ప్రకాశం

ప్రతిఒక్కరూ నైతిక విలువలతో కూడిన ఓటుహక్కును వినియోగించుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,మార్చి 22:్భరతదేశంలో ప్రతిఒక్కరూ నైతిక విలువులతో కూడిన ఓటుహక్కును వినియోగించుకోవాలని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఎల్ వెంకటేశ్వర్లు తెలిపారు. గురువారం స్థానిక రైజ్ ఇంజనీరింగ్ కాలేజిలో యువత ప్రజాస్వామ్యంలో ఓటును వినియోగించి నైతిక విలువల గురించి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ భారతదేశంలో ప్రతిపౌరుడు దేశాభివృద్ధికోసం పాలకులను ఎంచుకోవాలన్నారు. జాతులు, మతాలు,నగదు, మద్యం వంటి ప్రలోభాలకు లొంగకుండా నిష్పక్షపాతంగా ఓటుహక్కును వినియోగించుకోవాలన్నారు. ఓటుహక్కుపై అవగాహన లేకపోవటం వల్ల గ్రామీణ ప్రాంతాలకంటే పట్టణప్రాంతాల్లో ఓటింగ్ శాతం తగ్గుతుందన్నారు. విద్యావంతులైన పట్టణ ఓటర్లు నిర్లక్ష్యం కారణంగా ఓటుహక్కును వినియోగించుకోలేకపోతున్నారని తెలిపారు. గ్రామీణప్రాంతాల్లో రాజకీయ కక్షలు, ముఠాకక్షలు పెరిగిపోతున్నాయన్నారు. భారతదేశంలో రాజకీయాలకు, జాతులు, మతాలకు అతీతంగా ఓటుహక్కు వినియోగించుకుని మంచి పాలకులను ఎన్నుకోవాలన్నారు. ధర్మం, సత్యం, న్యాయం ఒక్కటేనని, సత్యంతో ముందుకు వెళ్లేవారు సుఖసంతోషాలతో ఉంటారన్నారు. ప్రజాస్వామ్యంలో మంచి పాలకులను ఎన్నుకున్నప్పుడే అభివృద్ధి సాధించేందుకు వీలవుతుందన్నారు. పదిమందికి ఆదర్శంగా ఉండే నాయకులను ఎన్నుకున్నప్పుడే ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు. గతంకంటే భిన్నంగా ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాల వల్ల బూత్ ఆక్రమలు, బూత్ రిగ్గింగ్ వంటివి లేవన్నారు. ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు కొత్త సంస్కరణ వల్ల ఎన్నికలు ప్రశాంతంగా సజావుగా జరుగుతున్నాయన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎన్ ప్రభాకర్‌రెడ్డి, ఒంగోలు ఆర్‌డిఒ కె శ్రీనివాసరావు, చీరాల ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎంఎస్ మురళీ, గిద్దలూరు ఎన్నికల రిటర్నింగ్ అధికారి భాస్కరనాయుడు, స్టెప్ ముఖ్య కార్యనిర్వహణాధికారి బి రవి, రైజ్ ఇంజనీరింగ్ కాలేజి కరస్పాండెంట్ శిద్దా వెంకటేశ్వరరావు, 13జిల్లాలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు.