ప్రకాశం

ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు జిల్లా ప్రజలకు అందేవరకు నిరంతరం కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,ఏప్రిల్ 30: ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు జిల్లా ప్రజలకు అందేవరకు నిరంతరం కృషిచేస్తానని జిల్లాకలెక్టర్ సుజాతశర్మ వెల్లడించారు. జిల్లాకలెక్టర్‌గా పదవీబాధ్యతలు స్వీకరించి ఒకసంవత్సరం విజయవంతంగా పూర్తిచేసుకున్న శుభసందర్భంగా శనివారం తనక్యాంపు కార్యాలయంలో పలువురు జిల్లాఅధికారులు కలిసి పుష్పగుచ్ఛాలు అందచేసి అభినందించారు. అనంతరం కలెక్టర్ కేక్‌ను కట్‌చేసి విలేఖర్లతో మాట్లాడారు. ప్రజలకు సంతృప్తి కలిగేవిధంగా పనిచేయటమే తన ప్రధాన కర్తవ్యమన్నారు.రాష్ట్రప్రభుత్వం ప్రజల మేలుకోసం అనేక సంక్షేమ, అభివృద్ధిపథకాలు అమలుచేస్తుందని వాటిన్నంటిని అర్హులైన ప్రజలందరు సద్వినియోగం చేసుకుని అభివృద్ధిపథంలో పయనించేందుకు తనవంతు కృషి ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. ఆ దిశలో జిల్లా అధికార యంత్రాంగాన్ని అన్నివిధాల ముందుకు నడిపిస్తామన్నారు. ప్రభుత్వ పథకాల అమలులో జిల్లాను అగ్రస్థానంలో నిలిపేందుకు సహకరిస్తున్న రాష్టమ్రంత్రులు, ప్రజాప్రతినిధులు,జిల్లా అధికారులు, మీడియాప్రతినిధులందరికి ఈసందర్భంగా కలెక్టర్ ధన్యవాదాలు తెలిపారు.ప్రజల ఫిర్యాదులు, విజ్ఞప్తులను వెంటనే పరిష్కరిస్తామన్నారు.జిల్లాలోప్రధానమైన నీటి సమస్యను అందరి సహకారంతో టీం వర్క్‌తో అధికమించటం జరిగిందన్నారు. జిల్లాలో రైతాంగం, ప్రజలు అధికసంఖ్యలో సేద్యపునీటికుంటలు, ఇంకుడుగుంతలు, నీటి నిల్వ నిర్మాణాలు ఏర్పాటుచేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి వర్షపునీటి బొట్టును వృథాకాకుండా సంరక్షించుకోకగలినప్పుడే భూగర్భజలాలు పెరుగుతున్నాయన్నారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో జిల్లా అదనపు సంయుక్త కలెక్టర్ ఐ ప్రకాష్‌కుమార్, జిల్లారెవిన్యూ అధికారి నూర్‌భాషా ఖాసీం, జిల్లాపరిషత్ సిఇఒ బాపిరెడ్డి,డ్వామాపిడి పోలప్ప, ఒంగోలు ఆర్‌డిఒ శ్రీనివాసరావు, ఎస్‌సి కార్పొరేషన్ ఇడి రవి, సమాచార పౌరసంబంధాల శాఖ సహాయసంచాలకులు ఎం వెంకటేశ్వరప్రసాదు, కలెక్టర్ క్యాంపు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.