క్రైమ్/లీగల్

సినిమా చూపిస్తానంటూ మోసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చీరాల, ఏప్రిల్ 22: సినిమా చూపిస్తానంటూ ఓ మోసగాడు పసిపిల్లలకు పట్టపగలే అరచేతిలో వైకుంఠం చూపించాడు. చిన్నారులకు మాయమాటలు చెప్పి మండుటెండలో వదిలేసి ఎటో చెక్కేశాడు. దీంతో ఆదివారం సరదాగా గడుపుదామనుకున్న చిన్నారులకు ఎదురుచూపులే మిగిలాయి. బాధిత చిన్నారులు తెలిపిన వివరాల మేరకు కారంచేడుకు చెందిన పవన్ సినిమాలకు మైకులో ప్రచారం చేస్తూ ఉంటాడు. కారంచేడుతో పాటు చీరాల్లోని పలు ప్రాంతాలకు చెందిన సుమారు 120మంది చిన్నారులకు సినిమాలు చూపిస్తానంటూ పట్టణంలోని మూడు థియేటర్లకు సంబంధించిన టిక్కెట్లను విక్రయించి సొమ్ము చేసుకున్నాడు. కారంచేడు ప్రాంతం నుంచి సుమారు 42మందికి, చీరాల నుంచి 30మందికి, జాండ్రపేట నుంచి ఆరుగురికి, వారితో పాటు మరికొంత మందికి టికెట్లు ఇచ్చి రూ.30 నుంచి రూ.50 వరకు వసూలు చేశాడు. నమ్మకంగా వారందరినీ చీరాలకు పిలిపించి చివరకు సినిమా చూపించకుండా అతను ఉడాయించాడు. అసహనానికి గురైన పిల్లలు స్థానిక ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు సైతం సిద్ధమయ్యారు. అయితే దీనిపై డీఎస్పీ ప్రేమ్‌కాజల్‌ను సంప్రదించగా ఆ విషయం తన దృష్టికి రాలేదన్నారు. అయితే ఒకటో పట్టణ సీఐ సూర్యనారాయణ స్పందిస్తూ పిల్లల తల్లిదండ్రుల నుంచి స్ఫష్టమైన వివరాలు సేకరించి చీటింగ్ కేసు నమోదు చేస్తామన్నారు.