ప్రసాదం

యోగక్షేమం వహామ్యహమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓ పర్యాయం ఓ భక్తుడు తోడు ఎవరూ లేరని ఒంటరైపోయానని దిగులుపడ్డాడు. తోడుకోసం దేవుడ్ని ప్రార్థించాడు.
దేవుడు ప్రత్యక్షమై ‘‘ఏం కావాలో కోరుకో’ అన్నాడు.
‘‘స్వామీ! నాకు అండగా నువ్వు నాతో ఉండాలి. నా తోడుగా ఉండాలి. తోడుగా ఉండి నా సంగతులన్నీ నువ్వే చూసుకోవాలి’’ అని దేవుడ్ని కోరేడు భక్తుడు.
దేవుడు సరే అన్నాడు. ‘‘నేను నీతో ఉంటాను. నీ వీపు వెనుకనే ఉంటాను. నీతోపాటు వస్తుంటాను, కంగారుపడకు’’ అని అభయమిచ్చి అదృశ్యమైపోయాడు దేవుడు. కొంతకాలం తర్వాత నా వెనక దేవుడు వస్తున్నాడో లేదో అనే అనుమానం భక్తుడికి వచ్చింది. తన వెనక ఉన్నాడో లేడో తెలుసుకోవాలనుకుని వెనుకకి పూర్తిగా తిరిగి చూసేడు. దేవుడు అక్కడ భక్తుడికి కనిపించలేదు.
దేవుడు అబద్ధం చెప్పేడు అనే నిర్ణయానికి భక్తుడు వచ్చేడు. మళ్లీ దేవుడ్ని ప్రార్థించేడు. దేవుడు ప్రత్యక్షమయ్యాడు. స్వామీ! నువ్వు నాతో ఉంటానన్నావు. నేను వెనక్కి తిరిగి చూస్తే నువ్వు అక్కడ లేవు. అబద్ధం చెప్పటం భావ్యమా? అని దేవుడ్ని ప్రశ్నించాడు భక్తుడు.
‘‘పిచ్చివాడా! ఇదా నీ తెలివి. నీ వీపు వెనకాల ఉంటానని కదా నేను చెప్పేను. నేను ఉన్నానో లేదో చూడాలని నువ్వు వెనక్కి తిరిగేవు. నువ్వు వెనక్కి తిరిగినపుడు నీ వీపు కూడా తిరుగుతుంది. నీ వీపు తిరుగుతున్నపుడు దానితోపాటు నేను కూడా నీ వీపు వెనక్కి తిరిగేను. నీకెలా కనిపిస్తాను?’’ అసలు విషయం వివరించేడు దేవుడు.
భక్తుల వెంట జంటగా ఉంటానని ప్రతి అవతారంలో ప్రతి సందర్భంలోను భగవంతుడు పదే పదే చెబుతున్నాడు. అయినా మనకెన్నో సందేహాలు. దేవుడి గురించి అతని ఉనికి గురించి ఎనె్నన్నో అనుమానాలు.ఓ పర్యాయం ఓ క్షురకుడికి ఇలాంటి అనుమానమే వచ్చింది. అపుడతను ఓ పండితునికి క్షురకర్మ చేస్తున్నాడు. ఆ పండితుడ్ని క్షురకుడు ‘‘అయ్యా! దేవుడనేవాడు నిజంగా ఉన్నాడా?’’ అని ప్రశ్నించేడు. సందేహం తీర్చమన్నాడు. ‘‘అలాంటి సందేహం ఎందుకు వచ్చింది నీకు’’ అని అడిగాడు పండితుడు.
‘‘అయ్యా! మీకు నాకు ఈ భూమీద ఉన్న ప్రతి ఒక్కరికి ఎన్నో కష్టాలు ఉన్నాయి. దేవుడు మన కష్టాలు తీరాలి కదా! మన కష్టాలు తీరడంలేదు. అందుకనే ఈ సందేహం వచ్చిందయ్యా’’ అని చెప్పేడు క్షురకుడు.
మర్నాడు ఇద్దరూ ఆ పట్టణంలో బాగా రద్దీగా ఉండే ఒక కూడలి దగ్గరకి వెళ్లారు. అక్కడ జుత్తు ఒత్తుగా పెరిగిపోయి గెడ్డాలు మీసాలుతో ఏ మాత్రం కేశ సంస్కారం చేసుకోని చాలామంది వాళ్ళకి కనిపించేరు. అపుడు పండితుడు ‘‘ఏమయ్యా! వాళ్ళంతా కేశ సంస్కారం చేసుకోకుండా అడ్డదిడ్డంగా రెల్లు పొదలా జుత్తు పెంచుకుని పిచ్చివాళ్లలా ఉన్నారు. నువ్వు క్షురకుడివి. ఈ ఊరి వాడివి. వాళ్ళకి క్షురకర్మ చేసే బాధ్యత నీకు లేదా? నీ బాధ్యతని నువ్వు నిర్వర్తించలేవా?’’ కొంచెం కఠినంగా నిష్ఠూరంగా ప్రశ్నించేడు క్షురకుణ్ణి. ‘‘ఇందులో నా తప్పేంటయ్యా? తమ జుత్తు గడ్డం, మీసం సరిచేసుకుందామని, జుత్తు కత్తిరించుకునేందుకు ఎవరైనా నా దగ్గరకి వస్తే, నేనా పని చేయగలను. ఒకవేళ వాళ్ళు నా దగ్గకు రాలేని పరిస్థితి అయితే నన్ను రమ్మనమని కబురు చేస్తే వాళ్ల దగ్గరకి వెళ్లి క్షురకర్మ చేసి పెట్టగలను. వాళ్ళెవరూ రాలేదు. నన్ను రమ్మనమని ఎవరూ పిలవలేదు. నేను ఏం చేసేదయ్య?’’ జవాబిచ్చాడు క్షురకుడు.
‘అంతేనంటావా?’ అన్నాడు పండితుడు. ‘అవును’ అంటాడు క్షురకుడు.
‘‘్భగవంతుడు కూడా అంతేనయ్యా! మనం బాధలలో కష్టాలలో ఉన్నపుడు భగవంతుడ్ని రమ్మనమని, మన కష్టాలు తీర్చమని ఆయన్ని పిలవగలిగితే ఆ భగవంతుడు వచ్చి మన కష్టాలు తీర్చుతాడు. రమ్మనమని ఆయన్ని మనం పిలవనపుడు, పిలవలేనపుడు ఆయన ఎలా వుంటాడు? కష్టాలు ఎలా తీరుస్తాడు? ఎలా కాపాడుతాడు?’’ అర్థమయ్యేలా చెప్పి క్షురకుని సందేహాన్ని నివృత్తి చేసేడు పండితుడు.
భగవంతుడు భావప్రియుడు. మన భావాన్ని చూస్తాడు. బాహ్యాన్ని చూడడు. భక్తిని చూస్తాడు కానీ శక్తిని చూడడు. చిత్తాన్ని చూస్తాడు కానీ విత్తాన్ని చూడడు. నీతిని చూస్తాడు కానీ మన జాతిని చూడడు.

- రమాప్రసాద్ ఆదిభట్ల 9348006669