ప్రకాశం

డీసీసీ బ్యాంకు పాలకవర్గ పదవీ కాలం ఆరునెలలు పొడిగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు అర్బన్, జనవరి 23 : జిల్లా సహకార కేంద్ర బ్యాంకు పాలక వర్గ పదవీ కాలాన్ని మరో ఆరు నెలల పాటు పొడగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా డీసీసీ బ్యాంకు పాలక వర్గం మరో ఆరు నెలల పొడగింపుతో పాలక వర్గ సభ్యుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఈ సందర్భంగా మంగళవారం డీసీసీ బ్యాంకు చైర్మన్ కండే శ్రీనివాసులు తన ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పదవీ కాలాన్ని మరో ఆరు నెలల పాటు పొడగించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర సహకార శాఖా మంత్రి టి ఆదినారాయణ, రాష్ట్ర మున్సిపల్ శాఖా మంత్రి పి నారాయణ, రాష్ట్ర అటవీ శాఖా మంత్రి శిద్దా రాఘవరావులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు. బ్యాంకు అధ్యక్షునిగా తనను వెన్నుతట్టి , అండగా నిలిచి తన ప్రతి ఎదుగుదలలో తన కు మార్గదర్శిగా ఉన్న జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు , ఒంగోలు శాసన సభ్యులు దామచర్ల జనార్థన్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. బ్యాంకు లావాదేవీలకు సంబంధించి స్వల్ప కాలిక రుణాలను పంపిణీ చేసేందుకు 20 కోట్ల రూపాయల అనుమతులను మంజూరు చేయడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు 14 కోట్ల రూపాయలు పంపిణీ చేశామన్నారు. పాత వారికి ఆరుకోట్లు, కొత్త వారికి 8 కోట్ల రూపాయలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. టార్గెట్ ఇచ్చి అనుమతులు పూర్తి చేసిన సంఘాలకు అదనంగా 8.60 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఈ నెల 31వ తేది లోగా స్వల్ప కాలిక రుణాలను మంజూరు చేస్తామన్నారు. గత సంవత్సరం నవంబర్ 13వ తేది నుండి ఈ నెల 20వ తేది వరకు దీర్ఘ కాలిక రుణాల కింద 11 కోట్ల రూపాయలను పంపిణీ చేయడం జరిగిందన్నారు. దీర్ఘ కాలిక రుణాలు, కర్షక వికాస రుణ పధకాలకు సంబంధించి అర్హత కలిగిన వ్యక్తులకు మంజూరు చేసే అధికారాలు బ్రాంచి మేనేజర్ల కే బదిలీ చేశామని తద్వారా రుణాల పంపిణీ త్వరితగతిన పూర్తి చేసేందుకు అవకాశం ఉంటుందన్నారు. గత సంవత్సరం మార్చి 31వ తేది నాటికి 592.02 కోట్లు డిపాజిట్లు ఉండగా ఈ నెల 20వ తేది నాటికి 568. 99 కోట్లు ఉన్నాయని, 23.03 కోట్లు తేడా ఉందన్నారు. యఫ్ ఆర్‌డిఐ బిల్లు,రుణాలు మంజూరు చేసే సేవింగ్స్ ఖాతాలో జమ చేయడం ద్వారా గత సంవత్సరం డిపాజిట్లు ఎక్కువగా చూపడం జరిగిందన్నారు. 2017 జూన్ లో నోట్ల రద్దు కారణంగా పాత 500, వెయ్యి రూపాయల నోట్ల ఉన్న 19 కోట్ల రూపాయలను రిజర్వ్ బ్యాంకు కు స్వాధీనం చేయడం జరిగిందన్నారు. ఈ నెల 16వ తేది నుండి 31వ తేది వరకు డిపాజిట్ల సేకరణ పక్షోత్సవాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఉద్యోగుల బదిలీలు వారి వారి అభ్యర్థన మేరకే చేస్తున్నామని, డిపాజిట్ల సేకరణ, స్వల్ప కాలిక, దీర్ఘ కాలిక , కర్షక వికాస రుణాలు వసూలు నిమిత్తం బ్రాంచీలకు అద్దె వాహనాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. బ్రాంచీల వారీగా సంఘ అధ్యక్షులు, బ్రాంచి మేనేజర్లు, సూపర్ వైజర్లు, సొసైటీ సి ఈవోలతో బ్యాంకు అధ్యక్షులు, బ్యాంకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు సమీక్షా సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు.