ప్రకాశం

కందుకూరు రాజకీయాల్లో నాలుగు స్తంభాలాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కందుకూరు, మే 2: కందుకూరు రాజకీయాలలో నాలుగు స్తంభాలాట మొదలైంది. ఎన్నికలు సమీపిస్తుండడంతో రాజకీయాలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. దీంతో నేతలు ఆధిపత్యం కోసం పాకులాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎవరి వ్యూహం వారిది. ఎవరి ఆలోచన వారిది. ఎవరు ఎంచుకున్న దారి వారిది. ఈ ఎత్తుగడలన్నీ 2019 ఎన్నికల్లో టిక్కెట్ సాధించుకునేందుకు, గెలుపును సొంతం చేసుకునేందుకు ఇప్పటినుంచే ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. కందుకూరు రాజకీయమంతా ఎమ్మెల్యే పోతుల రామారావు, మాజీ మంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డి, అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే దివి శివరాం, వైకాపా నియోజకవర్గ ఇన్‌చార్జి తూమాటి మాధవరావు మధ్య నాలుగు స్తంభాలాట నెలకొంది.
నియోజకవర్గంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు
నియోజకవర్గంలో ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు ఈవిధంగా ఉన్నాయి. రాష్ట్ర విభజన అనంతరం నవ్యాంధ్రలో జరిగిన తొలి ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ విజయబావుటా ఎగురవేసినా కందుకూరు నియోజకవర్గంలో మాత్రం వైకాపా పాగా వేసింది. వైకాపా అభ్యర్థి పోతుల రామారావు టీడీపీ అభ్యర్థి దివి శివరాంపై గెలుపొందారు. ఈక్రమంలో రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడడంతో కందుకూరు నియోజకవర్గ ఇన్‌చార్జిగా రెండేళ్లపాటు శివరాం హవా కొనసాగించారు. అధికార పార్టీలో శివరాం తనకెదురు లేకుండా నియోజకవర్గంలో రాజకీయాలను ముందుకు నడిపించారు. పార్టీ కార్యక్రమాలను చురుగ్గా ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఆ రెండేళ్ల కాలంలో ఎమ్మెల్యేగా గెలుపొందిన రామారావు కేవలం ఆర్‌అండ్‌బి బంగ్లాకు మాత్రమే పరిమితం అయ్యారనే విమర్శలు కూడా సొంతం చేసుకున్నారు. గెలిచిన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలన్న తలంపుతో ఎమ్మెల్యే రామారావు వైకాపాకు గుడ్‌బై చెప్పి టీడీపీలో చేరారు. అప్పటికే టీడీపీలో శివరాంకు దూరంగా ఉంటున్న ఒకవర్గం ఎమ్మెల్యేకు మద్దతు పలికింది.