ప్రకాశం

ఆర్థిక నేరాల నియంత్రణ ప్రజల చేతుల్లోనే ఉంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్కాపురం, మార్చి 22: ఆర్థిక నేరాల నియంత్రణ ప్రజల చేతుల్లోనే ఉందని, వారు అవగాహన కలిగిఉంటే వీటిని నియంత్రించవచ్చునని జిల్లా ఎస్పీ సత్యయేసుబాబు అన్నారు. గురువారం రాత్రి మండలంలోని రాయవరం గ్రామంలో మేలుకొలుపు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అధిక వడ్డీలకు ఆశపడి ప్రైవేటు సంస్థల్లో పెట్టుబడులు పెట్టవద్దని, అలాగే ప్రైవేటు బ్యాంకుల్లో పొదుపు చేసుకోవడం మానుకోవాలని, స్కీమ్‌లు, చీటీల పేరిట కొందరు మోసం చేసేందుకు ప్రయత్నిస్తుంటారని, అలాంటివారికి దూరంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మేలుకొలుపు కార్యక్రమాన్ని మార్కాపురం డివైఎస్పీ ఎన్‌వి రామాంజనేయులు రూపకల్పన చేశారని, దీనిపై ప్రజలకు అవగాహన కల్పిస్తే కొంతమేర నేరాలను నియంత్రించవచ్చునని అన్నారు. అలాగే వరకట్నంపై మాట్లాడుతూ వివాహ సమయంలో కూతురి సంసారం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకు కొంత పైకం ఇస్తారని, అయితే కొందరు వివాహం అనంతరం అధిక కట్నం తేవాలంటూ వేధింపులకు గురిచేస్తుంటారని, ఇలాంటి సంఘటనలు ఎక్కడైనా ఉంటే తక్షణమే న్యాయం కోసం పోలీసులను ఆశ్రయిస్తే న్యాయం జరుగుతుందని తెలిపారు. అలాగే ప్రైవేటు వాహనాల్లో పరిమితికి మించి ప్రయాణిస్తే ప్రమాదాలు జరిగి పలువురు ప్రాణాలు పోగొట్టుకోవడమే కాకుండా కొందరు శాశ్వత వికలాంగులు అవుతున్నారని, దీనివలన ఆ కుటుంబాలు వీధిన పడుతున్నాయని, ఇలాంటి వాటిపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. అలాగే ఇటీవల కాలంలో బ్యాంకర్లమంటూ అకౌంట్ నెంబర్, ఎటిఎం నెంబర్, సెల్‌కు వచ్చిన ఓటిపి అడిగి తెలుసుకొని ఆన్‌లైన్ ద్వారా డబ్బులు డ్రాచేసుకొనే అవకాశం ఉందని, ఇలాంటి మోసాలను గుర్తించి ఎవరూ ఎటిఎం కార్డుల నెంబర్లను, పాసుపుస్తకాల నెంబర్లను బ్యాంకర్లమని చెబితే ఇవ్వవద్దని తెలిపారు. మార్కాపురం డివైఎస్పీ రామాంజనేయులు మాట్లాడుతూ మార్కాపురం డివిజన్ వెనుకబడిన ప్రాంతమని, నిరక్షరాస్యత కారణంగా చట్టాలపై అవగాహన లేక అనేక విధాలా నష్టపోతున్నారని, వీరిని ఆదుకోవాలనే మేలుకొలుపు కార్యక్రమం రూపొందించడం జరిగిందని అన్నారు. ఈకార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా మార్కాపురం డివిజన్‌లోని రాయవరం గ్రామంలో ప్రారంభించేందుకు వచ్చిన జిల్లాఎస్పీ బి సత్యయేసుబాబుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రమంలో ఎఎంసి వైస్‌చైర్మన్ కాకర్ల శ్రీను, సర్పంచ్ రాజేశ్వరి, సిఐ భీమానాయక్, ఎస్సైలు జి కోటయ్య, మల్లిఖార్జున్, రామానాయక్, ముక్కంటి తదితరులు పాల్గొన్నారు.