ప్రకాశం

అభివృద్ధ్దికి చిహ్నం తెలుగుదేశంపార్టీ : ఎమ్మెల్యే జనార్దన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సింగరాయకొండ, మే 25: రాష్ట్రంలో గతంలో ఎన్నడు లేని విధంగా అభివృద్ధి చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుందని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్థన్ సూచించారు. శుక్రవారం మండల పరిధిలోని బింగినిపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన దింవగత మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు, మాజీ రాష్టప్రతి అబ్దుల్‌కలామ్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. ముందుగా దామచర్ల ఆంజనేయులు, అబ్థుల్‌కలామ్ విగ్రహాలను ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో జనార్థన్ మాట్లాడుతూ కొండపి నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధికి చిహ్నం దామచర్ల ఆంజనేయులు అని గుర్తు చేశారు. వారు చేసిన అభివృద్ధికి గుర్తుగా వారి విగ్రహాలను ఏర్పాటు చేయడం ఎంతో ఆనందదాయకమన్నారు. వీరి విగ్రహాలతోపాటుగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ కర్త ఎన్‌టిఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బిసిలకు చెందిన పేద వర్గాలు వారికి వివాహం సమయంలో చంద్రన్న పెళ్లికానుకగా ఆర్థిక సహాయం అందిస్తున్న ఘనత చంద్రబాబునాయుడుకే దక్కుతుందన్నారు. అత్యాధునిక టెక్నాలజితో అవినీతి రహిత సమాజం కోసం నిరంతరం కృషి చేస్తున్నారని ఆయన తెలిపారు. కొండపి నియోజకవర్గంలో ఎమ్మెల్యే వంటి పదవుల్లో 10 సంవత్సరాలు అహర్నిశలు నియోజకవర్గ అభివృద్దికి పాటుపడిన వ్యక్తి దామచర్ల ఆంజనేయులు అని ఆయన గుర్తు చేసారు. గడిచిన నాలుగు సంవత్సరాల పాలనలో రూ.1400 కోట్ల రూపాయలతో ఒంగోలు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన ఘనత తనకే దక్కుతుందన్నారు. తన రాజకీయ ప్రస్థానం కొండపి నియోజకవర్గంలోనే ప్రారంభం అయిందని, నియోజకవర్గంలో ఎవరికి ఏ అవసరం వచ్చినా, ఏ ఇబ్బంది ఎదురైనా నా దృష్టికి తీసుకువస్తే వెంటనే స్పందించి సమస్యను పరిష్కరిస్తానని నియోజకవర్గ ప్రజలకు అభయం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్‌పి వైస్ చైర్మన్ నూకసాని బాలాజి, రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ దివి శివరాం, ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, బెల్లం సత్యనారాయణ, జిల్లా తెలుగుయువత అధ్యక్షులు షేక్ కరీముల్లా, నియోజకవర్గ యువ నాయకులు దామచర్ల సత్య, నాయకులు సనె్నబోయిన మాలకొండయ్య, వెంకటేశ్వర్లు, షేక్ సలీమ్‌బాషా, రోశిరెడ్డి, మూలగుంటపాడు సర్పంచ్ సిహెచ్ కిరణ్‌కుమార్, ఊళ్లపాలెం సర్పంచ్ లక్ష్మీనారాయణ, గ్రామప్రజలు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.