ప్రకాశం

గుంటూరు ఛానల్ పర్చూరు వరకు పొడిగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పర్చూరు, మే 25: సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న నల్లమడ ప్రాంత, పర్చూరు ప్రాంత రైతుల, ప్రజల కల నెరవేరనుంది. గుంటూరు ఛానల్‌ను పర్చూరు వరకు పొడిగించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. ఛానల్ ప్రాథమిక సర్వే పూర్తిచేసింది. గుంటూరు ఛానల్ పర్చూరు వరకు పొడిగిస్తే సుమారు 50వేల ఎకరాలకు సాగునీరు 50 గ్రామాలకు తాగునీటి సమస్య తీరుతుంది. దశాబ్ధాల కాలంగా ఈ ప్రాంత రైతాంగం పోరాటాలు చేసింది. స్పందించిన ప్రభుత్వం గుంటూరు ఛానల్ పొడిగింపు ప్రాధాన్యత ఇచ్చింది. కాలువ సర్వే పూర్తయిన తరువాత గుంటూరు ఛానల్ పొడిగింపు పనులు చేపడతారు. పులిచింతల ప్రాజెక్టు డీఈ మల్లికార్జునరావు నేతృత్వంలోని అధికారుల బృందం శుక్రవారం పర్చూరు వాగు వద్ద సర్వే నిర్వహించింది. ఈ సందర్భంగా డీఈ మాట్లాడుతూ గుంటూరు ఛానల్ గుంటూరు జిల్లా యామర్రు నుంచి పెదనందిపాడు వద్ద నల్లమడ వాగుకు కలిపి అక్కడి నుంచి రాజుపాలెం, పాలపర్రు, ఇనగల్లు, అగ్రహారం, దేవరపల్లి గ్రామాల మీదుగా పర్చూరు వాగుకు కలుపుతారని చెప్పారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు గుంటూరు ఛానల్ సర్వే గత 30రోజుల నుంచి నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మొదటి ఫేస్ పర్చూరు వరకు పొడిగిస్తారని, ప్రస్తుతం కాలువ అలైన్‌మెంట్ సర్వే పూర్తిచేసినట్లు తెలిపారు. ఇంకా బ్రిడ్జీల సర్వేలు చేయాల్సి ఉందన్నారు. వాగు ప్రవహిచే చోట రోడ్లు ఉంటే అక్కడ బ్రిడ్జీలు, సైఫన్లు నిర్మించవలసి ఉంటుందన్నారు. ఈ రకంగా మొత్తం 16వరకు ఉన్నాయని, వీటి సర్వే పూర్తిచేయవలసి ఉందన్నారు. సర్వే కార్యక్రమంలో జేఈలు జీవరత్నం, సత్యనారాయణ, శ్రీనివాసరావు, నాగేశ్వరరావు, బుల్లయ్య, నల్లమడ ప్రాంత రైతుసంఘ నాయకులు రాజమోహనరావు, ఆచార్యులు, కృష్ణమోహన్, హరిబాబు, కృష్ణారావు, సత్యం తదితరులు పాల్గొన్నారు.