ప్రకాశం

ప్రత్యేకహోదా డిమాండ్ చేస్తూ జాతీయ రహదారి దిగ్బంధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,మార్చి 21:రాష్ట్రానికి ప్రత్యేక హోదా,విభజన హామీల అమలు తదితర డిమాండ్లతో ప్రత్యేక హోదా సాధన సమితి పిలుపుమేరకు గురువారం జిల్లాలోని జాతీయ రహదారులను దిగ్బంధనం చేశారు. ఉదయం 11గంటల నుండి 12గంటల వరకు జాతీయ రహదారులను దిగ్బంధించటంతో వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. దీంతో వాహనదారులతోపాటు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రధానంగా జిల్లాకేంద్రమైన ఒంగోలులోని సౌత్‌బైపాస్ దగ్గర జాతీయ రహదారిపై వైసీపీ,సీపీఐ, సీపీఎం, జనసేన పార్టీలకు చెందిన నాయకులు,కార్యకర్తలు,ప్రజాసంఘాల నాయకులు బైటాయించటంతో వాహనాలు నిలిచిపోయాయి. జాతీయ రహదారి దిగ్బంధనం కార్యక్రమాన్ని విరమించాలని పోలీసు అధికారులు ఆందోళన కారులను విజ్ఞప్తిచేశారు. కాగా ఆందోళనకారులు దిగ్బంధనం కార్యక్రమాన్ని యథావిధిగా కొనసాగించటంతో పోలీసులు రంగప్రవేశం చేసి వారిని పక్కకు నెట్టివేశారు. ఈసందర్భంగా ఆందోళనకారులకు, పోలీసుల మధ్య కొద్దిసేపు పెనుగులాట జరిగింది. పోలీసులకు అడ్డంతిరిగిన పలువురు వైసీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. అంతకుమినహా ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు.అదేవిధంగా జిల్లాలోని మార్టూరు, సింగరాయకొండ, మార్కాపురం, అద్దంకి, గిద్దలూరు, యర్రగొండపాలెంల్లోని రహదారులను ప్రతిపక్షనాయకులు దిగ్బంధం చేసి రాష్ట్రానికి ప్రత్యేకహోదా కావాలంటూ నినాదాల హోరెత్తించారు. ఇదిలాఉండగా జాతీయరహదారిపై వందలాది వాహనాలు నిలిచిపోవటంతో లారీల డ్రైవర్లు పక్కనే వంటవార్పు చేసుకున్నారు. అదేవిధంగా జాతీయ రహదారిపై ఆందోళనకారులు కబాడ్డీ ఆడుతూ కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను వ్యతిరేకిస్తూ, ప్రత్యేకహోదా ఆంధ్రుల హక్కు, చెట్టుమీద కొంగ మోదీ దొంగ అంటూ నినాదాల హోరెత్తించారు. విభజన చట్టంలోని పొందుపర్చిన అంశాలను వెంటనే నెరవేర్చాలని ప్రతిపక్షనేతలు డిమాండ్ చేశారు. ఎపీకి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ లోక్‌సభలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై వెంటనే చర్చ చేపట్టాలని కోరారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా వస్తే వెనుకబడిన జిల్లా అన్నివిధాల అభివృద్ధి చెందుతుందన్నారు. జిల్లాకు వనరులు పుష్కలంగా వస్తాయన్నారు. ఇదిలాఉండగా తెలుగుదేశంపార్టీ విడిగా త్రోవగుంట వద్ద ఉన్న జాతీయరహదారిపై ఆందోళన కార్యక్రమం చేపట్టింది. మొత్తంమీద జాతీయ రహదారుల దిగ్బంధనం కార్యక్రమంలో ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లాపోలీసు యంత్రాంగం భారీగా పోలీసులను మోహరించింది. ఆయా కార్యక్రమాల్లో వైసీపీ జిల్లా, నగర నాయకులు వేమూరి సూర్యనారాయణ,శింగరాజు వెంకట్రావు, నత్తల భీమేష్, గంగాడ సుజాత, బడుగు ఇందిర, జజ్జర ఆనందరావు, మారెడ్డిసుబ్బారెడ్డి, సిపిఐ జిల్లాకార్యదర్శి ఎంఎల్ నారాయణ, నాయకులు యుప్రకాశరావు, ఎం వెంకయ్య, పివిఆర్ చౌదరి, ఆర్ వెంకట్రావు, బి చంద్రశేఖర్, కరవది సుబ్బారావు, సీపీఎం తరుపున జివి కొండారెడ్డి, జాలా అంజయ్య, షేక్ మాబు, కాలం సుబ్బారావు,జి రమేష్, మారెళ్ళ సుబ్బారావు, సీపీఐ ఎంఎల్ తరుపున కొంగర నరసింహం, తెలుగుదేశంపార్టీ తరుపున జిల్లాపార్టీ ప్రధానకార్యదర్శి కొమ్మూరి రవిచంద్ర, నాయకులు బొమ్మినేని మురళీ, కొఠారి నాగేశ్వరరావు, దాయినేని ధర్మా , జాన్ సైదా, నండూరి చంద్ర తదితరులు పాల్గొన్నారు.