ప్రకాశం

మినె్నకల్లులో సత్ఫలితాలనిస్తున్న నీరు-చెట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంతమాగులూరు, జనవరి 20 : రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నీరు-చెట్టు కార్యక్రమం ఇప్పుడిప్పుడిప్పుడే సత్ఫలితాలనిస్తుంది. మండలంలో అన్ని గ్రామాల్లో నీరు-చెట్టు కార్యక్రమంద్వారా కుంటలు, చెరువుల్లో పూడికతీతలు చేపట్టి వర్షపునీటికి నిలకడ నేర్పగా, మినె్నకల్లు రైతులు మరమ్మతులకు గురై గత పదేళ్లుగా మూతపడ్డ తారకరామ ఎత్తిపోతల పథకం మరమ్మతులు చేయించాలని 2015లో గ్రామానికి విచ్చేసిన సీనియర్ టీడీపీ నాయకులు ప్రస్తుత శాసన మండలి సభ్యులు కరణం బలరామకృష్ణమ్తూని కోరారు. రైతులు అడిగిందే తడవుగా తారకరామ ఎత్తిపోతల పథకంపై పూర్తి అవగాహన ఉన్న కరణం తక్షణమే ప్రతిపాదనలు పంపాల్సిందిగా చిన్నతరహనీటి పారుదల శాఖ అధికారులను ఆదేశించారు. కరణం ఆదేశాల మేరకు ఎత్తిపోతల పథకం పనిచేయాలంటే ఓగేరు వాగునుండి లక్ష్మిపురం వరకు 2.5 కి.మీ మేర పూర్తిగా కొత్తపైపులైన్లు వేయాలని రు.5.17 కోట్ల అంచనాలను సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపారు. అంచాల మేర నీరు -చెట్టు కార్యక్రమంలో నిధులు మంజూరు చేయించడంలో కరణం కీలక భూమిక పోషించి ఎట్టకేలకు నిధులు మంజూరు చేయించారు. ఎత్తిపోతల పథకం పనులు చేసేందుకు ఆయకట్టు రైతులు ఒక కమిటీగా ఎర్పడి మినె్నకల్లుకు చెందిన కోటేశ్వరరావు పర్యవేక్షణలో పనులు చేపట్టారు.
రైతుల పర్యవేక్షణలో పనులు చకచకా..
తారకరామ ఎత్తిపోతల పథకం పనులు రైతుల పర్యవేక్షణలో చకచకా జరిగిపోయాయి. ఓగేరు వాగునుండి 2.480 మీటర్లు మేర నిడివి గల పైపులైనును 2.8మీటర్ల వ్యాసం గల పైపులతో సరిగ్గా సంవత్సరకాలంలో పూర్తిచేశారు. గతంలో మాదిరిగా పైపులైన్లు తరచూ మరమ్మతులకు గురికాకుండా పైపులైనుకు ఐదు చోట్ల ఎయిర్‌వాల్స్ అమర్చారు. అంచనాలతో పనులు పూర్తిచేసుకున్న తారకరామ ఎత్తిపోతల పథకాన్ని గత పంట సీజన్ చివరిలో ట్రైల్ రన్ చేసి పథకం విజయవంతమైందని నిర్ధారణకు వచ్చారు. ఈ ఏడాది వ్యవసాయ సీజన్ ప్రారంభం నుండి తారకరామ ఎత్తిపోతల పథకం ఆయకట్టు భూములు సస్యస్యామలంగా పచ్చదనాన్ని సంతరించుకన్నాయి.
నిర్వహణ రైతుల పర్యవేక్షణే..
తారకరామ ఎత్తిపోతలపథకం నిర్వహణ భారాన్ని రైతులే పంచుకుంటున్నారు. సాధారణంగా ఆయిల్ ఇంజన్‌తో పంటలకు తడులకు భారీ వ్యయంతో తల్లడిల్లిపోయిన రైతులకు తారకరమా ఎత్తిపోతల పథకం సంజీవనిగా మారింది. రైతులే నిర్వహణ వ్యయాన్ని నిర్ధారించుకున్నారు. మిర్చి పైరుకు సాలీనా తడులకు రు.2000లు,మగాణికి రు.5000లు ఇక ఆరుతడులకు దుక్కి తదితర తడులకు ఎకరాకు రూ.500 చొప్పున నిర్ణయించుకుని ఆమేర ఏటా రు.2.5లక్షలు ఒక చోటికి చేర్చి ఆ డబ్బుతో మరమ్మతులు, పర్యవేక్షణ సిబ్బందికి వేతనాలు, తరచూ ఏర్పడే చిన్నపాటి మరమ్మతులు చేయించుకుంటూ నీరు-చెట్టు చేసిన మేలు మరువలేమంటూ ఆ ఐదు గ్రామాల రైతులు ఆనందంగా చెబుతున్నారు.
పథకానికి చెక్‌డ్యాం నిర్మిస్తే 365రోజులు నీరే..
తారకరామెత్తిపోతల పథకానికి నీరు వచ్చే ఓగేరు వాగు లో ఎత్తిపోతల పథకం సమీపంలో చెక్ డ్యాం నిర్మించినట్లయితే అక్కడ కొద్దిపాటి నీరు నిల్వ చేయగలిగితే సంవత్సరంపొడవునా 365రోజులు పథకం నడచి ఆయకట్టు భూములలో మూడు పంటలు పండించ వచ్చని రైతులు అంటున్నారు. ఉన్నతాధికారులు తారకరామ ఎత్తిపోతల పథకం వద్ద చెక్‌డ్యాం నిర్మాణానికి చర్యలు తీసుకోవాల్సలిన అవసరం ఉంది.

నాలుగు కిలోమీటర్ల మేర పొలాలన్నీ సస్యశ్యామలం
- కోటేశ్వరరావు, రైతుల సంఘ అధ్యక్షులు
రూ 5.17 కోట్ల నీరు-చెట్టూ కార్యక్రమంతో తారకరామ ఎత్తిపోతల పథకం మరమ్మతులు పూర్తిచేసుకున్నాం. ఇప్పుడు లక్ష్మిపురం నుండి పమిడిమర్రు వరకు నాలుగు కిలోమీటర్ల మేర నీరు పుష్కలంగా అందుతుంది. ఓగేరు వాగులో చెక్ డ్యాం నిర్మించినట్లయితే పథకం సంవత్సరం పొడవునా వినియోగించి ఆయకట్టులో మూడు పంటలు సాగు చేసుకునే వీలు ఉంటుంది.
ఐదు గ్రామాలకు ప్రయోజనం
తారకరామ ఎత్తిపోతల పథకం వినియోగంలోకి రావడంతో ఐదు గ్రామాల రైతులకు ప్రయోజనం చేకూరింది. పాతమాగులూరు, మినె్నకల్లు, తంగేడుమల్లితో పాటు గుంటూరు జిల్లా పరిధిలోని కాకాని పమిడిమర్రు గ్రామాలకు చెందిన 446 మంది రైతులకు 1500 ఎకరాల భూములను సస్యశ్యామలం చేసింది.