ప్రకాశం

పనితీరు మెరుగుపరచుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, మే 25: పనితీరును మెరుగుపరచుకుని నగరాలు, పట్టణాల అభివృద్ధిలో వచ్చే ఆరునెలల్లో గణనీయమైన పురోగతి సాధించాలని మున్సిపల్‌శాఖ మంత్రి పి నారాయణ మునిసిపల్ కమీషనర్లు, అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక ఎన్టీఆర్ కళాక్షేత్రంలో ప్రకాశం, నెల్లూరు జిల్లాల మున్సిపల్ కమీషనర్ల సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ప్రకాశం జిల్లాలోని మున్సిపాలిటీల్లో 14వ ఆర్థిక సంఘం నిధులు, 2015-16, 2016-17, 13వ ఆర్థిక సంఘం మిగులు నిధులు, సాధారణ నిధులు, ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక నిధులు, అమృత్ నిధులు, స్వచ్చాంధ్ర నిధులతో చేపట్టిన వివిధ రకాల పనుల పురోగతిని మంత్రి అడిగి తెలుసుకున్నారు. చీమకుర్తి మినహా ఒంగోలు నగరపాలక సంస్థతో సహా జిల్లాలోని గిద్దలూరు, అద్దంకి, కందుకూరు మున్సిపాలిటీలకు కేటాయించిన కోట్లాదిరూపాయల నిధులు సరిగా ఖర్చు చేయకపోవటంపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. మున్సిపాలిటీలకు కెటాయించిన నిధులను సకాలంలో ఖర్చుచేసి ప్రజలు ఇబ్బందులను తొలగించాలని, కనీస వౌళికసదుపాయాలు కల్పించేందుకు ప్రత్యేకశ్రద్ద చూపాలన్నారు. ఇకపై నిధులు సద్వినియోగం చేసేవారికి నిధులు అదనంగా కేటాయిస్తామన్నారు. ఎప్పటికపుడు నిధుల వ్యయం, పనుల పురోగతిని సమీక్షించాలన్నారు. సరైన ప్రణాళికతో సక్రమంగా పనులు చేస్తే అనుకున్న ఫలితాలు సాధించవచ్చని తెలిపారు. ఇకపై 15రోజులకు ఒకసారి సమావేశాలు నిర్వహించి సమీక్షించాలన్నారు. వచ్చే ఆరునెలల్లో నగరాలు, పట్టణాల్లో అభివృద్ధి కనబడాలని సూచించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం రావాలన్నారు. నిధుల వినియోగంలో జరుగుతున్న జాప్యాన్ని నివారించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.
నగరాలు, పట్టణాలలోని ఆసుపత్రులు, పాఠశాలలు, అంగన్‌వాడీ నిధులపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి తెలిపారు. గత సంవత్సరం 49పాఠశాలల్లో విద్యార్థులకు పదికి పది పాయింట్లు వచ్చాయని, వచ్చే సంవత్సరం 15వందల పాఠశాల్లో పదికి పదిశాతం పాయింట్లు లక్ష్యసాధనతో ముందుకు సాగాలన్నారు. మున్సిపాలిటీల్లో పెద్దఎత్తున సంస్కరణలు చేపట్టడంలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందన్నారు. రాష్ట్రంలో 75శాతం మున్సిపాలిటీల పనితీరు సంతృప్తికరంగా ఉందని, మిగతా మున్సిపాలిటీలు కూడా పనితీరు మెరుగుపరచుకోవాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర పురపాలక శాఖ సంచాలకులు కన్నబాబు, ప్రాంతీయ సంచాలకులు శ్రీనివాసరావు, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ దివి శివరాం, గిద్దలూరు, అద్దంకి, కందుకూరు ఎమ్మెల్యేలు ముత్తుమల అశోక్‌రెడ్డి, గొట్టిపాటి రవికుమార్, పోతుల రామారావు, సంతనూతలపాడు మాజీ ఎమ్మెల్యే విజయకుమార్, ప్రజారోగ్యశాఖ ఎస్‌ఈ మోహన్, ఒంగోలు మున్సిపల్ కమిషనర్ ఎస్.వెంకటకృష్ణ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల మున్సిపల్ కమీషనర్లు, ప్రజారోగ్యశాఖ ఇంజనీర్లు పాల్గొన్నారు.