క్రైమ్/లీగల్

వడగండ్ల వానలు- ఈదురుగాలులు పిడుగుపాటుకు ఒకరి మృతి ముగ్గురికి గాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంతమాగులూరు మే 31: ఒక వైపు ఉరుములు మెరుపులు వడగండ్ల వాన, మరోవైపు ఈదురుగాలులు, గొర్రెల కాపురుపై పిడుగుపాటు ఒకరి మృతి, ఇరువురికి గాయాలు ఇదీ సంతమాగులూరు మండలంలో గురువారం సాయంత్రం 4నుండి 5గంటల మధ్య జరిగిన భీభత్సం. ఈ అనూహ్య సంఘటనలో గురిజేపల్లి గ్రామ పరిసరాల్లో గొర్రెల కాపరులపై పిడుగు పడి గొర్రెల కాపరి అనంత పెదబాబు(28) మృతి చెందగా దారం కోటేశ్వరరావు, లక్ష్మయ్య, చిన్నం పూర్ణయ్యలకు తీవ్రగాయాలయ్యాయి. కొమ్మాపాడు, మక్కెనవారిపాలెం ప్రాంతంలో వీచిన ఈ దురుగాలులు, వడగండ్ల వానలకు రేకుల షెడ్లు లేచిపోయాయి. సంతమాగులూరు మండలంలో గరువారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా ఉరుములు, మెరుపులు ఈదురుగాలు వడగండ్ల వాన అన్నీ ఒకే సారి చుట్టుముట్టాయి. మాండలానికి దక్షిణ ప్రాంతమైన కొమ్మాలపాడు, మక్కెనవారిపాలెం ప్రాంతాలలో ఈదురుగాలు భీభత్సం సృష్టించగా, మండల తూర్పు ప్రాంతమైన గురిజేపల్లి , చవటిపాలెం ప్రాంతాలలో ఉరుములు , మెరుపులు పిడుగు పాటు సంభవించాయి. ఈదురు గాలులకు కొమ్మాలపాడు సెంటర్‌లోని దుకాణాల రేకుల పైకప్పులన్నీ లేచి రేకులు గాలిలోనే చెక్కర్లు కొట్టాయి. అర్థగంటపాటు గాలులతోకూడిన వడగండ్ల వానకురిసి జన జీవనాన్ని అయోమయానికి గురిచేసింది. దుకాణాలలోని తినుబండారాలన్నీ గాలిలో తేలిపోయాయి. గురిజేపల్లి చవటిపాలెం ప్రాంతంలో గాలులు తక్కువగా ఉన్నా ఉరుములు, మెరుపులు గుండెల్లో రైల్లు పరిగెత్తించాయి. గురిజేపల్లి పొలాల్లో గొర్రెల కాపరులపై పిడుగుపడి అనంత పెదబాబు అక్కడి కక్కడే కన్ను మూయగా, ఆయనకు తోడుగా గొర్రెలు కాస్తున్న అనంత లక్ష్మయ్య, చిన్నం పూర్ణయ్య లకు విద్యుత్ షాక్ తగిలినట్లుగా శరీరం పై గాయాలయ్యాయి. స్థానికులు పెదబాబు మృతదేహన్ని ఇంటికి తరలించగా, క్షతగాత్రులను నరసరావుపేట వైద్యశాలకు తరలించారు. విషయం తెలుసుకున్న తహశీల్దార్ టీఎల్ కాంతారావు, ఎస్సై వై .నాగరాజు , వీఆర్వో వెంకట్రావులు హుటాహుటీన గురిజేపల్లి వెళ్లి క్షతగాత్రులకు అత్యవసర వైద్య సహాయానికి తరలించారు. పిడుగుపాటుకు మృత్యువాత బడిన అనంత పెదబాబుకు పదేళ్ల క్రితం అరుణతో వివాహామైంది. పిల్లలు లేరు. పెదబాబు ఆకస్మిక మృతి పట్ల గురిజేపల్లి విషాదంలో మునిగింది.

దర్శిలో ఈదురుగాలులతో కూడిన వర్షం
దర్శి,మే 31:దర్శి పట్టణంలో గురువారం మధ్యాహ్నం మూడుగంటల ప్రాంతంలో ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన కురిసింది. ఇటీవల రోజురోజుకు పెరుగుతున్న ఎండల తీవ్రతనుండి ఈవర్షంతో ఈ ప్రాంతప్రజలకు ఊరట లభించింది. నైరుతి రుతుపవనాలు సకాలంలో ప్రవేశిస్తే ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా పడితే పంటలు పండించుకోవచ్చునని రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

పిడుగుపాటుకు గేదెమృతి
ముండ్లమూరు,మే 31:పిడుగుపడి గేదె మృతిచెందిన సంఘటన మండలంలోని వేములగ్రామంలో గురువారం జరిగింది. ఆగ్రామానికి చెందిన గజ్జెల అంకిరెడ్డి తమ గేదెలను పొలానికి తోలుకువెళ్లి తిరిగి గ్రామ సమీపానికి రావటంతో ఉరుములు ,మెరుపులతో కూడిన చిరుజల్లులు పడ్డాయి. ఆ సమయంలో గేదెపై పిడుగుపడటంతో మృతిచెందింది. సుమారు 70వేల రూపాయల విలువైన గేదె మృతిచెందిందని బాధిత రైతు తెలిపారు. ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన కోరారు.