ప్రకాశం

దళితుల అభివృద్ధి టీడీపీ ప్రభుత్వ లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దర్శి, ఫిబ్రవరి 20: దళితుల అభివృద్ధి తెలుగుదేశం ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర అటవీశాఖ మంత్రి శిద్దా రాఘవరావు పేర్కొన్నారు. సోమవారం రాత్రి దర్శి మండలం తూర్పువీరాయపాలెం గ్రామంలో జరిగిన దళిత తేజం- చంద్రన్న ముందడుగు కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి శిద్దా మాట్లాడుతూ దళిత, బడుగు, బలహీనవర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలను గమనించిన దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు తెలుగుదేశంపార్టీని ఏర్పాటుచేసారని చెప్పారు. తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తరువాతనే దళితులకు సముచిత గౌరవం లభిస్తోందని అన్నారు. ప్రతి దళితవాడను అభివృద్ధి చేస్తూ పక్కా గృహాలను నిర్మించామని చెప్పారు. దళితుల సమస్యలను తెలుసుకుని పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దళితతేజం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసారని అన్నారు. దళితులకు కార్పోరేషన్ల ద్వారా రుణాలు ఇచ్చి ఇన్నోవాలు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. దళితుల ఉన్నత చదువులకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు కేటాయించిందని తెలిపారు. దళితులు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ది చెందుతుందనే అభిప్రాయంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దళితులకు పెద్దపీట వేస్తున్నారని అన్నారు. ప్రతి దళితుడికి పక్కా గృహంతోపాటు, భూమికొనుగోలు పథకం ద్వారా భూములను పంపిణ చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రం విడిపోయిన తరువాత ఎన్నో కష్టాలు ఏర్పడినా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని తెలిపారు. రైతుల రుణమాఫీ, డ్వాక్రా రుణాలను మాఫీ చేయటం జరిగిందని అన్నారు. నియోజకవర్గంలో కోట్లాదిరూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టామని, ద్వార్నపువాగుపై బ్రిడ్జీ నిర్మాణం, డ్రైవింగ్ శిక్షణ కేంద్రం, రహదారుల అభివృద్ధి, ఎత్తిపోతల పథకాలు తదితర కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. భవిష్యత్తులో కూడా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ప్రతి గ్రామంలో తమ సొంత నిధులతో రక్షిత మంచినీటి కేంద్రాలను ఏర్పాటుచేసి సురక్షిత జలాలను అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సూరే చినసుబ్బారావు, ఎంపీపీ పూసల సంజీవయ్య, మండల ఉపాధ్యక్షుడు మారం శ్రీనివాసరెడ్డి, వేతన సంఘం డైరక్టర్ శోభారాణి, పార్టీ నాయకుడు సంగా తిరుపతిరావు, ఎస్సీ సెల్ నాయకుడు జోసప్, ఎంపీటీసీ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.