహిర్గతకుమ్ములాటలు జోరందుకోవటంతో తెలుగుదేశంపార్టీ శ్రేణుల్లో ఆనందం మిన్నంటుతోందని చెప్పవచ్చు. తాము ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరుతామన్నా ధీమాలో తెలుగుతమ్ముళ్లు ఉన్నట్లు సమాచారం. మొత్తంమీద బూచేపల్లి వర్గీయులు మాత్రం మాధవరెడ్డిపై తిరుగుబావుటా జెండా ఎగరవేస్తున్నారు. దీంతో ఆ నియోజకవర్గంలో వైకాపా రాజకీయాలు ఏటు మలుపుతిరుగుతాయోనన్న చర్చ ఆపార్టీనేతలనుండి వినిపిస్తున్నాయి.