ప్రకాశం

జనసేన పార్టీ ఆధ్వర్యంలో సంఘీభావ దీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు అర్బన్,మే 26:శ్రీకాకుళం జిల్లాలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చేస్తున్న నిరాహర దీక్షకు సంఘీభావంగా శనివారం కలెక్టరేట్ వద్ద సంఘీభావ దీక్షను ఆ పార్టీ నేతలు నిర్వహించారు. ఈకార్యక్రమానికి జిల్లా జనసేన సేవాదళ్ ఇన్‌చార్జి ఆర్ బుజ్జి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి ఆరోగ్యశాఖమంత్రి లేకపోవటం దౌర్భాగ్యమన్నారు. త్వరలో ఆరోగ్యశాఖమంత్రిని నియమించకపోతే పోరాటం ఇంకా ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో కిడ్నీవ్యాధి బాధితులకు వైద్యం అందక అనేక ఇబ్బందులు పడుతుంటే రాష్టమ్రుఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పక్క రాష్ట్రాలకు వెళ్లి వారి పార్ట్భీవిష్యత్ రేపు ఏమైపోతుందోనన్న బాధ ముఖ్యమంత్రిలో ఉందన్నారు. అన్ని పార్టీల దగ్గరకు వెళ్లి మనందరం ఒకటిగా ఉందామని మళ్లీ ప్రజలను మోసం చేద్దామని శ్రమిస్తున్న ముఖ్యమంత్రి తమపార్టీ అధినేత పవన్ కల్యాణ్‌ను విమర్శించే స్థాయి లేదన్నారు. పార్టీనాయకులు రమేష్ మాట్లాడుతూ తమపార్టీ అధినేత ఆదేశిస్తే తామందరం ప్రజల పక్షాన పోరాటానికి సిద్ధంగా ఉంటామన్నారు. మరో నాయకులు చీకటి వంశీదీప్ మాట్లాడుతూ జనసేన పార్టీ ప్రజల కష్టాలను తీర్చేందుకు పుట్టిందన్నారు. ఈ ధర్నాలో పార్టీనాయకులు బండారు సురేష్, కందుకూరి బాబు, కల్యాణ్, అయినబత్తిన గోపి, ఆర్‌కె ముత్యాలు, రవిచంధ్ర, ఆళ్ళ అనిల్‌కుమార్, రమేష్, ఎస్‌కె రహీం, పిడుగు శ్రీను, సాయినాయుడు, పి రమేష్, డి వెంకటేశ్వర్లు, చక్రియాదవ్, చిట్టెం ప్రసాదు, ఆరిగ శివ, తోట మనోహర్, దండే సతీష్, ధనుష్, పెంట్యాలకోటి, దండె నాగార్జున, ఎ నాగరాజు, గోరంట్ల సాయి, బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.