ప్రకాశం

ప్రత్యేక హోదా కోసం అలుపులేని పోరాటం: ఎమ్మెల్యే ఏలూరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్టూరు, మార్చి 23: రాష్ట్రానికి ప్రత్యేకహోదా కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అలుపెరగని పోరాటం చేస్తున్నారని పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్నారు. శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో పర్చూరు నియోజకవర్గ పార్టీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రత్యేకహోదా ఆంధ్రుల హక్కు అని, ఆంధ్రుల ఆత్మాభిమానం కోసం తెలుగుదేశం పుట్టిందని అన్నారు. రాష్ట్రం అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు కష్టపడి పనిచేస్తుంటే, ఒకపక్క పాదయాత్రలు, మరోపక్క కోర్టుల చుట్టూ తిరిగే ప్రతిపక్ష నాయకుడు ముఖ్యమంత్రిని విమర్శించడం సహించరానిదన్నారు. 14 కేసుల్లో ఏ-2 ముద్దాయి అయిన రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును విమర్శించడం దెయ్యాలు వేదాలు వల్లించటమేనని విమర్శించారు. బీజేపీ, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీలు లాలూచీ పడి రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని, కేసుల మాఫీకోసం ప్రధానమంత్రి చుట్టూ తిరుగుతూ వైకాపా అధినేత ఆంధ్రుల ఆత్మాభిమానాన్ని తాకట్టు పెడుతున్నారని ధ్వజమెత్తారు. సమస్యల పరిష్కారం కోసం ప్రజలు అసెంబ్లీకి పంపిస్తే బాధ్యత లేకుండా, అసెంబ్లీకి హాజరుకాకుండా జగన్ ప్రజలను అవమానించడం సిగ్గు చేటన్నారు. టీడీపీ ప్రవేశపెట్టిన సంక్షేమ ఫలాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు అందేలా ప్రతి కార్యకర్త ఒక సైనికుడుగా పనిచేసి టీడీపీని బలోపేతం చేయాలని, రాబోయే ఎన్నికల్లో పార్టీ మళ్లీ అధికారంలోకి తీసుకురావడానికి సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆరు మండలాల టీడీపీ మండలాధ్యక్షులు తొండెపు ఆదినారాయణ, రంగయ్యచౌదరి, జమాలుద్ధీన్, వీరయ్య, శ్రీహరి, మార్టూరు ఎంపీపీ తాళ్లూరి మరియమ్మ, జడ్పీటీసీ శివరాత్రి ఈశ్వరమ్మ, అబ్దుల్ రజాక్, ఫరూక్, దయానాయక్, అక్కయ్యచౌదరి, ఎంపీటీసీలు పాల్గొన్నారు.