ప్రకాశం

‘ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చీరాల టౌన్, మే 17: ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాల్లోనే చేర్పించాలని ఉపాధ్యాయులు తెలిపారు. పేరాల శృంగారపేటలో గురువారం ఉపాధ్యాయులు ప్రచార కార్యక్రమం నిర్వహించారు. కొత్తపేటలోని ఐఎల్‌టిడి కాలనీలో మోడల్ హైస్కూల్ ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు ఉపాధ్యాయులు ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత విద్యతో పాటు మధ్యాహ్న భోజనం, పాఠ్యపుస్తకాలు, డిజిటల్ తరగతి గదులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఈమని వెంకటేశ్వర్లు, గవిని నాగేశ్వరరావు, బుర్ల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
‘ప్రతి ఒక్కరు ఆరోగ్య సూత్రాలు పాటించాలి’
మర్రిపూడి, మే 17 : ప్రతి ఒక్కరూ ఆరోగ్య సూత్రాలు పాటించి జాగ్రత్తలు వహించి దోమల నుంచి కాపాడుకోవాలంటూ వైద్య ఆరోగ్య శాఖ గురువారం ర్యాలీ నిర్వహించింది. ఈ సందర్భంగా దోమల నుంచి వచ్చే వ్యాధులకు దూరంగా ఉండాలంటే దోమల ఉద్ధృతిని తగ్గించాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని వైద్య ఆరోగ్య శాఖ ర్యాలీ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించింది. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్య శాఖ సూపర్‌వైజర్ శైలజ మాట్లాడుతూ మలేరియా దోమలు రాత్రి సమయాల్లోనే కుడతాయని, డెంగ్యూ దోమలు పగటి సమయాల్లో కుడతాయని, పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారానే దోమలను పారద్రోలవచ్చని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎఎన్‌ఎంలు రాణి, నర్సమ్మ, పలువురు మహిళలు పాల్గొన్నారు.

ప్రారంభమైన డైట్ సెట్ పరీక్షలు
యద్దనపూడి, మే 17 : డిస్ట్రిక్ట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (డైట్ సెట్) పరీక్షలు గురువారం ప్రారంభమైనట్లు సెయింట్ ఆన్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజి కళాశాల కరస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు తెలిపారు. స్థానిక సెయింట్ ఆన్స్ కళాశాలలో ప్రారంభమైన పరీక్షలకు మొదటి రోజు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 1000 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా 199 మంది గైర్హాజరు కావడంతో 801 మంది అభ్యర్థులు పరీక్ష రాసినట్లు లక్ష్మణరావు వెల్లడించారు. పరీక్షకు పరిశీలకులుగా వేటపాలెం, చినగంజాం మండల విద్యాశాఖ అధికారులు ఏకాంబరేశ్వరరావు, కె వెంకటేశ్వరరావు వ్యవహరించారు.

సత్తాచాటిన ప్రకాశంజిల్లా కోడెలు
గిద్దలూరు, మే 17: మండలంలోని కెఎస్‌పల్లి సమీపంలోని భీమలింగేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో వెలసిన నెమిలిగుండ్ల రంగనాయకస్వామి 8వ వార్షికోత్సవం సందర్భంగా రాష్టస్థ్రాయిలో నిర్వహించిన ఎడ్లు బండలాగుపోటీల్లో ప్రకాశంజిల్లా పొట్లపాడు గ్రామంకు చెందిన బయ్యపురెడ్డి ఎడ్లజత 4500 అడుగులులాగి ప్రథమ బహుమతి రూ.25వేలను కైవసం చేసుకోగా వైఎస్‌ఆర్ జిల్లా దాసరిపల్లికి చెందిన నరేష్ ఎడ్లజత 3857 అడుగులులాగి ద్వితీయ బహుమతి 15వేలు, వైఎస్‌ఆర్ జిల్లా కొత్తపల్లి గ్రామంకు చెందిన ఎం సుబ్బారెడ్డి ఎడ్లజత 3705 అడుగులులాగి తృతీయ బహుమతి 10వేలు, హజనాపురం గ్రామానికి చెందిన ఐవి సుబ్బారెడ్డి ఎడ్లజత 3693 అడుగులు లాగి చతుర్థ బహుమతి, గుండమ్మచెన్నారెడ్డి ఎడ్లజత 3635 అడుగులు లాగి పంచమ బహుమతి, కాటంవారిపల్లి గ్రామానికి చెందిన పెద్దిరెడ్డి ఎడ్లజత 3370 అడుగులు లాగి ఆరవ బహుమతి సాధించాయి. నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జి ఐవిరెడ్డి నగదు బహుమతులను ప్రకటించగా బహుమతులను ఆయన తండ్రి ఇల్లూరి పెద్దపుల్లారెడ్డి చేతుల మీదుగా విజేతలకు అందచేశారు.