ప్రకాశం

సోమశిల ఉత్తర కాలువ పనులను అడ్డుకున్న రైతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కందుకూరు, మే 26: రాళ్లపాడు ప్రాజెక్టుకు సోమశిల జలాలు అందించే సోమశిల ఉత్తరకాలువ పనులకు ఆటంకాలు వెంటాడుతూనే ఉన్నాయి. భూములు కోల్పోయిన రైతులు నష్టపరిహారం అందజేయాలని కోరుతూ శనివారం కాలువ పనులను అడ్డుకున్నారు. పోలీసుల రంగప్రవేశంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎన్నో ఏళ్లుగా సోమశిల ఉత్తర కాల్వ పనులు పెడింగ్‌లో ఉన్నాయి. ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా కాలువ పనుల్లో చలనం కలిగింది. అధికారులు జెసిబి సహాయంతో ఈనెల 19వ తేదీన ఎట్టకేలకు పనులు ప్రారంభించారు. పనులు ప్రారంభమైన క్షణాల్లోనే రైతులు పనులను అడ్డుకున్నారు. కాల్వ కింద భూములు కోల్పోయిన రైతులు తమకు నష్టపరిహారం చెల్లించి పనులు చేపట్టాలని కోరుతూ నెల్లూరు జిల్లా కొండాపురంకు చెందిన రైతులు డిమాండ్ చేశారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన నేతలు, అధికారులు ఈనెల 17వ తేదీన రైతులకు నచ్చజెప్పి 19వ తేదీన కాలువ పనులను ప్రారంభించారు. అయితే చింతలదీవి రైతులు మాత్రం కాల్వపనులు పూర్తయితే తమను ఎవరూ పట్టించుకోరనే అనుమానం వారిని వెంటాడుతూనే ఉంది. ఈ క్రమంలో శనివారం కూడా కాల్వపనులను రైతులు అడ్డుకుని తమకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. దీంతో రెవెన్యూ అధికారులు, పోలీసులు రంగప్రవేశం చేసి రైతులతో చర్చించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రైతులు తమకు నష్టపరిహారం చెల్లించాలని ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా చింతలదీవికి చెందిన రైతు ఓ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గతంలో అధికారులు, నాయకులు భూములకు ప్రస్తుత మార్కెట్ ప్రకారం ఎకరానికి రూ. 4.20లక్షలు చెల్లిస్తామని చెప్పి ఇప్పుడు మాట మార్చి ఎకరానికి రూ. 60వేలు ఇస్తామనడం సరికాదన్నారు. అయితే అధికారులు నష్టపరిహారం గిట్టుబాటు కాకపోతే బదులుగా ప్రభుత్వ భూములు ఇస్తామని అధికారులు రైతులకు నచ్చజెప్పారు. అయితే అధికారులు చూపించిన భూములు సాగుకు యోగ్యం కాని భూములు, వాగులు, వంకలు అని రైతులు చెబుతున్నారు. మాకు న్యాయం జరిగే వరకు కాలువ పనులను జరగనివ్వమని రైతులు స్పష్టం చేశారు. చింతలదీవి రైతుల డిమాండ్లను పరిష్కరించి సోమశిల కాల్వ పనులను సకాలంలో పూర్తిచేసి రాళ్ళపాడు ప్రాజెక్టుకు నీరందించి ఆయకట్టు రైతులను ఆదుకోవాలని రాళ్ళపాడు రైతు ప్రతినిధి కె మాదవరావు, పలువురు రైతు సంఘాల నాయకులు కోరుతున్నారు.