ప్రకాశం

పౌరహక్కుల పరిరక్షణకు న్యాయస్థానాలు అండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యద్దనపూడి, మార్చి 23: పౌరహక్కుల పరిరక్షణకు న్యాయస్థానాలు అండగా ఉంటాయని పర్చూరు కోర్టు జూనియర్ సివిల్ జడ్జ్ మహమద్ నజీర్ ఉల్ ఇన్ అన్నారు. యద్దనపూడిలోని స్ర్తిశక్తి భవన్‌లో జరిగిన న్యాయవిజ్ఞాన సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోర్టుకు వచ్చిన ఏ కేసు అయినా రాజ్యాంగం ప్రకారం న్యాయవిచారణ జరుగుతుందని, సంఘటన పూర్వపరాలు విచారించి తీర్పు చెబుతారని అన్నారు. సమాజం క్రమ పద్ధతిలో నడవడానికి చట్టం తోడ్పడుతుందని అంటూ, పలురకాల చట్టాల గురించి, చట్టం, న్యాయం, ధర్మం గురించి వివరించారు. అడుగడుగునా పౌరులను చట్టం కాపాడు తుందన్నారు. ఒక అర్జీ ఇస్తే ఎలాంటి ఖర్చు లేకుండా పరస్పర అంగీకారంతో లోక్‌ఆదాలత్ ద్వారా సత్వరం న్యాయం జరిగే అవకాశం ఉందన్నారు. గొడవను పెంచుకోవడం అంటే ఇంటికి వచ్చిన పామును పెంచడమని, ఆవేశంతో తీసుకున్న నిర్ణయాలు అనర్థాలు కలిగిస్తాయని చెప్పారు. పౌరుల హక్కులను పరిరక్షించడంతో న్యాయస్థానాలు ఎప్పుడూ అండగా ఉంటాయన్నారు. అనంతరం గురుకుల పాఠశాలలో జరిగిన విద్యార్థుల అవగాహన సదస్సులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో లోక్‌ఆదాలద్ సభ్యుడు అయూబ్, తహశీల్ధార్ మరియమ్మ, ఎండీఓ జాకీర్ హుసేన్, ఎంఈఓ పుల్లెల సుబ్రహ్మణ్యేశ్వర్‌రావు, ఎస్సై నాగేశ్వరరావు, ప్రిన్సిపాల్ దుర్గా గాయత్రి, జీవరత్నం తదితరులు పాల్గొన్నారు.

వైద్యశాఖలో జీఓ నెం 27ను సవరించాలని ధర్నా
ఒంగోలు, మార్చి 23: వైద్యశాఖకు సంబంధించిన జీఓ 27ను సవరించాలని కోరుతూ కలెక్టరేట్ వద్ద శుక్రవారం ధర్నా జరిగింది. రిమ్స్ ఉద్యోగులు, మేల్ ఆరోగ్య కార్యకర్తలు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులు హెల్త్ అండ్ మెడికల్ జేఏసీ (సిఐటియు) ఆధ్వర్యంలో రాష్టవ్య్రాప్త పిలుపు మేరకు ఈ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా కార్యదర్శి కేఏ రాజు మాట్లాడుతూ ఈ జీఓతో 26వేల కుటుంబాలు బజారున పడుతున్నాయని తెలిపారు. ఇప్పటి వరకు అన్ని పీఆర్సీలలో కాంట్రాక్ట్ విధానంలో పనిచేసే బేసిక్ పే, డీఏ, హెచ్‌ఆర్‌ఏలు వచ్చే ఉద్యోగులను సైతం కన్సాలిడేషన్ వేతనంలోకి చేర్చారని, ఎన్నో సంవత్సరాలుగా రెగ్యులర్ అవుతామని ఎదురు చూస్తున్న వీరికి ఈ జీఓ ఆశనిపాతమని అన్నారు. వెంటనే ఈ జిఓ 27ని సవరించి 10వ పీఆర్‌సీ ఏరియర్స్, అన్ని అలవెన్సులతో జీతం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. యూనియన్ జిల్లా అధ్యక్షుడు కే.శ్రీ్ధర్‌బాబు మాట్లాడుతూ జీఓ 27ను అమలుచేస్తే వైద్య, ఆరోగ్యశాఖను ప్రవేటీకరించినట్లేనని, ఇప్పటికే పనిభారం పెరిగి, ఉద్యోగ భద్రత లేకుండాపోయిన ఉద్యోగులకు మరిన్ని ఇబ్బందులు తప్పవని అన్నారు. వెంటనే సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి సమాన పనికి సమాన వేతనం చట్టం అమలుచేసి ఒకే క్యాడర్, ఒకే జీతం ఇవ్వాలని కోరారు. ఈ ధర్నా కార్యక్రమంలో జిల్లా సీఐటీయు అధ్యక్షుడు సీహెచ్ మజుందార్, సభ్యుడు వెంకటేష్, స్ట్ఫా నర్స్ సంఘం నాయకురాలు స్మితా మోల్, ఎన్‌హెచ్‌యం నాయకుడు గంగాధర్, 2వ ఏఎన్‌ఎం నాయకులు, సభ్యులు, ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు.