ప్రకాశం

27న జిల్లాకు రానున్న సాగర్ నీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,మార్చి 23: జిల్లాకు ఈనెల 27వ తేదీన రానున్న నాగార్జునసాగర్ జలాలతో అన్ని నోటిఫైడ్, నాన్ నోటిఫైడ్ చెరువులను పక్కాగా నింపుకోవాలని కలెక్టర్ వినయ్‌చంద్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాత్రి తన క్యాంపు కార్యాలయంలో నాగార్జునసాగర్ జలాల వినియోగంపై ఆర్డీఓ ప్రభాకర్‌రెడ్డితోకలిసి జలవనరులు, రెవిన్యూ, గ్రామీణ నీటిసరఫరా, పురపాలక శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో తాగునీటి ఎద్దడి నివారణకు 2.5టీఎంసీల నీరు ఇవ్వాలని కోరామన్నారు. 18/0 మైలురాయి వద్ద కనీసం వెయ్యి క్యూసెక్కులు, 85/3 మైలురాయి వద్ధ 2200 క్యూసెక్కుల నీరు వచ్చేందుకు కృషిచేస్తామన్నారు. సాగర్ జలాలు ఈనెల 25వతేదీన విడుదలవుతాయని, అవి ఈనెల 27వతేదీన జిల్లాకు చేరుకుంటాయని చెప్పారు. ఈసారి తప్పనిసరిగా కాల్వ చివరి నుండి మొదలుపెట్టి అన్ని నోటిఫైడ్, నాన్ నోటిఫైడ్ చెరువులను నింపుకుంటూ రావాలని ఆదేశించారు. దీనికోసం ప్రత్యేకాధికారిని నియమించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కడా నీటిచౌర్యం జరగకుండా గట్టి నిఘా ఉంచాలన్నారు. ఈసారి ఈతముక్కల గ్రామానికి తప్పక నీరు అందేలా చూడాలన్నారు. ఈ సమావేశంలో ఒంగోలు, మార్కాపురం ఆర్డీఓలు శ్రీనివాసరావు, పెంచల కిశోర్, జలవనరుల శాఖ ఎస్‌ఈ రవి, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఈ సంజీవరెడ్డి, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
‘ప్రకాశం’నువెనుకబడిన జిల్లాగా ప్రకటించాలి
అద్దంకి, మార్చి 23: ప్రకాశం జిల్లాను వెనుకబడిన జిల్లాగా ప్రకటించాలని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ కోరారు. గురువారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యే గొట్టిపాటి జిల్లా సమస్యలను సభకు వివరించారు. రాష్ట్రంలో గుంటూరు, కృష్ణా జిల్లాలు అభివృద్ధిలో ముందుకు పోతున్నాయని, ప్రకాశం జిల్లా మాత్రం వెనుకబడి ఉందన్నారు. జిల్లాకు శాశ్వత ప్రాతిపదికన ఉపాధి కల్పించే మార్గం సుగమం చేయాలని కోరారు. రాష్ట్రంలో 1.09కోట్ల తెల్లరేషన్‌కార్డులు ఉన్నాయని ప్రభుత్వం చెబుతున్నదని, జిల్లావారీగా డేటా లేకపోవడంతో ప్రభుత్వ పథకాలు చంద్రన్న బీమా, ఎన్టీఆర్ భరోసా తదితర పథకాలు అమలుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి నెలకు కనీసం 10వేల రూపాయల ఆదాయం సమకూరేలా కృషి చేస్తున్నామని అంటున్నారని, సీఎం ఆశయాన్ని అమలుపరచాలంటే తెల్లరేషన్ కార్డుల జిల్లావారీ డేటా ఇవ్వాలని, పథకాలు సక్రమంగా అమలు చేయాలని కోరారు. ప్రకాశం జిల్లాను వెనుకబడిన జిల్లాగా ప్రకటించాలని సమావేశంలో కోరారు.