ప్రకాశం

రౌడీషీటర్ల భరతం పడతా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పొదిలి,జనవరి 23:జిల్లాలోని రౌడీషీటర్లు తమప్రవర్తనను మార్చుకోకుండా ఏలాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడిన వారి భరతం పడతానని జిల్లాఎస్‌పి బి సత్యఏసుబాబు హెచ్చరించారు. మంగళవారం ఆయన పొదిలి పోలీసుస్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్బంగా ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ ఇటీవల రాష్టమ్రుఖ్యమంత్రి జరిపిన ఐపిఎస్ అధికారుల సమావేశంలో పలుసూచనలు, సలహాలు ఇవ్వటం జరిగిందన్నారు. అందుకు అనుగుణంగా పోలీసుశాఖలో మార్పులు చేపడుతున్నామని తెలిపారు. ముఖ్యంగా రౌడీషీటర్ల కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటుచేస్తున్నామన్నారు. అందులోభాగంగా వారి వేలిముద్రలు, నేర చరిత్రలను పోలీసుస్టేషన్లల్లో పొందుపరుస్తున్నామన్నారు.రోడ్డుప్రమాదాలు నివారించేందుకు గట్టి చర్యలు తీసుకుంటున్నామని అందువలనే 2016లో జిల్లాలోరోడ్డుప్రమాదాల వలన 569మంది మృత్యువాత పడగా 2017లో 523మంది మరణించారన్నారు. కాగా ఈ ఏడాది ప్రమాదాలను మరింత తగ్గించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. మద్యంసేవించి వాహనాలు నడిపే వారిపట్ల పోలీసుశాఖ కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. అలాగే ప్రమాదాలు నివారించేందుకు రోడ్లపై రేడియం స్టిక్కర్లను ఏర్పాటుచేస్తున్నామని ఎస్‌పి తెలిపారు. అద్దె భవనాల్లో కొనసాగుతున్న పోలీసు స్టేషన్లకు పక్కా భవనాలు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాచర్ల,పుల్లలచెరువు, హెచ్‌ఎం పాడు స్టేషన్లకు పక్కా భవనాలు నిర్మించేందుకు ప్రభుత్వం అనుమతించిందన్నారు. అలాగే సంతమాగులూరు, మర్రిపూడి తదితర పోలీసుస్టేషన్లకు శాశ్వత భవనాలు నిర్మించేందుకు ప్రతిపాదనలు పంపనున్నట్లు తెలిపారు. పొదిలిలో దొంగతనాలు, అసాంఘికకార్యకలాపాలు ఎక్కువుగా జరుగుతున్నాయని పలువురు పాత్రికేయులు ఆయన దృష్టికి తీసుకువెళ్ళగా అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆయన అధికారులను ఆదేశించారు. శాంతి పరిరక్షణ,నేరాలను అదుపుచేయటంలో పోలీసు సిబ్బంది ఏలాంటి నిర్లక్ష్యం వహించినా వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తానని ఎస్‌పి హెచ్చరించారు. ముందుగా ఆయన పోలీసుస్టేషన్‌లో ఏర్పాటుచేయనున్న పెట్రోల్‌బంకుకు అవసరమైన స్దలాన్ని పరిశీలించారు. అలాగే పోలీసుస్టేషన్‌ను, రికార్డులను ఆయన పరిశీలించారు. సమావేశంలో దర్శి డిఎస్‌పి నాగేశ్వరరావు, పొదిలి సిఐ ఎం శ్రీనివాసరావు, ఎస్‌ఐ జె నాగరాజుతదితరులు ఉన్నారు.