ప్రకాశం

జిల్లా పోలీసు కార్యాలయంలో గ్రీవెన్స్ సెల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, జనవరి 22: జిల్లా పోలీసు కార్యాయలయంలో జిల్లా ఎస్‌పి సత్య ఏసుబాబు ఆద్వర్యంలో సోమవారం నాడు గ్రీవెన్స్ సెల్ కార్యక్రమం జరిగింది. ఈ గ్రీవెన్స్ సెల్ కార్యక్రమానికి మొత్తం 43 మంది అర్జీ దారులు వచ్చి తమ సమస్యలను విన్నవించుకున్నారు. వెంటనే స్పందించిన జిల్లా ఎస్‌పి సత్య ఏసుబాబు సంబంధిత అధికారులకు వారి సమస్యలను తెలియజేసి వెంటనే పరిష్కరించాలని తెలియజేశారు. వచ్చిన అర్జీలు ఎక్కువుగా భూ తగాదాలు, ఆర్ధిక లావాదేవీలు, వరకట్నం లకు సంబంధంచిన సమస్యల మీద అర్జీల రూపంలో ఎస్‌పి కి అర్జీ దారులు అందజేశారు.
అక్రమ నిల్వల స్వాధీనం
- 123 గ్యాస్ సిలెండర్లు స్వాధీనం
- 9 బస్తాల గుట్కా ప్యాకెట్లు స్వాధీనం
పంగులూరు, జనవరి 22: మండలంలోని ముప్పవరం గ్రామంలో ఓ పాడుబడిన ఇంట్లో అక్రమంగా దాచిన ఉంచిన 123 గ్యాస్ సిలెండర్‌లను అలాగే మరో ఇంట్లో దాచిన 9 బస్తాల గుట్కా ప్యాకెట్లను విజిలెన్సు అండ్ ఎన్‌ఫోర్సుమెంట్ అధికారులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. ఒంగోలు విజిలెన్సు అండ్ ఎన్‌ఫోర్సుమెంట్ సి ఐ భూషణం అందించిన తెలిపిన వివరాల మేరకు ముప్పవరంలోని శిధిలావస్థలో ఉన్న తాటి కొండలు ఇంట్లో 59 భారత్‌గ్యాస్ కంపెనీ సిలెండర్‌లు, 64 ఇండియన్ గ్యాస్ కంపెనీ సిలెండర్‌లను దాచి ఉంచినట్లు గుర్తించామన్నారు. చిలకలూరిపేటలో నివాస ముంటున్న ముప్పవరం గ్రామస్థుడు పోలిశెట్టి సూర్యనారాయణ వీటిని అక్రమంగా నిల్వ ఉంచినట్లు గుర్తించామన్నారు. సిలెండర్‌లను పంగులూరు ఓం దివ్య ఇండియన్ గ్యాస్ డీలర్‌కు అప్పగించినట్లు ఆయన తెలిపారు. అదే విధంగా సూర్యనారాయణను ముప్పవరంలో తమ సోదరుడు పోలిశెట్టి పూర్ణచంద్ర రావు నివాసముంటున్న అద్దె ఇంటిలో 6,750 గుట్కా ప్యాకెట్లును స్వాధీనం చేసుకున్నామన్నారు. వీటి విలువ సుమారు 1.23 లక్షల విలువ ఉంటుందన్నారు. స్వాధీనం చేసుకున్న గుట్కా ప్యాకెట్లును ఫుడ్ సేఫ్టీ అధికారులకు అప్పగించామన్నారు. ఈ మేరకు సూర్యనారాయణపై కేసు నమోదు చేసినట్లు సి ఐ తెలిపారు. ఆకస్మిక తనిఖీల్లో విజిలెన్సు ఎఫ్ ఐ ఉమామహేశ్వరరావు, ఎస్సై అహమద్ జాని, కానిస్టేబుల్స్ ప్రసాద్, వెంకటేశ్వర్లు, శివ తదితరులు ఉన్నారు.