ప్రకాశం

యువత పట్టుదలతో లక్ష్యాన్ని సాధించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, మార్చి 23: యువత పట్టుదలతో కృషిచేస్తే అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చునని జిల్లా కలెక్టర్ వి వినయ్‌చంద్ ఉద్బోధించారు. శుక్రవారం స్థానిక ఎన్టీఆర్ కళాక్షేత్రంలో జిల్లా యువజన సేవల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన జాతీయ సమైక్యత శిబిరం ముగింపు కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా విచ్చేసారు. రాష్ట్రంలోని 13జిల్లాల నుండి వచ్చిన డిగ్రీ చదువుతున్న యువతీ, యువకులనుద్దేశించి మాట్లాడారు. యువతలో భౌతికంగా, శారీరకంగా శక్తి సామర్ధ్యాలు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలే కాని కాలం వృథా చేయరాదన్నారు. స్వాతంత్య్ర సమరయోధులు భగత్‌సింగ్ వర్ధంతి సందర్భంగా ఆయన దేశం కోసం చేసిన ప్రాణ త్యాగాన్ని అందరం స్మరించుకోవాలన్నారు. ఐదు రోజుల జాతీయ సమగ్రత శిబిరంలో వివిధ రకాల వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుందని, ఒకరి నుండి మరొకరు మంచి విషయాలు, అలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలు తెలుసుకోవచ్చునని తెలిపారు. ఆవిధంగా తెలుసుకున్న విషయాలతో ఆలోచించి జీవితాశయాన్ని నిర్ణయించుకుని ప్రణాళికాబద్ధంగా చేరుకునే ప్రయత్నం చేయాలన్నారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు చుట్టూ ఉన్న ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూనే అక్కడి ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని గమనించాలన్నారు. ఇకనైనా ఇలాంటి శిబిరాలతోపాటు ఎన్‌సిసి శిబిరాలు, స్టడీ టూర్లలో కూడా తప్పక భాగస్వాములు కావాలన్నారు. చెడుదారి పట్టకుండా ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉజ్వల భవిష్యత్తు కోసం శ్రమించాలన్నారు. వార్తాపత్రికలను చదివే అలవాటు చేసుకోవాలని, ఆంగ్లంలో మాట్లాడటం నేర్చుకోవాలని, నైపుణ్యాలను పెంపొందించుకుని బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలన్నారు. ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందుబాటులో ఉంచుకోవాలన్నారు. క్రీడలు, కళలు, విద్య, వివిధ రకాల వృత్తులు కాని, ఏదైనా ఒక రంగం ఎంచుకుని ప్రత్యేక శ్రద్ధ చూపితే తప్పకుండా ఆ రంగంలో ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చునని తెలిపారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ భగత్‌సింగ్, స్వామి వివేకానంద చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం అనంతపురం, నెల్లూరు, కర్నూలు, చిత్తూరు జిల్లాలతోపాటు ఒంగోలు విద్యార్థినీ, విద్యార్థులు గీతాంజలి, వేదవతి, జమీల్, శివకుమార్, రాంబాబు తమ ఐదురోజుల అనుభవాలను, నేర్చుకున్న అంశాలను జిల్లా కలెక్టర్‌కు వివరించారు. అనంతరం కబడ్డీ, వాలీబాల్ పోటీల్లో విజేతలకు జిల్లా కలెక్టర్ బహుమతులు, ప్రశంసా పత్రాలు అందచేశారు. ఈకార్యక్రమంలో స్టెప్ సిఇఒ బి రవి, ఎపిఐసిసి జోనల్ మేనేజర్ నరసింహారావు, పతాంజలి ప్రతినిధులు శ్రీరామచంద్రమూర్తి తదితరులు పాల్గొన్నారు.