ప్రకాశం

గ్రామపంచాయతీల సమగ్రాభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, ఏప్రిల్ 24 : గ్రామ పంచాయతీల సమగ్ర అభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం అత్యంత అవసరమని జిల్లా కలెక్టర్ సుజాత శర్మ పేర్కొన్నారు. ఆదివారం ఉదయం ఒంగోలు మండలంలోని మండువవారిపాలెంలో ఏర్పాటు చేసిన జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ వేడుకల్లో కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామసభల్లో ప్రజలందరూ పాల్గొని సమస్యలను గ్రామసభల్లో పరిష్కరించుకుని గ్రామాభివృద్ధికి పాటుపడాలన్నారు. గ్రామ పంచాయతీలను బలోపేతం చేయడానికి రాజ్యాంగంలో సవరణలు చేసినట్లు చెప్పారు. అర్ధవంతమైన గ్రామసభలు ఏర్పాటు చేసుకోవాలని, ఎవరిపై ఆధారపడకుండా గ్రామ పంచాయతీల్లో ప్రజల భాగస్వామ్యంతో తీర్మానాలు చేసుకుని గ్రామాభివృద్ధి పనులు చేపట్టాలని, జన చైతన్యం తీసుకురావాలన్నారు. స్మార్ట్‌వార్డు, స్మార్టు గ్రామానికి సంబంధించి 20 రాజీలేని అంశాలకు సంబంధించి అధికారులు భాగస్వాములుగా ఉన్న చోట ఎ గ్రేడ్‌లోనూ ప్రజల భాగస్వామ్యం ఉండాల్సిన చోట డి గ్రేడ్‌లో మండువవారిపాలెం గ్రామ పంచాయతీ ఉందని, ఈ సందర్భంగా కలెక్టర్ గుర్తు చేశారు. గ్రామ అభివృద్ధికి ఏమి అవసరాలు ఉన్నాయో తెలుసుకుని గ్రామసభలో ప్రజలు భాగస్వాములై చర్చించుకుని అవసరమైన పనులు చేపట్టాలన్నారు. మండల, జిల్లా పరిషత్ నుండి నిధులు నేరుగా గ్రామ పంచాయతీలకే కేటాయించడం జరుగుతుందని, వీటిని సద్వినియోగపరచుకుని గ్రామఅభివృద్ధికి తోడ్పాటు అందించేందుకు ప్రజల భాగస్వామ్యం అవసరమన్నారు. ప్రతి వర్షపు నీటి బొట్టును ఒడిసి పట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని కలెక్టర్ స్పష్టం చేశారు. శనగ, పొగాకు పంటలకు సరైన సమయంలో నీరు అందిస్తే మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉందని తెలుపుతూ గ్రామ ప్రజలు తప్పని సరిగ్గా నీటి సంరక్షణా కార్యక్రమం పై దృష్టి సారించాలన్నారు. గ్రామంలో గల చిన్న చిన్న సమస్యల పరిష్కారం మీ చేతుల్లోనే ఉందని ,వాటిని గుర్తించాలన్నారు. మూడునెలలకు ఒకసారి జరిగే గ్రామ సభలో పాల్గొని సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. జిల్లా పంచాయతీ అధికారి ప్రసాదరావు మాట్లాడుతూ గ్రామ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుని పారిశుద్ధ్య కార్యక్రమాలపై ఎక్కువ దృష్టి సారించాలన్నారు. గ్రామ వికాసంతోనే దేశవికాసం అన్నారు. జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు మురళీక్రిష్ణ మాట్లాడుతూ ప్రతి రైతు పొలంలో నీటికుంటలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. గ్రామాల్లో రైతులు తప్పని సరిగ్గా భూసార పరీక్షలు నిర్వహించుకొని సూక్ష్మ పోషక లోపాలను గుర్తించి లోపాలను నివారించి అధిక దిగుబడులను సాధించాలన్నారు. జింకు, జిప్సన్, బోరాన్‌ను 50 శాతం రాయితీ ద్వారా రైతులకు సరఫరా చేస్తున్నామని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కలెక్టర్ గ్రామంలో చేపడుతున్న పనుల వివరాలు, గ్రామంలో ఏయే అవసరాలు కావాల్సి ఉన్న వాటిని గ్రామ సర్పంచ్ గ్రామప్రజలను అడిగి తెలుసుకున్నారు. గ్రామ సర్పంచ్ కె ఉదయ్‌భాస్కర్ గ్రామసభకు అధ్యక్షత వహించి మాట్లాడారు. గ్రామంలోని చెరువుకు ఫిల్టర్‌బెడ్, కమ్యూనిటీ హాలు, అంబేద్కర్ కాలనీ వాసులకు శ్మశానస్థలం, అంగన్‌వాడీ కేంద్రానికి శాశ్వత భవనం ఏర్పాటు, సైడు కాలువల ఏర్పాటు చేయాలని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం జిల్లా కలెక్టర్ జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా గ్రామప్రజలు, అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సమావేశంలో వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.