ప్రకాశం

పడవ ప్రమాదంలో మృతుల వారసులకు ఆర్థిక సహాయం పంపిణీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు అర్బన్, జనవరి 22 : క్రిష్ణా జిల్లాలో జరిగిన పడవ ప్రమాదంలో మృతి చెందిన 18 మంది మృతుల వారసులకు ప్రధానమంత్రి సహాయ నిధి నుండి మంజూరు అయిన ఆర్థిక సహాయాన్ని జిల్లా కలెక్టర్ వి వినయ్ చంద్ సోమవారం పంపిణీ చేశారు. గత సంవత్సరం నవంబర్ 12వ తేది న పడవ ప్రమాదం జరుగ్గా అందులో ప్రకాశం జిల్లాకు చెందిన 18 మంది మృతి చెందిన విషయం పాఠకులకు విధితమే. వారి వారసులకు ఒక్కొక్కరికి రెండు లక్షల రూపాయల చొప్పు 36 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం ప్రధాన మంత్రి సహాయ నిధి నుండి మంజూరు అయ్యింది. ఇందుకు సంబంధించి బ్యాంకు చెక్కులను జెట్టి ప్రభాకర్‌రెడ్డి తరుఫున జెట్టి లక్ష్మీకి, దాచర్ల భారతి తరుపున దాచర్ల శివన్నారాయణకి, కల్లగుంట వెంకట రమణ, కల్లగుంట ఆంజనేయులు తరుఫున కల్లగుంట పవన్‌కుమార్ కు, కూరపాటి నారాయణరాజు తరుఫున కూరపాటి ఉషారాణికి, పసుపులేటి సీతారామయ్య , అంజమ్మల తరుఫున పసుపులేటి సతీష్‌కుమార్‌కు, పెండ్యాల సుజాత తరుఫున పెండ్యాల శ్రీనివాసరావుకు, అరవపల్లి గురునాధం తరుపున అరవపల్లి నగేష్ కు, కోసూరి శివరితీష్ రాయ్ తరుపున కోసూరి అంజలికి, కటారి సుధాకర్‌రావు , భూలక్ష్మీల తరుపున కటారి రమణమ్మ కు జిల్లా కలెక్టర్ అందజేశారు. వీరికి ఇది వరకే రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించిన విధంగా చంద్రన్న భీమా ఉన్న వారికి పది లక్షలు, మిగిలిన 17 మందికి 8 లక్షల రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా ను జిల్లా కలెక్టర్ గతంలోనే పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ - 1, 2 ఎస్ నాగలక్ష్మీ, డి మార్కండేయులు , డి ఆర్‌వో ప్రభాకర్‌రెడ్డి, ఆర్డీవో శ్రీనివాసరావు, కె ఆర్ ఆర్‌సి ఎస్‌డిసి నరసింహులు, జిల్లా అధికారులు కలెక్టరేట్ సి విభాగం పర్యవేక్షకులు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
ఎస్సీ, ఎస్టీ బాధిత
కుటుంబాలకు ప్రభుత్వం అండ
దాడులకు గురైన ఎస్సీ , ఎస్టీ బాధిత కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం అన్నీ విధాలుగా ఆదుకుంటుందని జిల్లా కలెక్టర్ వి వినయ్ చంద్ పేర్కొన్నారు. సోమవారం స్థానిక సిపివో సమావేశ మందిరంలో మీకోసం కార్యక్రమం సందర్భంగా ఎస్సీ, ఎస్టీ బాధిత కుటుంబాలకు జిల్లా కలెక్టర్ ఆర్థిక సహాయం మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. కొరిశపాడు మండలం మేదరమెట్ల గ్రామానికి చెందిన కె దేవదానం భార్య కోటిరత్నం కు నాలుగు లక్షల 25 వేల రూపాయలు, అదే గ్రామానికి చెందిన మాస్టర్ బత్తినేని మణికంఠ, నాని లకు నాలుగు లక్షల రూపాయలు , దొనకొండ మండలం వీర వెంకటాపురం కాలనీకి చెందిన గొట్టిముక్కల జయకాంతారావు భార్య సుజాత కు ఒక లక్షా 50 వేల రూపాయలు, స్థానిక కర్నూల్ రోడ్డులోని శ్రీనగర్ కాలనీ నాల్గో లైన్ కు చెందిన మట్టం ఆంజనేయులు కుమారుడు రాజశేఖర్ కు లక్ష రూపాయలు, మార్కాపురం మండలం వేములకోట గ్రామానికి చెందిన జానుమాల దానం కుమారుడు నాగయ్యకు 50 వేల రూపాయలను జిల్లా కలెక్టర్ మంజూరు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్లు ఎస్ నాగలక్ష్మీ, డి మార్కండేయులు తదితరులు పాల్గొన్నారు.