ప్రకాశం

అత్యాచారం చేసిన నిందితులను కఠినంగా శిక్షించేలా చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు అర్బన్, మే 25: జిల్లాలో పదిసంవత్సరాల మైనర్‌బాలికపై అత్యాచారం చేసిన వారిపై రాష్ట్రప్రభుత్వం కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకుంటుందని రాష్టమ్రహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపునేని రాజకుమారి తెలిపారు. అత్యాచారానికి గురై ఒంగోలు రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దోర్నాల మండలం తుమ్మలబైలు గ్రామానికి చెందిన బాలికను ఆమె శుక్రవారం పరామర్శించారు. ఈ సందర్బంగా నన్నపనేని మాట్లాడుతూ బాలికపై అత్యాచారం దురదృష్టకరమని అన్నారు. రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు జరగటం సిగ్గు చేటన్నారు. దేశవ్యాప్తంగా ఇటీవల కాలంలో మైనర్‌బాలికలపై అత్యాచారాలు జరగటం మానసిక ఆవేదనకు గురిచేస్తున్నాయన్నారు. ఇటువంటి సంఘటనలపై ప్రభుత్వం, మీడియా, శిశుసంక్షేమశాఖ అధికారులు కలిసి చైతన్యపరచాలని అన్నారు. ఆడపిల్లలపై తండ్రులు, తాతయ్యలు, బాబాయిలతోపాటు ఇరుగుపొరుగువారే ఎక్కువుగా అఘాయిత్యాలకు పాల్పడుతున్నట్లు పోలీసు స్టేషన్లలో కేసులు నమోదవుతున్నాయని ఆమె తెలిపారు. కన్నతండ్రే కసాయిగా మారితే ఆడపిల్లలు ఇక ఎవరికి చెప్పుకోవాలంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇటువంటి సంఘటనలు జరగకుండా ప్రజలను చైతన్యపరచాలని ఆదేశించారని, అందులో భాగంగా జిల్లాలవారీగా ర్యాలీలు చేపట్టామని ఆమె అన్నారు. అత్యాచార సంఘటనల నివారణలో భాగంగా కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ప్రత్యేకంగా కొంత బడ్జెట్ కేటాయించి హోర్డింగ్‌లు, పోస్టర్ల ద్వారా రాష్టవ్య్రాప్తంగా అందరినీ చైతన్యపరిచే ప్రయత్నం చేయాలన్నారు. ఆడపిల్లలు బయటకు వెళ్లాలంటేనే భయబ్రాంతులకు గురవుతున్నారని, ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఇటువంటి జరగటం బాధ కలిగిస్తోందన్నారు. కాగా మార్టూరు మండలం వలపర్లగ్రామానికి చెందిన మైనర్ బాలికను ప్రేమ వ్యవహరంలో దించి అత్యాచారానికి గురిచేసిన గుంటూరు జిల్లా కాజ గ్రామానికి చెందిన నిందితుడిపై బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారని, బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు అత్యాచారం చేసిన నిందితుడిని కడపలో పట్టుకుని మార్టూరు జైలుకు తరలించారని మహిళా కమీషన్‌చైర్మన్ రాజకుమారి తెలిపారు. ప్రభుత్వం నిర్బయ చట్టాన్ని తీసుకువచ్చినప్పటికీ ఆడపిల్లలపై అఘాయిత్యాలు జరగటం శోచనీయమన్నారు. నిర్బయచట్టాన్ని తూచతప్పకుండా అమలుపర్చేలా చూడాలన్నారు. అనంతరం రిమ్స్ వైద్యశాలలో సఖీ వన్ స్టాప్ సెంటరుతోపాటు వివిధ విభాగాలను ఆమె పరిశీలించారు. చైర్‌పర్సన్ పర్యటన కార్యక్రమంలో మహిళా కమిషన్ సభ్యురాలు తమ్మిశెట్టి రమాదేవి, రిమ్స్ డైరక్టర్ డాక్టర్ మస్తాన్ సాహెబ్, ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరక్టర్ సరోజినీ, ఎపీడీఎస్ విశాలాక్ష్మి, శిశు సంక్షేమశాఖ సంయుక్త సంచాలకులు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.