ప్రకాశం

సివిఎన్ ఎన్నికల బరిలో 10 పదవులకు 20మంది పోటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు అర్బన్,మే 26: సివిఎన్ రీడింగ్ రూం అండ్ క్లబ్ ఎన్నికల బరిలో పది పదవులకు గాను 20మంది పోటీలో ఉన్నారని ఆ క్లబ్ ఎన్నికల అధికారి ఈదుపల్లి గురునాధం తెలిపారు. శనివారం మధ్యాహ్నం సివిఎన్ క్లబ్ ఎన్నికల కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటుహక్కును వినియోగించుకుని సభ్యులకు ఉదయం ఎనిమిదిగంటలకు అల్పాహారం, 11గంటలకు భోజన సౌకర్యాం ఏర్పాటుచేసేలా నిర్ణయం తీసుకున్నామన్నారు. అదేవిధంగా ప్రతిసభ్యుడు ఓటుహక్కును వినియోగించుకుని 15నిమిషాలకు మించి క్లబ్ ఆవరణలో ఉండకూడదని వెంటనే బయటకు వెళ్లిపోవాలన్నారు. ఈ విషయంపై సభ్యులందరు సహకరించాలని కోరారు. ఉదయం 8గంటల నుండి సాయంత్రం నాలుగుగంటల వరకు పోలింగ్ జరుగుతుందని, సాయంత్రం ఐదుగంటల నుండి ఓట్లలెక్కింపు ప్రారంభమై రాత్రి ఎనిమిది గంటల నుండి ఫలితాలను విడుదల చేస్తామన్నారు. ఆదివారం జరిగే ఎన్నికల్లో ఒక్కొక్క పదవికి ఇద్దరు చొప్పున పది పదవులకు 20మంది అభ్యర్థులు బరిలో నిలిచారన్నారు. సివిఎన్ క్లబ్‌లో 11 పదవులు ఉన్నాయని, జాయింట్‌సెక్రటరీ పదవి ఏకగ్రీవం కావటంతో పది పదవులకు అభ్యర్థులు పోటీలో నిలిచారన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసుశాఖ ప్రత్యేకదృష్టి సారించిందన్నారు. ఈ సమావేశంలో ఎన్నికల కమిటి సభ్యులు పుట్టంరాజు రాఘవ, కఠారి శంకర్ తదితరులు పాల్గొన్నారు.