ప్రకాశం

పెద్దారవీడు రెవెన్యూ కార్యాలయంలో అవినీతిపై కొరడా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దారవీడు, మార్చి 22: మండలంలోని రెవెన్యూ కార్యాలయంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న కొందరు అధికారులపై మార్కాపురం ఆర్డీవో పెంచలకిశోర్ గురువారం విచారణ నిర్వహించి వాస్తవాలు వెలుగు చూడటంతో తహశీల్దార్‌ను సస్పెండ్ చేయడంతోపాటు ఆర్‌ఐ, నలుగురు విఆర్‌వోలపై విచారణ చేపట్టినట్లు పాత్రికేయులకు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు గత సెప్టెంబర్ నెల నుంచి విచారణ చేపట్టినట్లు, ఈ విచారణలో ఎలాంటి ఆధారాలు లేకుండా రాజంపల్లి గ్రామానికి చెందిన ఓ కుటుంబానికి 105 ఎకరాలు రెవెన్యూ అధికారులు ఆన్‌లైన్ చేశారని, విచారణ అనంతరం 105 ఎకరాల భూములను ఆన్‌లైన్ నుంచి తొలగించామని తెలిపారు. చట్లమిట్ల, తంగిరాలపల్లి, బోయదగుంపుల గ్రామాల్లో జరిగిన అవినీతిపై విచారణ చేపట్టామని, ప్రభుత్వ భూములు కొనుగోలు, అమ్మకాలపై నిషేధం ఉన్నప్పటికీ ఒకే కుటుంబం వారికి ఆన్‌లైన్ చేశారని, దీంతో ఉన్నతాధికారులకు నివేదిక పంపగా తహశీల్దార్‌ను సస్పెండ్ చేయాల్సిందిగా ఆదేశించారని తెలిపారు. అంతేకాకుండా విచారణ జరుగుతుండగానే ఆ పొలాలపై ఆ కుటుంబ సభ్యులు వివిధ బ్యాంకుల్లో లక్షల రూపాయలు రుణాలు పొందినట్లు ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. వైడిపాడు చెరువుకు గ్రామస్తులు ఉచితంగా పొలాన్ని ఇవ్వగా, ఆ పొలాన్ని కూడా ఆన్‌లైన్ చేయించుకున్నారని తెలిపారు. తొలుత ఆన్‌లైన్ చేయించుకున్న వారికి షోకాజ్ నోటీసులు ఇచ్చామని తెలిపారు. వైడిపాడులో 20 ఎకరాలు అసైన్‌మెంటు భూమి, 20 ఎకరాల పట్ట్భామి, తంగిరాలపల్లిలో 10 ఎకరాలు అసైన్‌మెంటు, సానికవరంలో 30 ఎకరాలు అసైన్‌మెంటు, చట్లమిట్లలో కూడా అసైన్‌మెంటు భూమిని ఆన్‌లైన్ చేయించుకున్నారని తెలిపారు. అలాగే కొందరు 44 ఎకరాల 39 సెంట్ల ప్రభుత్వ భూమిని ఆన్‌లైన్ చేయించుకోగా విచారణ చేసి తొలగించామని తెలిపారు. ఇంకా ఆర్‌ఐ, విఆర్‌ఓలపై విచారణ చేస్తున్నామని, వీరిలో కొందరు సెలవుల్లో ఉండగా, కొందరు బదిలీ అయ్యాయరని తెలిపారు. విచారణ అనంతరం నివేదికను ఉన్నతాధికారులకు పంపి వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.