ప్రకాశం

రైతుల సంక్షేమమే టీడీపీ ధ్యేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముండ్లమూరు,్ఫబ్రవరి 23:దేశానికి వెన్నుముక రైతని అలాంటి అన్నదాన యోగక్షేమాలు చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలదేనని అందులోభాగంగా రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించి మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేయిస్తున్నట్లు రాష్ట్ర అటవీశాఖమంత్రి శిద్దా రాఘవరావు వెల్లడించారు. ముండ్లమూరులో శుక్రవారం మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కందుల కొనుగోలు కేంద్రాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈసందర్బంగా శిద్దా మాట్లాడుతూ రైతులు పండించిన పంటల అమ్మకాల సమయంలో దళారుల బారిన పడి నష్టపోతున్నారని ఆవిధంగా జరగకుండా మద్దతు ధరకల్పించి ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు.క్వింటా కందులకు ప్రభుత్వం 5450రూపాయలు మద్దతు ధర కేటాయించిందని రైతులు మార్కెఫెడ్ ద్వారా విక్రయించుకోవాలన్నారు. మండలంలో ముండ్లమూరు, మారెళ్ళ ప్రాధమిక వ్యవసాయ పరపతి సంఘాల ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసినట్లు ఆయన తెలిపారు. ఒక్కొక్క కేంద్రంలో 183టన్నులు కొనుగోలు చేస్తారన్నారు. అధికారులతో మాట్లాడి రైతులు పండించిన కందిపంటను మొత్తాన్ని కొనుగోలుచేస్తామని రైతులకు హామీ ఇచ్చారు. రైతు రథం పేరుతో సబ్సిడీతో రైతన్నలకు ట్రాక్టర్లను అందచేస్తున్నామన్నారు. వ్యవసాయాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేసిందన్నారు. ఎన్‌టీఆర్ జలసిరితో బీడుభూముల్లో కూడా నేడు పంటలు పండిస్తున్నారన్నారు. బోరు, మోటారు విద్యుత్ కనెక్షన్‌ను ప్రభుత్వమే భరించి రైతులకు అందజేస్తున్నామన్నారు. పట్టిసీమ ప్రాజెక్టునిర్మాణం పూర్తిచేసి ఎండిపోతున్న పంటలకు నీరు ఇచ్చి కాపాడి రైతన్నల ఇంటిలో చంద్రబాబు పెద్దకొడుకుగా సుస్థిర స్థానం సంపాదించారన్నారు. ఉల్లగల్లులో కందుల కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని మంత్రి దృష్టికి మండల టీడీపీ అధ్యక్షుడు సోమేపల్లి శ్రీనివాసరావు తీసుకువెళ్ళాగా అధికారులతో మాట్లాడి ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చారు. దర్శి నియోజకవర్గపరిధిలో 11కొనుగోలుకేంద్రాలను ఏర్పాటుచేశామని మంత్రి తెలిపారు. ఈకార్యక్రమంలో ఎంపిపి మందలపు వెంకట్రావు, ముండ్లమూరు,నాయుడుపాలెం,జమ్మలమడక, వేముల,ఉల్లగళ్ళు,పులిపాడుసర్పంచ్‌లు మేదరమెట్ల వెంకట్రావు,బద్రిగోపాల్‌రెడ్డి, బ్రహ్మాయ్య, జి పార్వతిచౌదరి, రామానాయక్,ముండ్లమూరు సొసైటీ అధ్యక్షులు బోడపాటి రాంమోహన్‌రావు, ఎంపిడిఒ ఎం వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.