ప్రకాశం

హోరాహోరిగా సివిఎన్ రీడింగ్ రూం ఎన్నికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు అర్బన్,మే 27:సివిఎన్ రీడింగ్ రూం అండ్ క్లబ్ ఎన్నికలు ఆదివారం హోరాహోరిగా సాగాయి. సివిఎన్ రీడింగ్‌రూం క్లబ్‌లో 940మంది ఓటర్లు ఉండగా అందులో 744మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఉదయం ఎనిమిదిగంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం నాలుగుగంటల వరకు కొనసాగింది. అనంతరం సాయంత్రం ఐదుగంటలనుండి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగింది. ఎన్నికల అధికారి ఈదుపల్లి గురునాధం, ఎన్నికల కమిటీసభ్యులు కఠారి శంకర్, రాఘవులు కౌంటింగ్ ప్రక్రియను పర్యవేక్షించారు. సివిఎన్ రీడింగ్ క్లబ్ ఎన్నికల బరిలో అధ్యక్షునిగా తాతా శ్రీనివాసులు, చిల్లరసుబ్బారావు పోటీపడ్డారు. ఉపాధ్యక్షులుగా పోగుల మురళీ, షేక్ నజీర్, కోశాధికారులుగా జడా బాలనాగేంద్రబాబు, రావి వెంకటసుబ్బారావు, కార్యదర్శులుగా మొగిలిపువ్వుబాబు, తిరుమల శెట్టి రాజేష్‌లు పోటీలో ఉన్నారు. ఇసి మెంబర్లుగా అంబటి మహాలింగం, బూచి వనమాలి, మిరియం రాంబాబు, కుర్రా ప్రసాదుబాబు, ఉన్నం శేషుబాబు, గడియారం నాగరాజు, కొచ్చేర్ల శ్రీహరిరావు, మద్దాళి వెంకటరమేష్‌బాబు, తేళ్ల సుగణ్‌రాజు, ఏసుపోగు ఏసుదాసు, ధనిశెట్టి రాము, తిరుమలశెట్టి శ్రీరాంమూర్తులు ఉన్నారు. ఇప్పటికే జాయింట్ సెక్రటరీగా నితిన్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సివిఎన్ రీడింగ్ రూం ఎన్నికల బరిలో పదిపదవులకు 20మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మొత్తం 30రౌండ్లల్లో కౌటింగ్ ప్రక్రియను ప్రారంభించారు. సివిఎన్ రీడింగ్ క్లబ్ అధ్యక్షబరిలో తాతా సుబ్బారావుకు 443ఓట్లు రాగా, చిల్లర సుబ్బారావుకు 315 ఓట్లు వచ్చాయి. 16ఓట్లు తిరస్కరణకు గురయ్యాయి. దీంతో ఎన్నికల అధికారి ఈదుపల్లి గురునాధం మాట్లాడుతూ 128ఓట్ల మెజార్టీతో తాతా శ్రీనివాసులు గెలిచినట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా తాతా శ్రీనివాసులు మాట్లాడుతూ సమైక్యప్యానల్ ద్వారా అధ్యక్షపదవికి తాను పోటీచేయటం జరిగిందన్నారు. మంచిమెజార్టీతో గెలిపించినందుకు ఓటర్లకు పేరుపేరున కృతజ్ఞతలు తెలిపారు.